49. SOCIAL-44) ) నాకు అన్నీ ప్రశ్నలే...జవాబులు లేవు...
భరతమాత శిరోభారంకు మందే లేదా? అసలు మందివ్వా లానే జ్ఞానం ఎవ్వరికై నా ఉందా?
నాకు అన్ని ప్రశ్నలే....ఎవ్వరి దగ్గర సమాధానం లభించలేదు.
ఈ తరానికైనా సమాధానం దొరికేనా?
బ్రిటిష్ ఇండియాకు స్వతంత్రం ప్రకటించగానే దేశానికి పురిటి నొప్పు లెందు కొచ్చాయి. అవి పురిటి నొప్పులా? హింస తాలుకు రోధనలా?
ఇండియా విభజనకు ముందర మతకల్లోలాలు ఎందుకు జరిగాయి. భారత ప్రధాన మంత్రి పదవికై మొహమ్మదాలి జిన్నా మరియు జవహర్ లాల్ ల పదవీకాంక్ష కొట్లాట ఇందుకు కారణమా? జిన్నా ప్రధాన మంత్రిగా గాంధి ఒప్పుకోవటానికి సిద్ధపడినందుకే గాంధీ హత్య జరిగిందా? మెజారిటీ కాంగ్రెస్ నాయకుల అభీష్టం మేరకు సర్దార్ వల్లభాయి పటేల్ ను గాంధీ ఆమోదించి వుంటే జిన్నా ప్రధాన మంత్రి పదవికై పోటీకి రాకుండా వుండే వాడా? సర్దార్ పటేల్ భారత ప్రధాన మంత్రి అవుతే జమ్మూ & కాశ్మీర్ వివాదం సమసి పోయి ఉండేదా? రావణ కాష్టంలా కాల కుండా వుండి ఉండేదా?
సంవత్సరాల తరబడి లక్షల కోట్ల రూపాయల ధనం కాశ్మీర్ మీద వెచ్చించడం, వేల మంది భారత వీర సైనికుల మరణం ..దేశానికి ఎంత వరకు లాభం చేకూరింది. ఆ భూభాగం కోసం దేశం మొత్తము ఇబ్బందుల పాలుకావటం ఏమి రాజనీతి?
బంగ్లాదేశ్ విమోచనం సమయంలో అపరాకాళీ గా పేరుపొందిన అప్పటి భారత ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ వేలమంది పాకిస్తానీ సైనికులను తన దగ్గరనుండి బేషరతుగా విడుదల చేయటమెందుకు? జమ్మూ కాశ్మీర్ వివాదానికికు అప్పుడే తెలివి గా ముగింపు పలుకవచ్చును గదా? అది మన వైఫల్యం కాదా?
ఆనాటి భారత ప్రధాన మంత్రి శ్రీ పండిట్ జవహలాల్ నెహ్రూ అనాలోచిత చర్యలు కాశ్మీర్ వివాదానికి ఆజ్యం పోస్తే, తరువాత ప్రధాని ఇందిరా గాంధి నిర్లక్ష్యానికి కాశ్మీర్ ఆజ్యం ఆకాశానికి ఎగసింది. భారత యువత భవిత అంధకారం లో కొట్టు మిట్టాడుతోంది.
విషయ విశ్లేషణ ఏనాడైనా జరిగేనా? రావణ కాష్టం ఆరిపోయేనా?
భారత మాత సిరో భారం తగ్గేనా? దీనికి కారణం ఎవ్వరు? పరిష్కర్తలు ఎవ్వరు?
పై ఫోటోలో భారత అగ్ర నాయకులు వరుసగా బాబు రాజేంద్ర ప్రసాద్, నెహ్రు, సర్దార్ వల్లభాయి పటేల్, రాజగోపాలా చారి, డాక్టర్ అంబేద్కర్ మరియు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్
----పెండ్యాల వాసుదేవరావు.
Comments