45.(NKP-6). శ్రమదానంతో రోడ్ నిర్మాణం. భావి తరాలకు ఆదర్శం.
శ్రమదానంతో రోడ్ నిర్మాణం. భావి తరాలకు ఆదర్శం.
ఆ రోజుల్లో భారత్ సేవక్ సమాజ్ అనే సంస్థ ఒకటి వుండేది. ఖమ్మం జిల్లాలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసేది. దానికి స్వాతంత్ర సమరరయోదులు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు కొంత కాలం ప్రెసిడెంట్ గా వున్నారు.
నేలకొండపల్లి నుండి బోడులబండ కు ప్రస్తుతమున్న రోడ్ వారు నిర్మించినదే.
ఖమ్మంజిల్లా ఏర్పడిన తరువాత జిల్లాలో చాలా చోట్ల గవర్నమెంట్ డొంకలు ప్రజల సౌకర్యార్ధం తన రూపురేఖలను ప్రభుత్వ అనుమతితో మార్చుకున్నాయి.
నేలకొండపల్లి నుండి తిరుమలాపురం,బోడులబండ, కోరట్లగుడెం ద్వారా రాజేశ్వరపురం, కూసుమంచి మార్గాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. కాని బోడులబండ మరియు పరిసర గ్రామాల పజలందరూ దాన్ని వ్యతిరేకించారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు యువకులు, విధ్యార్ధులతో శ్రమదానం క్రింద ఆరోడ్ నిర్మాణం గావించారు. ఆ రోజుల్లో అదో SENSATIONAL NEWS. ఉద్యమ స్పూర్తితో ఆ నిర్మాణం గావించారు.
ఆకార్యక్రమం ఒక నెల రోజులపాటు జరిగింది.నేలకొండపల్లి విద్యార్థుల పర్యవేక్షణ కోసం టీచర్ శ్రీ ద్రోణంరాజు కృష్ణా రావు, ఖమ్మం MUTIPURPOSE SCHOOL నుండి వచ్చిన విద్యార్థుల పర్యవేక్షణ కోసం అక్కడి ఇంగ్లీష్ టీచరు (ముస్లిం) పనిచేశారు.
విషయం తెలుసుకున్న హైదరాబాద్ రాష్ట్ర హోంశాఖా మంత్రి శ్రీ మందుగుల నరసింగ రావు ఆ కార్యక్రమం ఆఖరులో వచ్చారు, శ్రమదానంలో తానూ పాల్గొన్నారు.
క్రింద వున్న చిత్రం భారత్ సేవక్ సమాజ్ సమావేశంలో ఖమ్మం ప్రక్కనున్న వెంకటాయపాలెంలో ప్రసంగిస్తున్న శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు.. ఆ సమావేశం లో కుడా శ్రీ మందుముల నరసింగ రావు పాలుగొన్నారు.
This generation politicians should learn about this type of politicians and their contributions to the society.
-----పెండ్యాల వాసుదేవరావు.
<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>
Comments