Posts

82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

ఖమ్మంకు  ఆత్మాభిమానం  లేదనుకున్నారా? లోకసభ ఎన్నికల బరిలో ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి. ఏవేవో కులాల కొట్లాటలు కనిపిస్తున్నాయి.  ఖమ్మం ఎన్నికల సమరాంగణములో ఏవేవో రాజకీయ మంత్రాంగాలు నడుస్తున్నాయి. ఖమ్మం ఆత్మాభిమానం ఎవ్వరికీ అక్కరలేదా ?. ఆత్మాభిమానం మంటగలుస్తున్నా . పౌరుషం ఆనవాళ్లు కనిపిస్తలే. ఖమ్మం ఉద్యమాల గుమ్మం. తెలుసా ఈ తరానికి? చరిత్ర ఎవ్వరైనా చెప్పారా? నాకు తెలిసి, ఉద్యమాలలో  కీలక స్థానాల్లోవుండి  త్యాగాలు చేసిన వారికో,  వారి కుటుంబ సభ్యులకో...  పార్టీ లోనో, ప్రభుత్వ, రాజ్యాంగ స్థానాలలోనో  ఉద్యమకారులకు, వాటి బాధితులకు అవకాశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళ బాలిదానాలతో, ఆత్మార్పణతో ఏర్పడ్డ రాష్ట్రంలో మాది ఫక్తు రాజకీయ పార్టీ, ఇక్కడ మాకు అధికారంలోకి రావటమే మాలక్ష్యం ఉద్యమకారులతో, ఉద్యమంతో మాకు సంబంధం లేదు అని ప్రకటించడానికి ఉద్యమనాయకులకు న్యాయమా? నైజాం పై పోరాటం సమయంలో, 1968 తెలంగాణా ఉద్యమ సమయంలో, 2000 సం.లో తర్వాత ప్రత్యేక తెలంగాణ పోరాటం సమయం ఉద్యమకారుల చూశాను. త్యాగాలు చేసిన వారికి ఎవ్వరికీ గుర్తింపులు లేవ్. బ్రిటిష్ ఇండియా స్వాతంత్ర చరిత్ర చూసినా అదే జరిగింది. అక్కడ ఒకే కుటుంబం అందల

81. (SOCIAL--54) ఔనా? నిజమేనా?

Image
పల్లెల్లో సందడి మొదలైంది అలజడి మొదలైంది పంచాయతీ ఎన్నికల నగారా మ్రోగబోతోంది. "చేతులకు" పనిమొదలైంది "కార్లలో" ఇంధనం రెఢీ అవుతోంది "కోడవళ్లు" నూరటం షురూ అయింది. ఓ నడి వయస్సు పలుకరించింది అయ్యా చూస్తున్నరా? కాలం మారింది తరం మారింది ఓటు వేయాలంటే నోటియ్యాల గెలవాలంటే కోట్లు గావాలే యెట్లయ్యా గిట్లయితే?.... ఓ ప్రశ్న నా మనసును తట్టి లెపింది. గీట్లయితే ఎట్లా? నువ్వు రా అయ్యా యీరందరికీ బుద్ది చెప్పాలయ్యా నువ్వు నిలబడయ్యా అంది  ఆ రోజులు మళ్లీ రావాలయ్యా అంది. ఆలోచనలు ముసిరాయి యుద్ధాన్ని మొదలెట్టాయి. ఉద్యమానికి ఎక్కడో ఒకచోట  ప్రారంభం కావాలి కదా తొలి అడుగు పడాలి కదా అది ఇదే ఎందుకు కాకూడదు నడువు అని చెప్పింది. నా ఆలోచన అందీ.. కుడి యెడమ అయితే  ఇమేజ్ పోదా అని .. మనసు గీ పెట్టింది. ఉద్యమం అన్నాక కష్టాలు, నష్టాలు ఉండవా? మరకలు పడితే శుభ్రం కావా? యువతరం ఆ పని చేస్తుంది నువ్వు పదా అంది. ఔనా? నిజమేనా? చెప్పండి. .... ...పెండ్యాల వాసుదేవరావు <!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91">&l

80. (SOCIAL--53) దేశంలో ప్రజా సేవ ఇంత Costly నా? ఎవ్వరికీ బాధ్యతలు లేవా?

Image
                                    ఈ దేశంలో ప్రజాసేవ                                     ఇంత costly అయిందా?                                     వింటున్నాం                                      నియోజకవర్గంలో                                      ఒక అభ్యర్థికి 400-500 కోట్లు ఖర్చు,                                     అవతల వారూ అంతే..                                     నేనేమీ తీసిపోలేదంటూ..                                     అంతసొమ్ము ఇద్దరూ కలిసి                                     నియోజక వర్గ సమస్యలపై                                     ఖర్చు పెడితే                                     బతికినంతకాలం                                     జనం మిమ్ములను                                     వారి వారి హృదయాలలో                                      దాచుకుంటారు కదా!                                      మిమ్ముల పూజిస్తారు కదా!                                      డబ్బు ఖర్చుపెట్ట దలచుకుంటే                                      పై మార్గంలో వెళ్ళండి.                            

79. (social..52). మీరు నమ్ముతారా. ఎన్నికలు అంటే అలావుండాలి

Image
                                                    ఎన్నికలు .. సంస్కరణలు అంటే  నాకు  మా ప్రక్కగ్రామం అయిన బొదులబండకు చెందిన కీ.శే. శ్రీ పొట్టి పింజర హుసేనయ్య  జ్ఞాపకం వస్తాడు  1978 లో  ఆయన  పాలేరు నియోజక వర్గానికి ఏం. యల్. ఏ.గా గెలిచాడు   ఆ కాలంలో  ఆయన ప్రచారంలో  హంగు ఆర్భాటాలు లేవు.  మైకుల హోరులు, వాహనాల రొదలు అసలే లేవు.  ఊరేగింపులు, గడప గడపకు ప్రచారాలు లేవు.  ఒకటో, రెండో సమావేశాలు జరిగాయోమో  నాకైతే గుర్తు లేదు. మీరు నమ్ముతారా? పోలింగ్ జరిగేటప్పుడు పోలింగ్ స్టేషన్ లో  ఏజెంట్లు కూడా లేరు. పార్టీ గుర్తు చెప్పేవాళ్ళు అసలే లేరు.  సామాన్య జనంలో ఇందిరమ్మపై  అభిమానం ఉప్పెనలా ఉప్పొంగింది.  హుసేనయ్యను ఏం.ఎల్.ఏ గా గెలిపించింది. అంతకు ముందు మూడు పర్యాయాలు  ఏం. ఎల్. ఏ గా వున్న వ్యక్తిని ఓడగొట్టారు. అధికార పార్టీ అయిన కాంగ్రెసును  కాంగ్రెసు వాదులే ఓడించారు       ఇందిరమ్మ కాంగ్రెసును గెలిపించారు  అదే ఇప్పుడు మిగిలింది  జన బలం అది. జన శక్తి అలాంటిది. అలా వుంటే అందరూ బాగుంటారు  ఎన్నికల్లో ఓడినా  ఎవ్వరికీ గుండెపోటు రాదు. అందరి ఆస్తులకు రక్షణ లభిస్తుంది  ----పెండ్యాల వాసుదేవ రావు.       తేదీ: 05.11.20

78. (social...51). ఎవవరెవరో ఎక్కడినుండో వస్తారు..... ఆలోచించండి ప్రజలారా...

Image
ఆలోచించండి.  ఎన్నికల సందడి మొదలు కాగానే ఎవ్వరెవ్వరో వస్తారు ఎక్కడెక్కడి నుండో వస్తారు చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు,  దూరిపోతారు  తెగ హడావుడి చేస్తారు దండలు/ఓ ట్లు వేయించుకుంటారు కుర్చీలో/పదవిలో కూర్చుంటారు ఆ తరువాత ఏమీ పట్టించుకోరు ఏటో వెళ్ళిపోతారు ధన సంపాదనలో మునిగి పోతారు సమస్యలన్నీ పేరుకు పోతాయి సమాజం లో చీకట్లు ముసురుతాయి …. ఎన్నికల్లో  ఎప్పుడూ తక్కువ బడ్డుకు ఓటేద్దాం అనే  భావానికి అలవాటు పడ్డారు జనం ఆ ప్రభుత్వం మీద కోపం వుంటే   దాని ప్రత్యర్థి పార్టీకి, ప్రత్యర్థి పార్టీకి అధికారం వచ్చి దీనిపై కోపం వస్తే మాజీ అధికార పార్టీకి ఓటు వేయడం తప్ప గత్యంతరం లేని స్థితి ప్రత్యామ్నాయం లేని దుస్థితి… ఏదీ, ఏమీ ఆలోచించలేని సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఒకవైపు….. స్వలాభాలకోసం కార్యకర్తల ప్రయోజనాలు తాకట్టు పెట్టి అభ్యర్దుల నిర్ణయాలతో రాజకీయ పార్టీలు మరోవైపు….. ఈ పార్టీల వ్యవస్థ అవస్థల పాలు చేస్తోంది.. ఎన్నికల సంస్కరణల కొరడా పైకెత్తి యువతరం కార్య రంగంలోకి దిగవలసిన సమయం వచ్చింది, దొంగలు, దొంగలు వూళ్ళు పంచుకున్నట్లు గెలిచిన ప్రజాప్ర

77. (social..50). ప్రజాస్వామ్యం.....ఎన్నికలు.

Image
                     ప్రజాస్వామ్యం.....ఎన్నికలు.                      ప్రజాస్వామ్యం                     నన్ను తట్టి నిద్ర లేపింది.                     నిద్రమత్తు వదిలింది.                     అంటోంది                     ఎలక్షన్లు దండగ,                     కావొచ్చు ప్రజలకు పండగ...,                     కానీ నిజానికి                     అది పండగ కాదని,                    ఓటును రెండు/మూడు వేల రూపాయలుకు అమ్మటం,                    1825 రోజులకు(అయిదు సం.లు పదవీకాలం)                    రోజుకు రూపాయి చిల్లరకు                    జీవితాన్ని                    తాకట్టు పెట్టటమే అవుతుంది కదా అంటున్నట్లు వినబడింది.                    నిజమేనండీ...                    రోజు కూలి Rs 500/- చొప్పున  1825 x 500=                    Rs 9,25,000/-                    ఇస్తే బాగుంటది ..                    ఎక్కడిదో ఓ సన్నని కంఠం                    ఫుట్ పాత్ పై మందు మత్తులో జోగుతూ                      పడి వున్న బక్క పలుచని శరీరం తాలూకు ధ్వని                     వినిపించింది,                     ఆ మాటకు అంత ప్రాధాన్య

76. (social..49). రాజకీయ రంగం సమస్తం కుళ్ళి కంపు కొడుతోన్న వైనం.

Image
 ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ? రాజకీయ రంగం సమస్తం కుళ్ళి కంపు కొడుతోన్న వైనం. బీ.ఆర్.ఎస్  పార్టీలో టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలోకి  ..  కాంగ్రెస్ పార్టీ లో టికెట్ దొరకలేదని  బీ.ఆర్.ఎస్/బీ.జె.పీ.లోకి .... పిల్లనిచ్చి/టికెట్ ఇచ్చి పెళ్లి చేసినా/గెలిపించినా    తాళి కట్టిన మరుక్షణమే, కాళ్ళ పారాణి ఆరకుండానే   వేరే వాళ్ళతో లేచి పోడనే గ్యారంటీ ఏమిటీ? కళ్ళముందు కనిపిస్తున్నదే  కదా! సర్వేలమీద సర్వేలు చేసి  గెలుపు గుర్రాల పసిగట్టి వాటేసుకొనే వారు కొందరు..  గెలిపించిన కార్యకర్తలను, పార్టీని నట్టేట ముంచి  డబ్బు కోసం /కాం ట్రాక్టుల కోసం  గడ్డితినే వారు ఇంకొకరు... చాలా భలేగుంది మీ రాజకీయం... పార్టీ సభ్యత్వం లేకుండా శతాబ్దాల/దశాబ్దాల పార్టీలోకి  లేచిపోయి వచ్చినోళ్ళకి  కుర్చీ లిస్తే  వాళ్ళనే అందలమెక్కిస్తే  ఇంతకాలం పల్లకీ మోసిన, చమటోడ్చిన, త్యాగాలతో బతుకీడ్చిన   కార్యకర్తలకు  ఎవ్వరు  భరోసా? టికెట్ కోసం వచ్చిన అవతలోడికి  నీ సిద్దాంతాలతో పనిలేదు  నీ నాయకులపై గౌరవం వుండదు  నిన్నటి వరకు నిన్ను బూతులు తిట్టినోడు  ఈరోజు నీకు ఎలా ముద్దు అయినాడు?  తప్పదు. మీకు బుద్ది చెప్పాలి . వెట్టి చాకి