Showing posts with label REGIONAL. Show all posts
Showing posts with label REGIONAL. Show all posts

Tuesday, April 9, 2024

ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

  82. (SOCIAL.55).
ఖమ్మంకు  ఆత్మాభిమానం  లేదనుకున్నారా?

లోకసభ ఎన్నికల బరిలో
ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి.

ఏవేవో కులాల కొట్లాటలు కనిపిస్తున్నాయి. 


ఖమ్మం ఎన్నికల సమరాంగణములో

ఏవేవో రాజకీయ మంత్రాంగాలు నడుస్తున్నాయి.


ఖమ్మం ఆత్మాభిమానం ఎవ్వరికీ అక్కరలేదా ?.

ఆత్మాభిమానం మంటగలుస్తున్నా .

పౌరుషం ఆనవాళ్లు కనిపిస్తలే.


ఖమ్మం ఉద్యమాల గుమ్మం.

తెలుసా ఈ తరానికి?

చరిత్ర ఎవ్వరైనా చెప్పారా?


నాకు తెలిసి,

ఉద్యమాలలో 

కీలక స్థానాల్లోవుండి 

త్యాగాలు చేసిన వారికో, 

వారి కుటుంబ సభ్యులకో... 

పార్టీ లోనో, ప్రభుత్వ, రాజ్యాంగ స్థానాలలోనో 

ఉద్యమకారులకు, వాటి బాధితులకు

అవకాశాలు ఇచ్చిన దాఖలాలు లేవు.

వాళ్ళ బలిదానాలతో, ఆత్మార్పణతో ఏర్పడ్డ రాష్ట్రంలో

మాది ఫక్తు రాజకీయ పార్టీ, ఇక్కడ మాకు

అధికారంలోకి రావటమే మాలక్ష్యం

ఉద్యమకారులతో, ఉద్యమంతో మాకు సంబంధం లేదు

అని ప్రకటించడానికి ఉద్యమనాయకులకు న్యాయమా?

అలా అన్నందుకు సిగ్గుపడాలి కదా!


నైజాంపై పోరాటం సమయంలో,

1968 తెలంగాణా ఉద్యమ సమయంలో,

2000 సం.లో తర్వాత

ప్రత్యేక తెలంగాణ పోరాటం సమయం ఉద్యమకారుల చూశాను.

త్యాగాలు చేసిన వారికి ఎవ్వరికీ గుర్తింపులు లేవ్.


బ్రిటిష్ ఇండియా స్వాతంత్ర చరిత్ర చూసినా అదే జరిగింది.

అక్కడ ఒకే కుటుంబం అందల మెక్కింది. 

దేశాని శాసిస్తోంది.

మిగతా అందరినీ చరిత్ర పుటల్లోకి నెట్టేశారు.

వారందరినీ అనాధల్లా మార్చేశారు.


1969 లో ఉద్యమాన్ని రగిల్చిన

చెన్నారెడ్డి సొంత అవుసరాలు తీర్చేసు కున్నాడు, 

2014 లో కల్వకుంట్ల కుటుంబం రాజకీయ లబ్ధి పొందింది. 

త్యాగాలు పునాదులపై 


సరే, 


రాష్ట్రంలో రాజకీయంగా పెద్దన్న పాత్ర పోషించిన

ఖమ్మంలో

1952 నుండి ఇప్పటివరకు ఇద్దరే ఖమ్మం స్థానికులు

లోకసభ అభ్యర్థులుగా గెలిచారు.

ఒకరు తమ్మినేని వీరభద్రం, రెండు పొంగులేటి శ్రీనివాస రెడ్డి.

ఎందుకని..?


లోకసభా బరిలో ఎక్కువగా

వలసవాదులే అందాల మెక్కారు.

ఎందుకని?

ఇప్పుడైనా ఖమ్మం స్థానికులు కరువయ్యారా?

దొరకలేదా?

రాజకీయ పార్టీలు ఇంకా డబ్బులకే అమ్ముడు పోవాలా?


అసలు నాయకుల నోట ఓ డైలాగ్

ఈ మధ్యన వైరల్ అవుతోంది 


అది "ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోట" అని.


అవునా ఎప్పుడైందీ?


ఏ చారిత్రక పరిస్థితుల్లో అయింది?

కమ్మ్యూనిస్టుల ఖిల్లా కాంగ్రెసు అడ్డాగా ఎలా మారింది?

చరిత్ర తెలుసా?

చెప్పే వాళ్ళున్నారా?


ఏ పార్టీకి నిజాయితీల్లో మినహాయింపులు లేవు.

అభ్యర్థుల నిర్ణయాల్లో సహేతుకత లేదు.

ఎవ్వరి స్వార్ధం వారిదే.


కాంగ్రెసులో 45 సం.లుగా

పార్టీ మారకుండా,

సొంత వ్యాపారాలు, ఉద్యోగాలు చేయకుండా ,

ఆరోపణలు లేకుండా

పార్టీ కోసమే వున్న కార్యకర్తలు ఖమ్మంలో కోకొల్లలు.


వాళ్ళ త్యాగాలు లేకుంటేనే పార్టీ బతికిందా?

వేరే పార్టీ జిల్లా అధ్యక్షులుగా వున్న వ్యక్తులకు,

పార్టీ సభ్యత్వం తీసుకోకున్నా

ఖమ్మం నడి బొడ్డున

లోగడ ఏం.ఎల్.ఏ టిక్కెట్టు ఇచ్చి

కార్యకర్తల అవమానించారు.


మీరేం గౌరవం దక్కించినట్లు వారికి?

ఏమి సందేశం ఇస్తున్నట్లు?


పదవులు ఎలాగో ఇవ్వకున్నా ,

గౌరవాలు అన్నా దక్కాలి కదా?

ఎప్పుడో ఒకప్పుడైనా పదవులతో సత్కరించాలి కదా?

సాంప్రదాయ ఓటు బాంక్ అంటే అంత నిర్లక్ష్యమా?


ఖమ్మానికి ఆత్మాభిమానం లేదనుకున్నారా?

మీ భరతం పట్టరనుకుంటున్నారా?

నిత్యం కట్టుబానిసలనుకుంటున్నారా?


నిఖార్స్  అయిన కార్యకర్తను గుర్తించండి

లోకసభా అభ్యర్ధిగా నిర్ణయించండి.


కళ్ళు  తెరవండి.

నిజాన్ని గ్రహించండి


........మీ పెండ్యాల వాసుదేవ రావు


<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Friday, December 15, 2023

ఔనా? నిజమేనా?

81. (SOCIAL--54)      
పల్లెల్లో
సందడి మొదలైంది
అలజడి మొదలైంది
పంచాయతీ ఎన్నికల నగారా
మ్రోగబోతోంది.

"చేతులకు" పనిమొదలైంది
"కార్లలో" ఇంధనం రెఢీ అవుతోంది
"కోడవళ్లు" నూరటం షురూ అయింది.

ఓ నడి వయస్సు పలుకరించింది
అయ్యా చూస్తున్నరా?
కాలం మారింది
తరం మారింది
ఓటు వేయాలంటే నోటియ్యాల
గెలవాలంటే కోట్లు గావాలే
యెట్లయ్యా గిట్లయితే?....

ఓ ప్రశ్న నా మనసును
తట్టి లెపింది.
గీట్లయితే ఎట్లా?
నువ్వు రా అయ్యా
యీరందరికీ బుద్ది చెప్పాలయ్యా
నువ్వు నిలబడయ్యా అంది 
ఆ రోజులు మళ్లీ రావాలయ్యా అంది.

ఆలోచనలు ముసిరాయి
యుద్ధాన్ని మొదలెట్టాయి.
ఉద్యమానికి
ఎక్కడో ఒకచోట 
ప్రారంభం కావాలి కదా
తొలి అడుగు పడాలి కదా
అది ఇదే ఎందుకు కాకూడదు
నడువు అని చెప్పింది.

నా ఆలోచన అందీ..
కుడి యెడమ అయితే 
ఇమేజ్ పోదా అని ..
మనసు గీ పెట్టింది.
ఉద్యమం అన్నాక
కష్టాలు, నష్టాలు ఉండవా?
మరకలు పడితే శుభ్రం కావా?
యువతరం ఆ పని చేస్తుంది
నువ్వు పదా అంది.

ఔనా? నిజమేనా?
చెప్పండి.
.... ...పెండ్యాల వాసుదేవరావు

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Tuesday, November 28, 2023

దేశంలో ప్రజా సేవ ఇంత Costly నా? ఎవ్వరికీ బాధ్యతలు లేవా?

80. (SOCIAL--53) 



                                    ఈ దేశంలో ప్రజాసేవ
                                    ఇంత costly అయిందా?
                                    వింటున్నాం 
                                    నియోజకవర్గంలో 
                                    ఒక అభ్యర్థికి 400-500 కోట్లు ఖర్చు,
                                    అవతల వారూ అంతే..
                                    నేనేమీ తీసిపోలేదంటూ..
                                    అంతసొమ్ము ఇద్దరూ కలిసి
                                    నియోజక వర్గ సమస్యలపై
                                    ఖర్చు పెడితే
                                    బతికినంతకాలం
                                    జనం మిమ్ములను
                                    వారి వారి హృదయాలలో
                                     దాచుకుంటారు కదా!
                                     మిమ్ముల పూజిస్తారు కదా!

                                     డబ్బు ఖర్చుపెట్ట దలచుకుంటే
                                     పై మార్గంలో వెళ్ళండి.
                                     సిద్ధాంతాల పై, నిజాయితీ పై
                                     పోరాడండి.
                                     సామాజిక సమస్యలు
                                     మీకసలు తెల్సా?
                                     గ్రామాల్లోని ఇబ్బందులు
                                     మీకు అసలు తెల్సా?
                                     పరిష్కారానికి ఏమి చేశారు మీరసలు?

                                     మీకు తెలుసా?
                                     పాలేరు నియోజకవర్గం మొత్తంలో 
                                     వున్న ఏకైక బస్సుస్టాండ్ పరిస్థితి. 
                                     నేలకొండపల్లి లో వున్న 
                                     బస్సు ప్రయాణీకుల దుస్థితి.
                                     రెండు ఏకరాల సువిశాల విస్తీర్ణంలో వున్నా 
                                     రాజకీయ స్వార్థం కోసం 
                                     అన్యాక్రాంతం చేశారు నాయకులు.
                                     ప్రయాణీకులను  రోడ్ల పైకి తోసేశారు.
                                     దశాబ్దాల ఘోష ఇది.
                                     అన్ని రాజకీయ పార్టీలు
                                     ఇందులో భాగస్వాములే.
                                     సరి చేయండయ్యా...

                                      పాలేరు నియోజకవర్గంలో వున్న
                                      ఏకైక ఆసుపత్రి నేలకొండపల్లి లో వుంది కదా! 
                                      అవిభక్త ఖమ్మం అసెంబ్లీ వున్నప్పుడు మా పెద్దలు తెచ్చారు

                                      70 సం.క్రిందనే నేలకొండపల్లికి
                                       మేము తెచ్చుకున్న 
                                       ఆ ఆసుపత్రి ఎలావుందో తెలుసా?
                                       Upgrade అయినా
                                       allot అయిన డాక్టర్స్ రారు.
                                       సిబ్బంది లేరు.
                                       మందులు ఉండవు.
                                        కావలసిన సౌకర్యాలు ఉండవు.

                                        ఇది దశాబ్దాల దుస్థితి.
                                        మార్చండయ్యా.....

                                         సమస్యల గుర్తుంచుకొని
                                         జనాలకు మేలుచేయండి.
                                         డబ్బెందుకు ఇవ్వటం
                                         ఓటర్లకు?

                                          సమస్యలకు మీ టైం ఇవ్వండి.
                                          మారే కాలానికి మార్పును ఇవ్వండి.
                                          మీ వ్యక్తిత్వాన్ని నిలుపుకోండి.

                                          డబ్బుల ఇచ్చి, ఓట్లు కొని 
                                          సమాజములో అంధకారాన్ని
                                          మిగిల్చకండి.
                                          మీరు దారిద్య్ర బురుదలో
                                          కూరుక పోకండి.
                                                                               -----------Pendyala Vasudeva Rao

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91');


Sunday, November 5, 2023

మీరు నమ్ముతారా. ఎన్నికలు అంటే అలావుండాలి

                                                      79. (social..52).       

                                         ఎన్నికలు .. సంస్కరణలు అంటే  నాకు 

మా ప్రక్కగ్రామం అయిన బొదులబండకు చెందిన

కీ.శే. శ్రీ పొట్టి పింజర హుసేనయ్య  జ్ఞాపకం వస్తాడు 

1978 లో 

ఆయన 

పాలేరు నియోజక వర్గానికి ఏం. యల్. ఏ.గా గెలిచాడు  

ఆ కాలంలో 

ఆయన ప్రచారంలో 

హంగు ఆర్భాటాలు లేవు. 

మైకుల హోరులు, వాహనాల రొదలు అసలే లేవు. 

ఊరేగింపులు, గడప గడపకు ప్రచారాలు లేవు. 

ఒకటో, రెండో సమావేశాలు జరిగాయోమో 

నాకైతే గుర్తు లేదు.

మీరు నమ్ముతారా?

పోలింగ్ జరిగేటప్పుడు పోలింగ్ స్టేషన్ లో 

ఏజెంట్లు కూడా లేరు.

పార్టీ గుర్తు చెప్పేవాళ్ళు అసలే లేరు. 

సామాన్య జనంలో ఇందిరమ్మపై 

అభిమానం ఉప్పెనలా ఉప్పొంగింది. 

హుసేనయ్యను ఏం.ఎల్.ఏ గా గెలిపించింది.

అంతకు ముందు మూడు పర్యాయాలు 

ఏం. ఎల్. ఏ గా వున్న వ్యక్తిని ఓడగొట్టారు.

అధికార పార్టీ అయిన కాంగ్రెసును 

కాంగ్రెసు వాదులే ఓడించారు 

     ఇందిరమ్మ కాంగ్రెసును గెలిపించారు 

అదే ఇప్పుడు మిగిలింది 

జన బలం అది.

జన శక్తి అలాంటిది.

అలా వుంటే అందరూ బాగుంటారు 

ఎన్నికల్లో ఓడినా 

ఎవ్వరికీ గుండెపోటు రాదు.

అందరి ఆస్తులకు రక్షణ లభిస్తుంది 

----పెండ్యాల వాసుదేవ రావు.       తేదీ: 05.11.2023 

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Friday, November 3, 2023

ఎవవరెవరో ఎక్కడినుండో వస్తారు .....ఆలోచించండి ప్రజలారా...

78. (social...51).

ఆలోచించండి. 

ఎన్నికల సందడి మొదలు కాగానే

ఎవ్వరెవ్వరో వస్తారు

ఎక్కడెక్కడి నుండో వస్తారు

చీమలు పెట్టిన పుట్టలో

పాములు దూరినట్లు, 

దూరిపోతారు 

తెగ హడావుడి చేస్తారు


దండలు/ఓ ట్లు వేయించుకుంటారు

కుర్చీలో/పదవిలో కూర్చుంటారు

ఆ తరువాత ఏమీ పట్టించుకోరు

ఏటో వెళ్ళిపోతారు

ధన సంపాదనలో మునిగి పోతారు

సమస్యలన్నీ పేరుకు పోతాయి

సమాజం లో చీకట్లు ముసురుతాయి ….


ఎన్నికల్లో 

ఎప్పుడూ

తక్కువ బడ్డుకు ఓటేద్దాం

అనే 

భావానికి అలవాటు పడ్డారు జనం


ఆ ప్రభుత్వం మీద కోపం వుంటే  

దాని ప్రత్యర్థి పార్టీకి,

ప్రత్యర్థి పార్టీకి అధికారం వచ్చి

దీనిపై కోపం వస్తే మాజీ అధికార పార్టీకి

ఓటు వేయడం తప్ప

గత్యంతరం లేని స్థితి

ప్రత్యామ్నాయం లేని దుస్థితి…


ఏదీ, ఏమీ ఆలోచించలేని

సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఒకవైపు…..


స్వలాభాలకోసం కార్యకర్తల

ప్రయోజనాలు తాకట్టు పెట్టి

అభ్యర్దుల నిర్ణయాలతో

రాజకీయ పార్టీలు మరోవైపు…..


ఈ పార్టీల వ్యవస్థ అవస్థల పాలు చేస్తోంది..

ఎన్నికల సంస్కరణల కొరడా పైకెత్తి

యువతరం కార్య రంగంలోకి దిగవలసిన

సమయం వచ్చింది,


దొంగలు, దొంగలు వూళ్ళు పంచుకున్నట్లు

గెలిచిన ప్రజాప్రతినిధులు 

వాళ్ళ జీతాలు, వాళ్ళ పెన్షన్లు

వాళ్ళే పెంచుకుంటారు..

ప్రజాసేవకులకు జీతాలేమిటి,

జీవితాంతం పెన్షన్లేమిటి?

ప్రభుత్వం సొమ్ము 

దోచుకుంటున్నా మాట్లాడని వైనం

బానిస బతుకుల వారసత్వం కాదా ?


గెలిచిన వాళ్ళు సక్రమంగా 

సమస్యలకు స్పందించకుంటే

నిలదీసే వాళ్ళు లేరు

రికాల్ హక్కులేదు,


ఈ మాత్రం దానికి

ఇన్ని వేల మంది బలిదానాలు

కావలసి వచ్చాయా?

బానిస సంకెళ్లు తెంచుకొన్నది

రెండు, మూడు కుటుంబాలు

మన నెత్తిన కూర్చుని 

రాజభోగాలు అనుభవించటానికా? 


ప్రజాస్వామ్యానికి పట్టిన దుస్స్థితికి

మందేమిటి?

ఈ సమస్యల పరిష్కారానికి

ఆపరేషన్ మాత్రమే పరిష్కారమా?


ఎవ్వరెవ్వరో వస్తారు

ఎక్కడెక్కడి నుండో వస్తారు

చీమలు పెట్టిన పుట్టలో

పాములు దూరినట్లు, 

దూరిపోతారు 


మాయ మాటలు చెబుతారు.

ఓటేయించు కుంటారు..

పదవి రాగానే వెళ్ళిపోతారు..

కాంట్రాక్టులుకు అమ్ముడు పోతారు.

మనం ఎవ్వరికీ వ్యతిరేకంగా వీళ్ళకు ఓటేశామో

వాళ్ళ పార్టీ లోకే దూకేస్తారు

ఓటర్లు పిచ్చోళ్లలా మారిపోతారు.


వీళ్లనుంచి

అయ్యేది లేదు,

జనానికి ఒరిగేది లేదు.

ఆలోచించండి…ప్రజలారా!

                                                                            ----పెండ్యాల వాసుదేవ రావు.  04.11.2023

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Tuesday, October 31, 2023

ప్రజాస్వామ్యం.....ఎన్నికలు.

                     77. (social..50).

                    ప్రజాస్వామ్యం.....ఎన్నికలు.


                     ప్రజాస్వామ్యం

                    నన్ను తట్టి నిద్ర లేపింది.

                    నిద్రమత్తు వదిలింది.


                    అంటోంది

                    ఎలక్షన్లు దండగ,

                    కావొచ్చు ప్రజలకు పండగ...,


                    కానీ నిజానికి

                    అది పండగ కాదని,


                   ఓటును రెండు/మూడు వేల రూపాయలుకు అమ్మటం,

                   1825 రోజులకు(అయిదు సం.లు పదవీకాలం)

                   రోజుకు రూపాయి చిల్లరకు

                   జీవితాన్ని

                   తాకట్టు పెట్టటమే అవుతుంది కదా అంటున్నట్లు వినబడింది.


                   నిజమేనండీ...

                   రోజు కూలి Rs 500/- చొప్పున  1825 x 500=

                   Rs 9,25,000/-

                   ఇస్తే బాగుంటది ..

                   ఎక్కడిదో ఓ సన్నని కంఠం

                   ఫుట్ పాత్ పై మందు మత్తులో జోగుతూ 

                    పడి వున్న బక్క పలుచని శరీరం తాలూకు ధ్వని

                    వినిపించింది,

                    ఆ మాటకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదు.


                    ప్రజాస్వామ్య మేమో

                    నన్ను నిలదీస్తోంది,


                    వివరాలు అడుగుతోంది

                    ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లలో

                    రోడ్లమీద తిరుగుతున్న

                    వందల కార్ల పరుగులేమిటి?,

                    ఆ కార్లల్లో దాగున్న

                    డబ్బు మూటల మూలుగుల ధ్వనులు 

                    దేనికి సంకేతమని?,


                   అధికారులు నిద్రమత్తులో,

                   వున్నారా?

                   చర్యలు తీసుకునే

                   బాధ్యత లేదా అని,


                  ఇంకా ప్రశ్నిస్తోంది

                  ఈ డబ్బులన్నీ ఎక్కడివి?

                  ఎవ్వరు యే వ్యాపారాలు

                  చేస్తున్నారని?,

                  ఆ వ్యాపారాలకు సంబంధించి

                  సంబంధిత వ్యక్తులు/అభ్యర్థులు ప్రభుత్వానికి చెల్లించిన

                  పన్ను వివరాలు

                  సమాజానికి చెప్పవద్దా?అని,


                  శేషన్ వస్తే తప్ప

                  ఫలితం వుండదా?

                  శేషన్  వారసత్వం

                  అందుకున్న అధికారులు కనుమరుగు అయినారా అని?,


                  ఆ దిక్కు చూపుతోంది.....

                  దూరంగా ఆ అడవిలో

                  ఏవో, ఏవేవో గర్జనలు. 

                  గుర్తించమంటోంది.


                  హెచ్చరిస్తోంది

                  జాగ్రత్తపడండని

                  అవి తుపాకుల మోతల్లా వున్నాయేమోనని...


                  తన బాధ వెల్లడించింది

                  తన అస్థిత్వం కూడా కనుమరుగయ్యే ప్రమాదం ముంచుకొస్తున్న

                  తరుణం ఆసన్నం

                  అయినదని.. 

                                                                            ------PENDYALA VASUDEVA RAO
                                                                                                      31.10.2023.
                 <!-- Google tag (gtag.js) -->
<script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Saturday, October 28, 2023

రాజకీయ రంగం సమస్తం కుళ్ళి కంపు కొడుతోన్న వైనం.


76. (social..49). 
 
ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ?

రాజకీయ రంగం సమస్తం కుళ్ళి కంపు కొడుతోన్న వైనం.

బీ.ఆర్.ఎస్  పార్టీలో టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలోకి  .. 

కాంగ్రెస్ పార్టీ లో టికెట్ దొరకలేదని  బీ.ఆర్.ఎస్/బీ.జె.పీ.లోకి ....

పిల్లనిచ్చి/టికెట్ ఇచ్చి పెళ్లి చేసినా/గెలిపించినా   

తాళి కట్టిన మరుక్షణమే, కాళ్ళ పారాణి ఆరకుండానే  

వేరే వాళ్ళతో లేచి పోడనే గ్యారంటీ ఏమిటీ?

కళ్ళముందు కనిపిస్తున్నదే  కదా!

సర్వేలమీద సర్వేలు చేసి 

గెలుపు గుర్రాల పసిగట్టి వాటేసుకొనే వారు కొందరు.. 

గెలిపించిన కార్యకర్తలను, పార్టీని నట్టేట ముంచి 

డబ్బు కోసం /కాం ట్రాక్టుల కోసం 

గడ్డితినే వారు ఇంకొకరు...

చాలా భలేగుంది మీ రాజకీయం...

పార్టీ సభ్యత్వం లేకుండా శతాబ్దాల/దశాబ్దాల పార్టీలోకి 

లేచిపోయి వచ్చినోళ్ళకి  కుర్చీ లిస్తే 

వాళ్ళనే అందలమెక్కిస్తే 

ఇంతకాలం పల్లకీ మోసిన, చమటోడ్చిన,

త్యాగాలతో బతుకీడ్చిన  

కార్యకర్తలకు  ఎవ్వరు  భరోసా?

టికెట్ కోసం వచ్చిన అవతలోడికి 

నీ సిద్దాంతాలతో పనిలేదు 

నీ నాయకులపై గౌరవం వుండదు 

నిన్నటి వరకు నిన్ను బూతులు తిట్టినోడు 

ఈరోజు నీకు ఎలా ముద్దు అయినాడు? 

తప్పదు. మీకు బుద్ది చెప్పాలి .

వెట్టి చాకిరీని ఎప్పుడో నిషేధించాము కదా 

కార్యకర్తల వెట్టి చాకిరీకి ముగింపు పలకాలి. 

కార్యకర్తల వదిలేసి కాంగ్రెసు నాయకత్వం  .. 

ఉద్యమకారుల వదిలేసి అధికార పార్టీ నాయకత్వం  ..

యేరు దాటాక తెప్ప తగలేసినట్లుంది.

ఇలా ఎంతకాలం?

ఓటుతో ఈ మురికి పార్టీల ఉతికీయాలి.

యువతరం భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలి.

-----PENDYALA VASUDEVA RAO

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Saturday, September 30, 2023

పాలేరు అసెంబ్లీ నియోజక వర్గం...నియోజకవర్గాల పునర్విభజన...రాజకీయాలు.

75. (social 48). 

పాలేరు అ75. (social 48). సెంబ్లీ నియోజకవర్గం... నియోజకవర్గాల పునర్విభజన... రాజకీయాలు.

ప్రధమంగా జరిగిన  నియోజకవర్గాల పునర్విభజన 1962.

1962 సం. లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి విడదీసిన ప్రాంతాన్ని పాలేరు అసెంబ్లీ నియోజక వర్గంగా ఏర్పాటు చేశారు. అప్పుడు ఖమ్మం జిల్లా కాంగ్రెసు వర్గరాజకీయాల ఫలితంగా నిబంధనలకు భిన్నంగా వేంసూరు అసెంబ్లీ నియోజక వర్గానికి బదులుగా వాళ్ళ స్వలాభం కోసం పాలేరును ఎస్. సీ నియోజకవర్గంగా మార్చారు. అప్పటికింకా సర్వశ్రీ జలగం వెంగళరావు మరియు శీలం సిద్దారెడ్డిలు ఇరువురు జిల్లా నాయకత్వ హోదాలో లేరు.  

అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ  "రావు మరియు రెడ్డి "వర్గాలుగా చీలిపోయి వుంది. జిల్లాలో రావు వర్గముదే పైచేయిగా వుండేది. ఖమ్మం జిల్లాకు పార్టీలో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు ప్రాబల్యం ఎక్కువ. 

వేంసూరు అసెంబ్లీ సీటు అప్పటి జిల్లా కాంగ్రెసు ముఖ్య నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణ రావుకు అవుసరం. ఖమ్మం అసెంబ్లీ రాజకీయాలలో పట్టువున్న వ్యక్తి శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు. నియోజకవర్గ రాజకీయాలలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావును తప్పించి జిల్లాలో ఆయన  ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయటం లక్ష్యంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు ఉపయోగించుకున్నారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని "ఎస్. సీ" కి కేటాయించటంలో తన పలుకుబడిని ఉపయోగించారు. 

ఆ సమయంలో, పంచాయతీ సమితులు ఏర్పడనప్పుడు, పాలేరు బ్లాక్ కు బీ. డీ. ఓ (బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్) అధ్యక్షునిగా, శ్రీ పెండ్యాల ఉపాధ్యక్షుడుగా సేవలను అందించారు. పాలేరు ప్రాంత అభివృద్దిలో పెండ్యాల సత్యనారాయణరావు పాత్ర మారువలేనిది.     

1957 సం.లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా  శ్రీమతి తే ళ్ళ లక్ష్మీకాంతమ్మ గారిని అభ్యర్ధిగా నిర్ణయించటంలో గానీ, గెలిపించటంలో గానీ శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ప్రతిభకు ఉలిక్కిపడిన అప్పటి కాంగ్రెసు జిల్లా నాయకత్వం ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి కొంత ప్రాంతాన్ని విడగొట్టి పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం అని నామకరణం చేసి షెడ్యూల్ కులాల (ఎస్. సీ) నియోజకవర్గంగా మార్చేశారు. ఆ సమయంలోనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కావటం వారికి వరంగా మారింది. 

ఈ రాజకీయచర్యల పర్యవసానమే జిల్లా రాజకీయ పునరేకీకరణకై శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు శ్రీకారం చుట్టారు.  ఫలితంగా కొత్తతరం రాజకీయ అరంగ్రేటం సర్వశ్రీ  జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి  రూపంలో అవతరించటానికి కారణం అయింది. నైజాంపోరాట సమయంలో శ్రీ  పెండ్యాల సత్యనారాయణ రావు వరంగల్లు జిల్లా నాయకత్వంలో కీలక భూమికను పోషించటం, తద్వారా ఏర్పడిన పరిచయాలు ఈ రాజకీయ పునరేకీకరణలో విజయం సాధించటానికి దోహదపడింది. 

ద్వితీయ నియోజక వర్గాల పునర్విభజన. 2004.

శ్రీమతి రేణుకా చౌదరి ఖమ్మం లోకసభా అభ్యర్ధిగా రంగప్రవేశం చేశాక శ్రీ వనమా వేంకటేశ్వరరావు ప్రెసిడెంటుగా ఏర్పడ్డ ఖమ్మం జిల్లా కాంగ్రెసు కమిటీకి నేను దశాబ్దం పైగా కార్యదర్శి బాధ్యతలు నిర్వహించటం జరిగింది. ఆ సమయంలోనే అసెంబ్లీ, లోకసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం అయింది. ఎలెక్షన్ కమీషను ప్రతిపాదనల ప్రకారం ఖమ్మం లోకసభ, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాలు షెడ్యూల్ తెగలకు (ఎస్. టీ) రిజర్వు చేయటంతో రాష్ట్ర కాంగ్రెసు పార్టీ జిల్లా డీలిమిటేషన్ కమిటీని ఏర్పాటు చేసినది. ఖమ్మం జిల్లా డీలిమిటేషన్ కమిటీకి చైర్మనుగా నన్ను నియమించారు. అందులో సర్వశ్రీ అయితం సత్యం, చింతనిప్పు లాలయ్య, కోట గురుమూర్తి, కొత్తా సీతారాములు  సభ్యులుగా నియమించబడ్డారు. జిల్లాలోని పది అసెంబ్లీ, లోకసభా నియోజకవర్గాల పునర్విభజనా ప్రతిపాదనల తయారీ బాధ్యత నా భుజస్కందయాలపై పడింది. ఈ కమిటీకి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెసు సీనియర్ నాయకులు శ్రీ గాదె వెంకటరెడ్డి చైర్మనుగా వుండేవారు. జిల్లాలోని అన్నీవర్గాలతో, రాజకీయపార్టీలతో సుధీర్గ సంప్రదింపుల తరువాత, మూడు సంవత్సరాల  నిరంతర కృషితో మూడు ప్రతిపాదనలను తయారు చేశాను. జాతీయ స్థాయిలో డీలిమిటేషన్ కమిటీ అధికారిక చైర్మనుగా వున్న రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జీ శ్రీ కులధీప్  సింగ్ గారితో డిల్లీలో రెండు సార్లు సమావేశమై నా ప్రపోజల్స్ ను వివరించి పరిశీలించేలా చేయగలిగాను. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో (అసెంబ్లీ మరియు లోకసభ) నేను చేసిన ప్రతిపాదనలే చివరకు ఆమోదించబడ్డాయి. 

పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం పేరును నేలకొండపల్లి అసెంబ్లీ నియోజకవర్గంగా చేసిన మార్పు ప్రతిపాదన మాత్రం కొందరి అభ్యంతరంతో సఫలం కాలేదు. ఈ ప్రయత్నంలో నా విజయం ఏమిటంటే పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని జనరలు (ఓ. సీ) సీటుగా మార్చే ప్రక్రియలో సఫలీకృతుడిని అయ్యాను. గతంలో 1962 లో నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన తప్పును దశాబ్దాల తరువాత సరిదిద్దే అవకాశం నాకు దక్కింది. 

జిల్లా కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వున్న వనమా వేంకటేశ్వరరావు డీలిమిటేషన్ ప్రక్రియ అయిపోయేటంత  వరకు ఆయన నన్ను నిద్ర పోనివ్వకుండా, డిల్లీ వెళ్ళినా నన్ను తన వెంటనే తీసుకు వెళ్ళేవారు. అక్కడ తరచుగా డీలిమిటేషన్ కమిటీ అధికారిక సభ్యులైన సర్వశ్రీ గాదె వెంకటరెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు మండలి బుద్దప్రసాదులతో సమావేశం అయ్యేవాళ్ళం. ఒకసారి గాదె వెంకటరెడ్డి గారు వనమా గారితో "వనమా! వాసుదేవరావు గారు లేకుంటే నువ్వు దిల్లీకి రావా? అని అడిగారు. శ్రీ వనమాకు కంగారు ఎక్కువ. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం తిరిగి ఓ.సీ కాకపోతే ఆయన తట్టుకోవటం కష్టమని భయపడ్డాము. దాంతో నేను ప్రొఫెషన్  కు ఎక్కువ డుమ్మా కొట్టవలసి వచ్చింది.  ఎక్కువ సమయం ఈ వ్యవహారానికే వెచ్చించ వలసి వచ్చింది. 

జిల్లాలో డీలిమిటేషన్ సమయంలో, సత్తుపల్లి అసెంబ్లీనియోజకవర్గం జనరలు స్థానంగా వుంచటమే ధ్యేయంగా సత్తుపల్లి సిట్టింగ్ ఏం. ఎల్. ఏ,  శ్రీ జలగం వెంకటరావు కూడా  డీలిమిటేషన్ ఫలితం అనుకూలంగా సాధించటానికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో నాయకుల కలుస్తూ చురుకుగా వ్యవహరించారు. డీలిమిటేషన్ ప్రక్రియ పర్యవసానంగా జిల్లాలో ముఖ్యనాయకుల రాజకీయ భవితవ్యం కొత్త పుంతలు తొక్కింది. స్థానచలనాలు  జరిగి వారి రాజకీయజీవితాలపై ప్రభావాన్ని చూపాయి. 

క్రింది చిత్రాలలో మొదటిది  ఖమ్మం లో.. నెహ్రూ యువక కేంద్రంలో యువజన దినోత్సవ సమావేశములో శ్రీమతి రేణుకా చౌదరి గారితో. చిత్రంలో నెహ్రూ యువక కేంద్రం కో .. ఆర్డీనేటరు శ్రీ పీ. వైద్యనాధం మరియు ఆఫీసు సిబ్బందిని చూడవచ్చు. 

రెండవ చిత్రం శ్రీమతి  రేణుకాచౌదరి, వనమా వేంకటేశ్వరరావు, చింతనిప్పు లాలయ్య తదితరులతో నేలకొండపల్లిలో ... శ్రీ భక్త రామదాసు మందిరములో.

                                                                 ----పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

<


US map India, a larger geopolitical realignment.

US Map Shows PoK and Aksai Chin as Part of India: The recent release of a US map depicting Pakistan-occupied Kashmir (PoK) and Aksai Chin as...