Posts

Showing posts from July, 2018

57. (ఖమ్మం చరిత్ర-5) నైజాం సంస్థానంలో CPI ఆవిర్భావం--పరిణామాలు.

Image
నైజాం సంస్థానం లో  CPI పార్టీ ఆవిర్భావం-తదనంతర పరిణామాలు. CPI పార్టీ బ్రిటిష్ ఇండియాలో 1925 సంవత్సరంలో కాన్పూర్లో అధికారికంగా ప్రారంభించ బడినది. అంతకుముందు తాష్కెంట్లో 1920  సంవత్సరంలో పార్టీ మేనిఫెస్టో ను తయ్యారు చేశారు. CPI వ్యవస్థాపాకుడు శ్రీ మానవేంద్ర నాథ్ రాయ్. 1934 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగం అయిన ఆంధ్ర ఏరియాలో CPI పార్టీ ఆంధ్ర ప్రొవిన్సియల్ కమిటీ పేరిట ఆవిర్భవించింది. 1940 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియాలో కమ్యునిస్ట్ పార్టీని నిషేధించారు. 1939 సంవత్సరంలో నైజాం సంస్థానంలో CPI పార్టీ ఆవిర్భవించింది. అప్పట్లో నైజాంకు వ్యతిరేకంగా గ్రంధాలయోద్యమంతో పాటు  1). కామ్రేడ్స్ అసోసియేషన్, 2), ఆంద్ర మహాసభ, 3). మహారాష్ట్ర పరిషద్ మరియు 4). వందేమాతరం పేరిట కార్యక్రమాలు నడుస్తుండేవి. వీటిలో గ్రామీణ ప్రాంతాలలో ఆంద్రమహాసభ కార్యక్రమాల ప్రభావం ఎక్కువగా వుండేది. ఆంద్రమహాసభలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు, కామ్రేడ్స్ అసోసియేషన్ లో శ్రీ ముఖ్దూం మొహియుద్దీన్, వందేమాతరంలో శ్రీ సర్వదేవభట్ల రామనాధం లాంటి సోషలిస్ట్ ఆలోచనా విధానం కలిగిన యువకులు చురుకుగా వుండేవాళ్ళు. ఆంధ్రాలో Communist Party పై

56. (NKP-9). 1991-94 మధ్యన నా జీవన పోరాటం --రాజకీయ పరిణామాలు.

Image
నా మూడవ టర్మ్ నేలకొండపల్లి సహకార గ్రామీణ బ్యాంకు ఎన్నికలు......అనంతర రాజకీయ పరిణామాలు. 1992 జనవరి నెలలో సహకార గ్రామీణ బ్యాంకు  ఎన్నికలోచ్చాయి. 1991 సంవత్సరం డిసెంబర్ నెల 25 వ తేదిన మా తండ్రి గారు మరణించారు. ఆయన మరణించిన నెలరోజులకు మొదటి మాసికం 23rd January నాడే నేలకొండపల్లి గ్రామీణ బ్యాంకు ఎన్నికలు జరిగాయి. మా తండ్రిగారి మరణంతో జరిపించవలసిన సాంప్రదాయ కార్యక్రమాలతోనే, పలుకరించ వచ్చినవారితో మాట్లాడటంతోనే నాకు సమయం సరిపోవటంతో ఎన్నికల నిర్వహణపై ఎక్కువ శ్రద్ధ చూపలేకపోయాను. ఆయన మరణించటంతోనే నా రాజకీయ జీవితం అంతమొంధించటానికి మా వ్యతిరేకులంతా సమావేశమై వ్యూహం రచించారు.ఈ సమయం దాటితే మళ్ళీ నన్ను ఎదుర్కోవటం సాధ్యం కాదని వారి భావన. నాకు అత్యంత దగ్గరగావున్న వ్యక్తులు శ్రీ వాక కృష్ణ లాంటి వాళ్ళు నన్ను వదలి వెళ్లి పోయారు. వ్యతిరేక పానెల్ లో పోటిచేశారు. మాకులం వాడైన శ్రీ భగవాన్లు లాంటి వాళ్ళు వ్యతిరేకం చేశారు. అయినా ఎన్నికలలో పోటీచేయటానికి వార్డ్ ల వారీగా పానెల్ తయ్యారు చేసి కదన రంగంలోకి దిగాము. ఎన్నికల రోజు రానే వచ్చింది. ఆ రోజు మా తండ్రి గారి మొదటి మాసికం కావటంతో సాయంకాలం దాకా నాకు ఆ కార్యక్