Posts

Showing posts from March, 2020

పాత కట్టడాల కూల్చి వదిలేస్తే అభివృద్ధి అయిపోతుందా? ఈ జన్మస్థల ప్రాంగణానికి అధీకృత నిర్వాహకులు ఎవ్వరు?

Image
68. (NKP-11).  నేలకొండపల్లి లోని శ్రీ  భక్తరామదాసు జన్మస్థలంలో అభివృద్దికి ప్రభుత్వ యంత్రాంగం శ్రీకారం చుట్టారు. సంతోషమే. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే.సి.ఆర్ గారికి అభివందనాలు. ఎవ్వరు చేయని పని మీరు చేశారు.రెండోసారి బంగారు తెలంగాణా ఏర్పడ్డ తరువాత ఖమ్మం జిల్లా పాలనాధికారి పేరిట మూడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. శ్రీ భక్తరామదాసు జన్మస్థల ప్రాంగణంలో వున్న కంపౌండు గోడలను కూలగొట్టి, అంతకు ముందే మందిరం లోపల వున్న ఏకశిలా తెల్లరాతి విగ్రహానికి అదనంగా వేరొక విగ్రహాన్ని ఆరుబయట స్థాపిస్తే, కల్యాణమంటప నిర్మాణం చేపడితే అది అభివృద్ధిలో భాగమా?  అసలు జనాల కోరిక లేమిటి? జన్మస్థలంపై  ఆశలేమిటి? ప్రభుత్వానికి మార్గధర్శకులెవ్వరు? వాటి/వారి  చట్టభద్దత ఎంతవరకు?