ఖమ్మంలో మహాత్మా గాంధి--ప్రజల మదిలో జాతి పిత జ్ఞ్యాపకాలు..
60 . (ఖమ్మం చరిత్ర-8) మహాత్మాగాంధీ ఖమ్మం వచ్చినప్పటి వేళ ఖమ్మం పట్టణ చరిత్రలో మరచిపోలేని చారిత్రక ఘట్టం. Mahatma Gandhi's meeting was held in my ancestral land in Khammam town near Venkatagiri Railway gate 5 August 1946.— 1942 సంవత్సరం ఆగస్ట్ నెలలో ప్రారంభమైన క్విట్ఇండియా ఉద్యమం 1945 లో ముగియటంతో వెంటనే గాంధీజీ దక్షిణ భారత హింది భాషా ప్రచార ఉద్యమాన్ని చేపట్టి పర్యటనలు ప్రారంభించారు. ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ఈసమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే 1946 సంవత్సరంలో నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పై వున్న నిషేధాన్ని ఎత్తి వేసింది. కమ్యూనిస్ట్ పార్టీ పై నిషేధాన్ని విధించింది. 1946, ఫిబ్రవరి 3, 4 తేదీలలో మద్రాస్ లో నిర్వహించిన దక్షిణ భారత హింది భాషా ప్రచార కార్యక్రమం నుండి వస్తున్న గాంధీజీ, ఖమ్మం టౌన్ కాంగ్రెస్ కోరిక మేరకు మార్గ మధ్యమంలో రైల్ ఆగగా ఫిబ్రవరి 5 వ తేదిన మహాత్మాగాంధి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఖమ్మం టౌన్ కాంగ్రెస్ కు అప్పుడు శ్రీ గెల్లా కేశవా రావు ప్రెసిడెంట్ గా వున్నారు. స్వాతంత్య్ర దినోత్సవమ్ సందర్భము గా స్వాతంత్ర్...