51. (ఖమ్మం చరిత్ర-3) నిజాం వ్యతిరేక పోరాటం తరువాత ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్ర?
నిజాం వ్యతిరేక పోరాటం తరువాత ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్ర.
ప్రతీ తరానికి, వెనుక తరం చరిత్ర తెలుసుకోవాలని కుతూహలము వుంటుంది.
అందులోను ప్రభుత్వాలు మన పిల్లలకు చరిత్ర పాఠాల భోధనలను చాలా వరకు చదువులో భాగంగా పెట్టారు. రాయని చరిత్ర గురించి కుతూహలం ఇంకా అధికంగా వుంటుంది. మా ఖమ్మం చరిత్ర ఇంత వరకు అముద్రితం. రాయని చరిత్ర పై ఎన్నెన్నో ప్రశ్నలు. మాతరం అడగని ప్రశ్నలు. ఈ తరానికి తెలీని సమాధానాలు.
1952 సంవత్సరంలో వేమ్సూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు పై పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి ఇండిపెండెంట్ గా అసెంబ్లీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన శ్రీ జలగం వెంగళ రావును కాంగ్రెస్ పార్టీ ఆరు సంవత్సరాలు బహిష్కరించింది. ఆయన బహిష్కరణ సమయం పూర్తి కాకుండానే 1957 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆయన తమ్ముడు శ్రీ జలగం కొండలరావు కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసి ఎలా MLA అయ్యాడు? అసలు టికెట్ ఎలా వచ్చింది? అప్పటి వరకు శ్రీ జలగం వెంగళరావు జిల్లా నాయకత్వ హోదాలో లేడు. నిషేధ కాలం పూర్తి కాగానే ఖమ్మం DCC PRESIDENT ఎలా అయ్యాడు? తరువాత వెంటనే జిల్లా పరిషత్ PRESIDENT గా ఎలా ఎన్నికయ్యాడు. దీని వెనుక రాజకీయాలేమిటి? ఎవ్వరి హస్తాలున్నవి?
శ్రీ వెంగళరావు రాజకీయంగా ఏ నిచ్చెన మెట్లేక్కాడు? నిచ్చెన పట్టుకున్నది ఎవ్వరు? నిచ్చెన మెట్లు ఎవ్వరు? ఆయన ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తి కాదు. అంతకు ముందు జిల్లాను శాసించగలిగిన స్థితిలో వున్న వ్యక్తి కాదు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గాని, తరువాత ఖమ్మం జిల్లాలోగాని పోరాట సమయమైనా తరువాతైనా ఖమ్మం మరియు మధిర తాలూకా నాయకులదే పైచేయిగా వుండేది. విచిత్రంగా వలసదారులదే పైచేయి అయింది. శ్రీ తమ్మినేని వీరభద్రం KHAMMAM MP గా గెలిచేటంత వరకు ఆతరువాత శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచేటంత వరకు వలసదారులే పార్లమెంట్ సభ్యులయ్యారు ఎందుకు?
ఉద్యమకారుల జిల్లాలో అదెట్లా సాధ్యం?
ఈ ప్రశ్నలకు వచ్చే జవాబుల సారమే నిజాం వ్యతిరేక పోరాటం తరువాత ఖమ్మం జిల్లా చరిత్ర.
పై ఫోటోలోని వున్నది శ్రీ జలగం వెంగల రావు. ఈ చిత్రాన్ని 27.07.1965 సంవత్సరంలో శ్రీ మెట్రో వెంకట్రావు తీసింది.
ఇంకా కొన్ని ఆసక్తికర విషయాలు ఈ జిల్లా ముఖ చిత్రం పై కనిపిస్తాయి.అందులో ఒకటి క్రింద పేర్కొన్నది.
1962 సంవత్సరంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆసమయంలో వేంసూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ వున్న SC POPULATION ఆధారం గా SC లకు రిజర్వు చేయాల్సి వచ్చింది . కానీ వేంసూరు బదులుగా అప్పుడే కొత్తగా ఏర్పడిన PALAIR నియోజక వర్గాన్ని SC RESERVED CONSTITUENCY మార్చారు. ఈ మార్పు వెనుక చాలా రాజకీయ తతంగం నడిచింది. అదేమిటి? కారకులెవ్వరు?
ఇంకోవిచిత్రం వుంధండి.
1959 సంవత్సరంలో జరిగిన పాలేరు పంచాయతి సమితి ఎన్నికలలో. అధ్యక్ష మరియు ఉపాధ్యక్ష ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ --అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీలు రెండు కలిసాయి. అధ్యక్ష మరియు ఉపాధ్యక్ష పదవులను పంచుకున్నాయి. గెలిచిన గ్రామ పంచాయతి సర్పంచులను వదిలి వేసి CO-OPTION MEMBERS కు అవకాశాన్నిచ్చారు. అప్పటి వరకు అవి ఉప్పు నిప్పుగా ఉండేవి. ఎవ్వరిని టార్గెట్ చేసి అవి కలిశాయి? కలిసి ఏమి సాధించారు? చివరికి ఎవ్వరు ఏమి కోల్పోయారు? ఈ ప్రశ్నలకు సమాదానాలలోనే ఆధునిక ఖమ్మం చరిత్ర దాగివుంది.
పై చిత్రంలో కుడివేపున కుర్చిలలో కూర్చున్న మొదటివారు శ్రీ జలగం వెంగళరావు, రెండవ వారు శ్రీ శీలం సిద్దారెడ్డి, మూడవవారు శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు మరియు ప్రక్కన శ్రీ కోట పున్నయ్య. సమావేశంలో మాట్లాడుతున్న వ్యక్తి శ్రీ హీరాలాల్ మోరియా. ముందు వరుసలో కుర్చిపై కూర్చున్న వ్యక్తిని నేను గుర్తించలేదు. ఈ కాంగ్రెస్ కార్య కర్తల సమావేశం జరిగింది ఖమ్మం తాలూకా ముదిగొండ గ్రామంలో.
పైన పేర్కొన్నవన్ని ఒకదానికొకటి ముడివడి వున్న అంశాలు. పై అంశాల విశ్లేషణ యే ఆధునిక ఖమ్మం చరిత్ర.
-----పెండ్యాల వాసుదేవరావు.
<!-- Google tag (gtag.js) -->
<script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script>
<script>
window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());
gtag('config', 'G-1M93C8YK91');
</script>
Comments