మా నేలకొండపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం.
73. (NKP..16). శ్రీ వేంకటేశ్వర స్వామీ దేవాలయ చరిత్ర. ఆరు వందల సంవత్సరాల పైగా చరిత్ర గల నేలకొండపల్లి లోని శ్రీ వేంకటేశ్వర స్వామీ దేవాలయాన్ని పూర్వకాలంలో "నాగుల్ దేవాలయం" గా పిలిచేవారు.నిజాం కాలం నుండి 1967 సంవత్సరంలో రాష్ట్ర దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకునే వరకు "దేవల్ బాలాజీ" అని పిలిచేవారు. యిక్కడ స్వామీ స్వయంభూ మరియు శేషావతారం.యిక్కడ కొలువైవున్న దేముడు భక్తుల కోరిక తీర్చే స్వామియని భక్తుల విశ్వాసం.