Posts

Showing posts from December, 2023

81. (SOCIAL--54) ఔనా? నిజమేనా?

Image
పల్లెల్లో సందడి మొదలైంది అలజడి మొదలైంది పంచాయతీ ఎన్నికల నగారా మ్రోగబోతోంది. "చేతులకు" పనిమొదలైంది "కార్లలో" ఇంధనం రెఢీ అవుతోంది "కోడవళ్లు" నూరటం షురూ అయింది. ఓ నడి వయస్సు పలుకరించింది అయ్యా చూస్తున్నరా? కాలం మారింది తరం మారింది ఓటు వేయాలంటే నోటియ్యాల గెలవాలంటే కోట్లు గావాలే యెట్లయ్యా గిట్లయితే?.... ఓ ప్రశ్న నా మనసును తట్టి లెపింది. గీట్లయితే ఎట్లా? నువ్వు రా అయ్యా యీరందరికీ బుద్ది చెప్పాలయ్యా నువ్వు నిలబడయ్యా అంది  ఆ రోజులు మళ్లీ రావాలయ్యా అంది. ఆలోచనలు ముసిరాయి యుద్ధాన్ని మొదలెట్టాయి. ఉద్యమానికి ఎక్కడో ఒకచోట  ప్రారంభం కావాలి కదా తొలి అడుగు పడాలి కదా అది ఇదే ఎందుకు కాకూడదు నడువు అని చెప్పింది. నా ఆలోచన అందీ.. కుడి యెడమ అయితే  ఇమేజ్ పోదా అని .. మనసు గీ పెట్టింది. ఉద్యమం అన్నాక కష్టాలు, నష్టాలు ఉండవా? మరకలు పడితే శుభ్రం కావా? యువతరం ఆ పని చేస్తుంది నువ్వు పదా అంది. ఔనా? నిజమేనా? చెప్పండి. .... ...పెండ్యాల వాసుదేవరావు <!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91">&l