68. (NKP-11). పాత కట్టడాల కూల్చి వదిలేస్తే అభివృద్ధి అయిపోతుందా? ఈ జన్మస్థల ప్రాంగణానికి అధీకృత నిర్వాహకులు ఎవ్వరు?

నేలకొండపల్లి లోని శ్రీ  భక్తరామదాసు జన్మస్థలంలో అభివృద్దికి ప్రభుత్వ యంత్రాంగం శ్రీకారం చుట్టారు. సంతోషమే. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే.సి.ఆర్ గారికి అభివందనాలు. ఎవ్వరు చేయని పని మీరు చేశారు.రెండోసారి బంగారు తెలంగాణా ఏర్పడ్డ తరువాత ఖమ్మం జిల్లా పాలనాధికారి పేరిట మూడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.

శ్రీ భక్తరామదాసు జన్మస్థల ప్రాంగణంలో వున్న కంపౌండు గోడలను కూలగొట్టి, అంతకు ముందే మందిరం లోపల వున్న ఏకశిలా తెల్లరాతి విగ్రహానికి అదనంగా వేరొక విగ్రహాన్ని ఆరుబయట స్థాపిస్తే, కల్యాణమంటప నిర్మాణం చేపడితే అది అభివృద్ధిలో భాగమా?  అసలు జనాల కోరిక లేమిటి? జన్మస్థలంపై  ఆశలేమిటి? ప్రభుత్వానికి మార్గధర్శకులెవ్వరు? వాటి/వారి  చట్టభద్దత ఎంతవరకు?

 ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము ఖర్చు ఎలా చెయ్యాలో నిర్దేశించిన వారెవ్వరూ? ప్లాన్ తయ్యారీదారులెవ్వరు? జన్మస్థల  ప్రాంగణానికి నాధుడెవ్వరు, అమ్మా, అయ్యా  ఎవ్వరు?

అదేమి ఖర్మమో తెలీదుకానీ రాష్ట్రప్రభుత్వ గెజిటు నోటిఫికేషన్ రాకపూర్వమే అప్పటి రాష్ట్రమంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు స్థానిక శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన పేరిట  వున్న కంపౌండు గోడను కూల్చేశారు. స్థానికులు ఎన్నో శ్రమలకు ఓర్చి దశాబ్దాల తరువాత కట్టుకున్నగోడ అది. రెండేళ్లు దాటినా కూల్చిన దాన్ని మళ్ళీ కట్టలేదు.

ఈ 2020 సం.లో జరిగిన శ్రీ భక్తరామదాసు జయంతి కార్యక్రమాలకు పదిరోజుల ముందర శ్రీ భక్తరామదాసు జన్మస్థల ప్రాంగణంలో వున్న కొన్ని ధృడమైన పాత కట్టడాల కూల్చేశారు. అందులో ఆర్.సి.సి స్లాబ్ నిర్మాణంతో వున్న స్టేజీని(మొత్తము సిమెంట్ నిర్మాణమే), దాని వెనుక గ్రీన్ రూముగా ఉపయోగపడిన ఆర్.సి.సి నిర్మాణపు గది(ఇటుక, సున్నం నిర్మాణం) కూడా వుంది. ఈ స్టేజీ వద్దని ఒక సంఘమువారు  నైరుతి స్థలంలో ఒక గద్దె నిర్మాణం చేసి పైకప్పుగా ఐరన్ రేకులేసి కొంతకాలం కార్యక్రమాలను నడిపారు. ఆ వేదికపైనే దైవకార్యక్రమాలను శ్రీరామదాసు ధ్యానమందిర పూజారికూడా నిర్వహించారు. అది పిశాచస్థలం. దైవకార్యక్రమాలు అక్కడ నిషిద్దం. ప్రస్తుతం దాన్నికూడా కూల్చివేసి, అదే స్థలంలో  ఆర్.సి.సి స్లాబ్ కానీ, రేకులు కానీ లేకుండా మరొక గద్దె నిర్మాణం చేసి  వేదికపైననే జయంతి కార్యక్రమాల నిర్వహించింది జిల్లాయంత్రాంగం. జన్మస్థల ప్రాంగణంలో దక్షిణ దిక్కున, తూర్పుఆగ్నేయ భాగాన వున్న కంపౌండ్ గోడను కూడా కూల్చేశారు. కూల్చివేతలు కానరాకుండా అందమైన తెల్లటి బట్టల షామియానాతో  కప్పేసి కార్యక్రమాల నిర్వహణ జరగటం విశేషం.

భవనాల కూల్చివేతలో వచ్చిన కలపను, రేకులను ఎండకు ఎండి, వానకు తడవకుండా ఏర్పాటు చేస్తే మంచిది.

నేలకొండపల్లి లోని శ్రీ భక్తరామదాసు మందిర ప్రాంగణంలో దక్షిణభాగంలో కంపౌండుగోడ కూల్చివేత జరిగేముందు ఆ స్థలాన్ని చూపించే చిత్రం. అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో స్థానిక మహిళామండలి వారు నిర్మించిన మంగళూరు పెంకు, ఇటుక సున్నపు కట్టుబడితో వున్న  రెండు రూములు మనం చూడవచ్చు.




క్రింది  చిత్రంలో 1963 లో శ్రీభక్తరామదాసు రిక్రియేషన్ క్లబ్  నిర్మించిన ఆర్.సి.సి రూఫ్ రూము మరియు 1978 లో లిబర్టీ యూత్ క్లబ్  నిర్మించిన స్టేజీ. దీని ముందు సోలార్ దీపాన్ని చూడవచ్చు. జన్మస్థల ప్రాంగణంలో ఇది రెండవ సోలార్ దీపం. బ్యాటరీ వేయించే నాధుడు లేక సంవత్సరాల తరబడి కాంతులు ఇవ్వలేక పోతోంది.

క్రింది చిత్రంలో ఆర్.సి.సి రూఫ్ స్టేజీని  కాదని నిర్మించిన వేరే స్టేజీని చూడవచ్చు. ప్రక్కనున్న రూంను గ్రీన్ రూంగా వాడితే బాగుండేది కానీ ఎన్నడు వాడలేదు. 
క్రింది చిత్రంలో కొత్తగా ఆరులక్షల రూపాయల ఖర్చుతో నిర్మింపజేసిన పది అడుగుల శ్రీ భక్తరామదాసు కాంస్య విగ్రహాన్ని చూడవచ్చు. దానికి ఎదురుగానే వున్న సోలార్ దీపాన్ని చూడవచ్చు. దానికి సంవత్సరాల తరబడి బ్యా టరీని వేసే నాధుడే లేదు. దీపపు కాంతులు లేవు. రాత్రి వేళలలో ఆ విగ్రహానికి అది రక్షణ కూడా.

కంపౌండ్ వుంటేనే ఆవరణలో మొలిచిన గడ్డిని తినటానికి గొడ్లు వస్తుంటాయి. కంపౌండ్ లేకుంటే ఇగ చెప్పేదేమి వుంది.విగ్రహానికి మాత్రం రక్షణ ఏమిటి? సోలార్ దీపాల వెలుగులో రాత్రి కాపలాదారు వుండాలి. పగలు వచ్చిన భక్తులు/యాత్రీకుల సౌకర్యార్ధం ఒక మనిషి వుండాలి. పూజారి తప్ప అక్కడ ఎవ్వరు బాధ్యత గల వ్యక్తులుండరు. ఆయన సమయం పూజ సమయం మాత్రమేనని గమనించాలి.



క్రింద చిత్రంలో కనిపించే స్టేజీ కొత్తగా నిర్మించింది. మంగళూరు పెంకుకు రంగేశారు. అంచులకు పగిలి పోయిన  పెంకులను మార్చే తీరిక యంత్రాంగానికి లేకుండా పోయింది. ఈ కూలిన గోడలను కానరాకుండా మూసేసి కార్యక్రమాల జరిపించింది జిల్లా యంత్రాంగం అందులో భాగమైన పర్యాటక శాఖ. జన్మస్థల ప్రాంగణాన్ని దత్తత తీసుకున్న భద్రాచల దేవస్థాన అధికారుల జాడ మాత్రం కనిపించలేదు.

మళ్ళీ వచ్చే సంవత్సరంలో రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జరిగే జయంతి వుత్సవాలలో మాత్రమే సంబంధీకులు కనిపిస్తారు. అప్పటివరకు ఈ స్థలప్రాంగణం అనాధయే. ఎవ్వరు రారు. ఏమీ పట్టించుకోరు. అస్సలు దీనికి, నిర్వహణకు అధికారిక నాదుడు ఏవ్వరండీ బాబు.

జిల్లా యంత్రాంగం మీరు ద్రుష్టి యిలా పెట్టండి. ఎవ్వరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నిర్మాణాలు చేయకుండా కట్టడి చేయండి. చరిత్రను సక్రమంగా చెప్పండి.

ఒకసారి రెండు వేల సంవత్సర ప్రాంతంలో శ్రీ భక్త రామదాసు మందిర రేనవేషణ్ కార్యక్రమమని చెప్పి అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ గిరిధర్ మరియు ఎస్.పి శ్రీ సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో శ్రీ మంగళంపల్లి బాలమురళీ క్రిష్ణ గారిని ఆహ్వానిస్తే ఈ మందిరం ఇప్పుడే కట్టినట్లు "తన చేతుల మీదుగా ప్రారంభించటం మహాద్భాగ్యమన్నారు". అది కమ్యునికేషన్ గాప్. నిర్వాహకులు అతిధికి వివరాలను సక్రమంగా విశదీకరించకపోయిన ఫలితమది.  ఇంకో విచిత్రం ఏమిటంటే "ఈ మందిరాన్ని తానే యిరవై సంవత్సరాల క్రింద నిర్మించినట్లు గుర్తు" అని జిల్లాకు చెందిన ఒక సీనియర్ మంత్రి గారు అనటం. ఆయన అప్పుడు స్థానిక శాసన సభ్యుడు. ఎందుకిలా జరుగుతుందో తెలియదు. చాలామంది ఈ తరం పిల్లలేకాక, పొరుగూరు భక్తులు కూడా ఈ ధ్యాన మందిరమే శ్రీ భక్తరామదాసు నివసించిన సొంతఇంటిగా అనుకుంటారు. ఆయన స్మారకంగా ఆయన జన్మించిన స్థలంలో నిర్మించిన మందిరమని చెప్పేవారుంటే ఇలా జరుగదు.
రాష్ట్ర సాంస్కృతిక సంస్థ శ్రీ భక్తరామదాసు జయంతి ఉత్సవాల నిర్వహణ  చేపట్టటం ఎంతో గర్వ కారణం, కానీ నిరుడు  ప్రధమంగా తన చేతులలోకి తీసుకున్న జిల్లాయంత్రాంగం  అట్టహాసంగా నిర్వహణను చేసి (బెలూనుకు యిరవై అయిదు వేల రూపాయలు, హైడ్రాలిక్ స్టేజీ ఏర్పాటుకు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసి) ఈ సంవత్సరం సామాన్యంగా లోగడ కార్యక్రమాల మాదిరే జరగడం.......భవిష్యత్తులో మరెలా కార్యక్రమాలు జరుగుతవోననే ఆందోళనకు ఆస్కారం అవుతోంది.యిలా కాకుండా శాశ్వత పరిష్కారం ఆలోచించాలి.

విషయ విశ్లేషణతో పదిమంది దృష్టికి వాస్తవ విషయాలు తీసుకు వస్తే పరిష్కారం దొరుకుతుందనే ఆలోచన ఈ వ్యాసం వ్రాయటానికి ప్రేరణ. ఎవ్వరినో విమర్శించాలనే వుద్దేశ్యం లేదు.

                                                                ----పెండ్యాల వాసుదేవరావు 

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Comments

Popular posts from this blog

82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

36.(SOCIAL-36) MUST RETHINK ABOUT VIP SYSTEM IN INDIA.

50. (ఖమ్మం చరిత్ర-2) ఉద్యమాల గుమ్మం విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం.