42.(NKP-4). నేలకొండపల్లి లో శ్రీ భక్త రామదాసు స్మారక ఉత్సవాలు ---ప్రారంభ చరిత్ర.

శ్రీ భక్త రామదాసు స్మారక ఉత్సవములు నేలకొండపల్లి లో  ప్రారంభ చరిత్ర .

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో 1973 సంవత్సరం డిసెంబర్ 31 వ తేది నుండి 1974 జనవరి 2 వ తేది వరకు శ్రీ భక్త రామదాసు స్మారక ఉత్సవాలు  శ్రీ భక్త రామదాసు మెమోరియల్ సొసైటీని (REGD NO.715/74) ఆధ్వర్యం లో ప్రప్రధమం గా జరిగినవి. 


 శ్రీ భక్త రామదాసు స్మారక సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులుగా శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, ఉపాధ్యక్షుడిగా శ్రీ కంకిపాటి జగన్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి గా శ్రీ పీ.బీ. సోమయాజులు, సహాయ కార్యదర్స్యులుగా పైడిమర్రి కృష్ణశర్మ, శ్రీ కొడవటిగంటి శివరామశర్మ మరియు  కోశాధికారిగా శ్రీ కొత్త యోగానంద రావు వున్నారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో దాదాపు అదే సమయంలో 1973 డిసెంబర్ 27 నుండి 1974 జనవరి 3 వ తేది వరకు వాగ్గేయకారుల ఉత్సవాలు ప్రారంభించారు. వాటికి అయిదు లక్షల రూపాయల మూల నిధిని ఏర్పరిచి ఆర్ధిక వనరులను ఏర్పచింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం.

ప్రత్యేకించి శ్రీ భక్త రామదాసు పేరున స్మారకోత్సవములు నేలకొండపల్లిలో  మాత్రమే చరిత్రలో ప్రధమంగా ప్రారంభం అయినవి. ఇక్కడ నిర్వహణకు మాత్రం ప్రభుత్వ నిధులు మాత్రం ఏమీ లేవు. ఆ ధ్యాసే ప్రభుత్వ వర్గాలకు లేదు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలోనూ 1973 డిసెంబర్ 27 నుండి  1974 జనవరి 3 వ తేది వరకు వాగ్గేయకారుల ఉత్సవాలు ప్రారంభించారు. వాటికి అయిదు లక్షల రూపాయల మూల నిధిని ఏర్పరిచి ఆర్ధిక వనరులను ఏర్పచింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం.
 శ్రీ భక్త రామదాసు విగ్రహావిష్కరణ.



                  
శ్రీ భక్తరామదాసు స్మారక మందిరంలోని ఏకశిలా తెల్ల రాతి విగ్రహము. ప్రాచిన గ్రందాలలోని చిత్రాల ఆధారంగా ఈ విగ్రహాన్న  రూపొందించారు.  పై ఫోటో లో శ్రీ భక్త రామదాసు విగ్రహం పెట్టినప్పటి చిత్రం. 1977 సం.లో మే 28 తేదిన శ్రీ భక్త రామదాసు ఏకశిలా విగ్రహాన్ని తెనాలి పట్టణం లోని శిల్పులతో చేయించి శ్రీ భక్త రామదాసు మందిరంలో నెలకొలిపారు. సీతా రామ లక్ష్మనుల విగ్రహాలను కుడా తెల్ల రాయి తోనే యించారు.

శ్రీ భద్రాచల సీరామచంద్రస్వామి దేవస్థానానికి  శ్రీ భక్తరామదాసు  స్మారక భవనం అప్పగింత.


శ్రీ భక్త రామదాసు గారు దేశ విఖ్యాత భాక్తాగ్రేస్వరుడు. చరిత్ర ప్రసిద్ది చెందినవాడు కావటం వల్ల ఆయన స్మారకంగా చేసే కార్యక్రమాల నిర్వహణకు ఒక ఆడిటోరియం కూడా అవుసరమున్నది. స్థానికుల ఆర్ధిక యిబ్బందులతో రామదాసుగారి స్మారక  కార్యక్రమాల నిర్వహణ ఆయన ఖ్యాతికి తగ్గట్లు న్యాయం చేయలేమని, ఆయన ఆథ్యాత్మిక భావ ప్రచార వ్యాప్తిని జాతీయ స్థాయిలో చేయవలసిన అవుసరాన్ని గమనించిన పెద్దలు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారు ఈ స్మారక మందిరాన్ని/జన్మస్థల ప్రాంగణాన్ని భద్రాచల శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి అప్పగించుటకు  శ్రీ భద్రాచల సీతారామస్వామి దేవస్థాన కమిటీని సంప్రదించటం జరిగింది.

మే 4 తేది 1983 సంవత్సరంలో జన్మ స్థల ప్రాంగణాన్ని భవన నిర్వహణకు, కార్యక్రమాల నిర్వహణకు  భద్రాచల రామాలయానికి AP STATE ENDODWNMENTS COMMISSIONER LETTER R.C.NO.B3/74179/81, DT: 22.02.1983 and EXECUTIVE OFFICER , SRI SEETHAA RAMASWAAMY DEVASTHANAM, BHADRACHALAM LETTER R.C.NO.C1/2804/81, DT: 15.04.1983 ప్రకారం స్వాధీనం చేయటం జరిగింది. 

భద్రాచల దేవస్థానానికి అప్పచేప్పిన తరువాత 28.03.1984 తేది వరకు మందిర నిర్వహణలో భాగము అయిన సిబ్బంది వేతనాలు, ఎలక్ట్రిసిటీ బిల్ చెల్లింపులు, నిత్య నైవేధ్య దీపారాధనల ఖర్చులే కాక ధనుర్మాసాది ఉత్సవములకు  కూడా వైభవంగా నిర్వహించారు. కాని పైన పేర్కొన్న తేదీ తరువాత మందిరం తీవ్రమైన నిర్లక్ష్యమునకు  గురికావటమే కాకుండా రామదాసు స్మారక కార్యక్రమాల వూసే లేకుండా పోయింది. భక్తిరసం ఉట్టిపడేలా మేళతాళ ధ్వనులతో మర్మోగావలసిన ఈ మందిర ప్రాంతంలో కీచురాళ్ళ ధ్వనులు జనులకు వినిపించింది. మందిరంలో ప్రతిష్టించిన సీతారామచంద్రుల విగ్రహాలు పూజా పునస్కారాలకు నోచుకోక అపరిసుభ్ర వాతావరణంలో వెలతేలా పోయింది. 1989 సంవత్సరము దాక అదే పరిస్థితి వుండేది. దేవస్థాన పాలకమండల్లకు చేసిన విజ్ఞాపనల ఫలితంగా కొంతకాలం ఆతరువాత పూజా ద్రవ్యాలు, తరువాత పూజారి నియామకం జరిగింది. మందిరాన్ని భద్రాచలానికి అప్పగించింది శ్రీ భక్తరామదాసు గారిక స్మారకోస్థవాల కార్యక్రమాలు జాతీయస్థాయిలో చేయటానికి, ఆయన ఆధ్యాత్మిక భావవ్యాప్తిని  విశ్వవ్యాపితం చేయటానికి.

భద్రాచలానికి అప్పగించాక ఆశించినది లభించక పోగా రామదాసు స్మారక మందిరం దయనీయ స్థితిని    క్రింది చిత్రం లో చూడవచ్చు.
 
         

              
        
 శ్రీ భక్త రామదాసు విద్వత్ కళా పీఠం ఆవిర్భావం.      
పై దుస్థితిలో రామదాస స్మారక కార్యక్రమాలను గాలికి వదిలేయలేక ఉడతా భక్తిగా శ్రీ భక్త రామదాసు ఉత్సవాలు జరపాలనే ఉద్దేశ్యాన్ని శ్రీ సత్యనారాయణ రావు గారికి తెలిపి వారి ఆశీస్సులతో 1990 సం.లో శ్రీ భక్త రామదాసు విద్వత్ కళాపీఠంను స్థాపింఛి కార్యక్రమాలు ప్రారంభించారు. దాని Regd No.1829/93 గా నమోదైంది. 1993 సంవత్సరములో రామదాసు స్మారక మందిరంలోని సీతారామచంద్రుల మూల విగ్రహాలకు ఇత్తడి మకరతోరణాన్ని శ్రీమతి పెండ్యాల అన్నపూర్నమ్మ గారు బహుకరణ చేసారు. శ్రీ భక్తరామదాసు విద్వత్కళాపీఠం ప్రధమ అధ్యక్షులుగా శ్రీ రావులపాటి రంగారావు, ప్రధాన కార్యదర్శిగా శ్రీభీకంసింగ్ వున్నారు. వీరితోపాటు సర్వశ్రీ పెండ్యాల రామ్మోహన రావు, గండికోట రాజేశ్వర్ రావు, గండికోట శేషభూషణ రావు కార్య వర్గం సభ్యులుగా వుండేవారు.

శ్రీ భక్త రామదాసు స్మారక మందిరమునకు తురుపు దిక్కున స్థలం కొనుగోలు.
శ్రీభక్త రామదాసు జన్మస్థలములోని భావికి ఉత్తరదిక్కున వున్న ప్రైవేటు స్థలమును 1990 సంవత్సరములో శ్రీభక్తరామదాసు విద్వత్కళాపీఠం పేరున 690.00 చ.గ.కొన్నారు. అందులోని వేపచెట్లు వగైరాల అమ్మకంతో కొనుగోలు సొమ్ము చేకూరింది.

 శ్రీ భక్త రామదాసు స్మారక మందిరంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు.

1993 సం.ములో రామదాసు మందిరంలోని సీతారామచంద్రుల మూలవిగ్రహాలకు ఇత్తడి మకరతోరణాన్ని శ్రీమతి పెండ్యాల అన్నపూర్నమ్మగారు బహుకరణ చేసారు.శ్రీ భక్త రామదాసు స్మారక మందిరమునకు తూరుపు దిక్కున ఆగ్నేయంమూల నుండి రాతి స్థంభం వరకు శ్రీ భక్త రామదాసు స్మారకకమిటీ అధ్యక్షులు శ్రీ పెండ్యాల వాసుదేవరావు సొంత ధనంతో కాంపౌండ్ నిర్మాణం చేశారు. ఆ సమయంలో అక్కడికి అనుకోకుండా వచ్చిన స్థానిక మాజీ MLA , అప్పటి భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ శ్రీ కత్తుల శాంతయ్య నిర్మాణ వివరాలు తెలుసుకొని మా కుటుంబ నేపధ్యం తెలిసిన వారు కాబట్టి "ఇప్పటివరకు మీకుటుంబం పెట్టింది చాలు, నేను భద్రాచలదేవస్థానం నుంచి కొంత ఇస్తాను" అని చెప్పి వారి కమిటి తీర్మానం మేరకు Rs 25,000/-ఇచ్చారు. వెంటనే అప్పటి MLA శ్రీ సండ్ర వెంకటవీరయ్య తన నిధులనుంచి Rs 25,000/-ఇచ్చారు. ఈ విధంగా రామదాసు మందిరం చుట్టూ తూరుపు, దక్షిణ మరియు పడమర దిక్కులలో కాంపౌండ్ నిర్మాణం జరిగింది.

 1999 సంవత్సరంలో శ్రీ భక్త రామదాసు ప్రాజెక్ట్, భద్రాచలం వారి కార్యక్రమం.

శ్రీ భక్తరామదాసుప్రాజెక్ట్, భద్రాచలం వారు 1999 సం.లో అప్పటి ఖమ్మం డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ అప్పారావు, ఖమ్మంజిల్లా కలెక్టర్ శ్రీ N.గిరిధర్ మరియు జిల్లాసూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ పెండ్యాల సీతారామాంజనేయులు తీసుకున్న చొరవతో  శ్రీ భక్త రామదాసు స్మారక మందిరం Renovation కార్యక్రమాన్ని చేపట్టారు. డంగుసున్నంతో వున్న గోడల plasting ను తీసేసి సిమెంట్ plasting ను చేసారు. సిమెంట్ ఫ్లోరింగ్ ను  తీసేసి Marble  ఫ్లోరింగ్ ను వేసారు. మందిరానికి ENAMIL painting ను వేసారు. జిల్లా ఉద్యానవ శాఖ వాళ్ళు మొక్కలు వేసారు. ప్రక్కనే వున్న విద్వత్కలాపీఠం స్థలాన్ని లెవెల్ చేయించి ఆస్థలంలో వున్న పాటి మన్నును చదును చేసి మందిరం చుట్టూ పోయించటంతో ప్రాగణమంతా ఎత్తు పెరిగింది. విద్వాత్కలా పీఠం స్థలాన్ని రామదాసు మందిర ప్ప్రాంగణంనంలో కలిపేసారు. ఆ స్థలానికి పడమర మరియు ఉత్తర దిక్కున కంపొండ్ నిర్మాణం చేసారు.   

శ్రీ భక్త రామదాసు ప్రాజెక్ట్, భద్రాచలం వారు  శ్రీ భక్త రామదాసు స్మారక మందిరం పేరును ధ్యానమందిరంగా మార్చారు. అంతకు ముందు స్మారకమందిరం గానే పిలువబడేది. భద్రాచల శ్రీ సీతారామస్వామిదేవస్థానంకు స్వాధీనం చేసేతంతవరకు శ్రీ రామదాసు స్మారకోత్సవాలుగాను తరువాత ఆరాధనోత్సవాలుగానామకరణం చేసి నిర్వహించారు.
శ్రీ భక్త రామదాసు ప్రాజెక్ట్, భద్రాచలం ప్రాజెక్ట్ వారి  కార్యక్రమం తరువాత మందిరం  చిత్రాలు. 

  

శ్రీ భక్త రామదాసు జయంతి కార్యక్రమాల ప్రారంభం: 
2001 సం.లో శ్రీ పెండ్యాల వాసుదేవరావు   శ్రీ భక్త రామదాసు విద్వాత్కళాపీఠం అధ్యక్షులుగా   బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్ట మొదటిసారిగా శ్రీ భక్త రామదాసు జయంతిని 14.02.2002  తేదిన నేలకొండపల్లిలో చేయటం జరిగింది. అప్పటినుడి రెగ్యులర్ గా  జయంతి కార్యక్రమాలు జరుగుతున్నవి. తరువాత భద్రాచలంలో కూడా దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ భక్త రామదాసు జయంతి కార్యక్రమాలు 372  జయంతి నుండే (11-2-2005 -13-2-2005) ప్రారంభం అయినవి. ఆకార్యక్రమాలు భద్రాచలం  కళ్యాణమంటపం వేదికగా జగినవి. అప్పుడు భద్రాచల దేవస్థానం  కార్యనిర్వహణాధికారిగా శ్రీ యం. రఘునాద్ వున్నారు. 

నేలకొండపల్లిలో ప్రధమంగా శ్రీ భక్తరామదాసు జయంతిని జరిపిన సంధర్హంగా చిన్నారి కళాకారులు, వారి గురువు శ్రీ మాధవరావుతో పీఠం ప్రెసిడెంట్ శ్రీ పెండ్యాల వాసుదేవ రావు మరియు పీఠం సెక్రటరీ శ్రీ రాజపుత్ర భీకంసింగ్.



శ్రీ భక్త రామదాసు ప్రాజెక్ట్, భద్రాచలం వారు మందిర పునరుద్ధ్హరణ తరువాత మందిర నిర్వహణలో ఏమాత్రం మార్పు రాలేదు. కార్యక్రమాల నిర్వహణ లోకల్ శ్రీ భక్త రామదాసు విద్వత్ కళాపీఠం మీదనే పడింది. 2001-04 వరకు పీఠం అధ్యక్షులు శ్రీ పెండ్యాల వాసుదేవ రావు స్వంత వనరులతోనే చేయవలసి వచ్చింది. తదుపరి వచ్చిన కార్యవర్గం ఏవో కొద్దిగా వసులుచేసిన చందాలతో కార్యక్రమాలను ప్రతి సంవత్సరం మొక్కుబడిగానే నిర్వహించారు. నియోజకవర్గంలో మొట్ట మొదటి సారిగా సోలార్ లైట్స్ ను  రామదాసు మందిరంలో శ్రీ భక్త రామదాసు మెమోరియల్ కమిటీ చొరవతో చైర్మన్ శ్రీ పెండ్యాల వాసుదేవ రావు పెట్టించటం జరిగింది.

శ్రీ భక్త రామదాసు జన్మస్థలాన్ని భద్రాచల రామాలయానికి అప్పగించేటంత వరకు శ్రీ రామదాసు స్మారకోత్సవాల పేరిట కార్యక్రమాలు జరిగేవి. జన్మస్థల ప్రాంగణాన్ని శ్రీ భక్త రామదాసు స్మారకమందిరం అనేవారు. విద్వాత్కళాపీఠం వారు స్టార్ట్ చేసాక అవి శ్రీ రామదాసు ఆరాధనోత్సవములని పిలవటం ప్రారంభం అయినది. శ్రీ భక్త రామదాసు ప్రాజెక్ట్ వారు భవన పునరుద్దరణ తరువాత జన్మస్థల ప్రాంగణాన్ని శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరమని నామకరణం చేశారు.

తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఉత్సవాల నిర్వహణ ప్రారంభం.

ఈ సందర్భంలో స్మారక మందిరంలో ఇదివరకు వున్న శ్రీ భక్త రామదాసు ఏకశిలా తెల్ల రాతి విగ్రహాన్ని మారుస్తారని విన్న పిదప జనం తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకు క్రింది విధంగా విజ్ఞప్తి చేసియున్నాము. విజ్ఞప్తిని మన్నించి నందులకు  ధన్యవాదాలు.
We will be thankful to Hon'ble CM of Telangana for an announcement of Sri Bhaktha Ramadasu Jayanthi celebrations on behalf of State Govt at Nelakondapally.

Here is Ekasila White Stone Statue of Sri Bhaktha Ramadasu and Seeta Rama, Laxmana & Hanuman White Stone Statues in the Memorial Hall of Sri Bhaktha Ramadasu Birth Place Nelakonda Pally. The Statues were unveiled dt: 28 th May 1977 by the Elders who built the memorial in the year 1955. The Statues were made in Tenali town of Andhra Pradesh.

We bring to the notice of the Hon'ble CM of Telangana not to replace the present Ramadasu Statue with a new one which it will hurt the sentiments of people of this area. Arrange new one in another place.

The Statue was made on the basis of the pic which was in the old Historical Books.
Thank u.





2016 సం.లో తెలంగాణారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న దేవాలయాల పునరుద్ధరణలో భాగంగా వారి దృష్టి శ్రీ భక్త రామదాసు జన్మస్థలం మీద పడటము వారి ఆదేశాలమేరకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ శ్రీ భక్త రామదాసు గారి ఆరాధన మరియు జయంతి ఉత్శావాల నిర్వహణ చేపట్టటం నేలకొండపల్లి మరియు పరిసర గ్రామాల ప్రజల చిరకాల వాంఛ నేరవేరినట్లు అయినది. శ్రీ భక్త రామదాసు గారికి ఇకనైనా న్యాయం జరుగుతున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కలువకుంట్ల  చంద్రశేఖర రావు గారికి అభివందనాలు. 2017 మరియు 2018 సం.లలో రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగినవి. నేలకొండపల్లి పరిసర ప్రాంత ప్రజల కోరిక ఈడేరినట్లు అయినది. సంతోషం.
                                                                      జై శ్రీరామ్.
----పెండ్యాల వాసుదేవ రావు. 

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>
      

Comments

Popular posts from this blog

82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

78. (social...51). ఎవవరెవరో ఎక్కడినుండో వస్తారు..... ఆలోచించండి ప్రజలారా...

80. (SOCIAL--53) దేశంలో ప్రజా సేవ ఇంత Costly నా? ఎవ్వరికీ బాధ్యతలు లేవా?