48. (NKP-8). మా సహకార గ్రామీణ బ్యాంక్
మా సహకార గ్రామీణ బ్యాంకు( The Co-operative Rural Bank ltd).
ప్రస్తుతం ఈ బ్యాంకును అన్నిటిలాగే ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అంటున్నారు.
ప్రస్తుతం ఈ బ్యాంకును అన్నిటిలాగే ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అంటున్నారు.
నేలకొండపల్లి సహకార గ్రామీణ బ్యాంకును తేది 13.07.1956 న స్వాతంత్ర్య సమరయోధులు, ఆనాటి మద్రాస్ రాష్ట్రంలో సీనియర్ కాబినెట్ మంత్రి మరియు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ గా పనిచేసిన శ్రీ కళా వెంకట్రావు గారు ప్రారంభించారు. కోనసీమను నందనవనం చేసిన మహానుభావుడాయన. శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారికి అత్యంత సన్నిహితుడు ఆయన. సత్యనారాయణరావు గారి ఆహ్వానం మేరకు ఆయన వచ్చారు.అప్పటికి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడలేదు.
మొదటి మూడు టర్మ్ లు సహకార గ్రామీణ బ్యాంకుకు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారు ప్రెసిడెంటుగా ఉన్నారు. అప్పుడు ఒక టర్మ్ ఒక సంవత్సరం మాత్రమే వుండేది. ఆ సహకార గ్రామీణ బ్యాంకు క్రింద 1.నేలకొండపల్లి, 2. సింగారెడ్డిపాలెం,3. సదాశివపురం, 4. కొత్త కొత్తూరు, 5, పాత కొత్తూరు, 6.బోదులబండ,7.తిరుమలాపురం,8. కోరట్లగుడెం, 9.అనాసాగారం.10.గువ్వలగూడెం, 11. ఆరెగూడెం, 12.కోనాయగుడెం,13. ఆచార్లగూడెం ఉండేవి. అన్ని భౌగోళికం గా అనుకూలంగా ఉండేవి.
క్రింది చిత్రంలో సహకార గ్రామీణ బ్యాంకు బకాయి దార్లకు ఇవ్వాలిసిన నోటిసుల ను గ్రామాల వారీగా SORTOUT చేస్తున్న సహకార గ్రామీణ బ్యాంకు ప్రెసిడెంట్ శ్రీ పెండ్యాల వాసుదేవ రావు కనిపిస్తున్నారు.
నాకు ఆ టర్మ్ (ఫస్ట్ టర్మ్) లో సిబ్బంది ఎవ్వరు లేరు. అంతా నేనే. ATTENDER తో సహా.
26 సంవత్సరాల వయస్సులో 1981 సంవత్సరం లో మొట్ట మొదటి సారిగా Co-operative Rural Bank president గా ఎన్నిక అయినాను. నాకన్నా ముందు జరిగిన ఎన్నికలన్నీ ఏకగ్రీవమే అయినవి.ఈ సమయంలో జరిగిన ఎన్నికలు మాత్రము గ్రామ పంచాయతి ఎన్నికలను మించి ఉధృతం గా జరిగాయి. తరం మార్పిడికి సంబంధించి జరిగిన ప్రసవ వేదన అది. ఆ కమిటీలో శ్రీ బుగ్గవీటి కృష్ణయ్య, Ex MLA OPPOSITION పాత్రను పోషించారు.ఆయన డైరెక్టర్ గా వుండే వారు.
నేను ఎన్నిక అయిన వెంటనే అప్పటివరకు సెక్రటరీ గా వున్న శ్రీరామారావు రాజినామ చేసాడు.సెక్రటరీతో సహా స్టాఫ్ ఎవ్వరు లేరు.ప్రెసిడెంట్ ను అనే మాట మరచి ఆ Term అంతా జీతం భత్యం లేని CEO గా సిబ్బంది లేకుండానే పూర్తి సమయం గడపవలసి వచ్చింది.
ప్రతీ విషయంలో ఖమ్మం సెంట్రల్ బ్యాంకు మరియు కో-ఆ ప రే టి వ్ డిపార్టుమెంటు తో యుద్ధమే.
ప్రత్యేకం గా ఆఫీస్ ఏర్పాటు చేసాము. ఫర్నిచర్ కొన్నాము. 25 సంవత్సరాల AUDIT పూర్తి చేసాము.Technical problem వల్ల loan సకాలంలో సెంట్రల్ బ్యాంకు ఇబ్బందులకు గురిచెయ్యటంతో 400 మంది రైతులకు sanction అయ్యే మొత్తమును దృష్టిలో పెట్టుకొని ఎరువులు అరువుకు తీసుకొని వచ్చి పంచాము. ఇంత సాహసం చేసే శక్తి నాకు గాని మరెవ్వరికి గాని లేదని ఓకే రైతు పెద్ద శ్రీ దేశ్ముఖ్ నరహరి రావు వ్యాఖ్యా నించారు.
శ్రీ పెండ్యాల సత్యనారయణ రావు గారు బ్యాంకుకై కొన్న ఒక ఎకరం భూమి అంతకు ముందు దశాబ్దంలో అన్యా క్రంతం కావటం తో మిగిలిన ముక్కలు ముక్కలుగా వున్న భూమిని అమ్మి గోదాము నిర్మాణాని కై అవుసరమైన 1200 చ.గ. స్థలాన్ని కొన్నాము. ఇప్పుడు దాని విలువ కోటి రూపాయల పైననే.
నా టర్మ్ అయిపోయే సమయంలో శ్రీ రామాయణం శ్రీధర్ SERETARY గా వచ్చాడు. అతని పనితనాన్ని చూసి సంతృప్తి చెందాక అతన్ని కొనసాగించాము.
ఈ సేవా కార్యక్రమాలతో జీవనోపాధికోసం జీవితంలో పైచదువులకు వెళ్ళలేక, ఉద్యోగ లేదా వ్యాపారాల్లోకి పోలేక ఇందులోనే వుండిపోయాను నేను. నాకు ఇదే లోకం అయినది. దశాబ్దాల తరబడి ఈ బ్యాంకుతో అనుబంధం ముడిపడి పాయినది. బ్యాంకు ప్రక్షాళనకు, పునర్నిర్మాణానికి నేను ఎక్కువ సమయం వెచ్చించాను.
Below pic. CRB, Nelakondapally 1987 TEAM. This was my 2nd term as President.
In the chairs middle Pendyala Vasudeva Rao, President, From Right to left: Sarvasri R.Sridhar(Secretary), D.Papa Rao(Supervisor), Vice President Vadde Ranga Rao, and Smt Gandluri Seeta.
In the standing row from left to right: Sarvasri Koti Hanumantha Rao, Pallapu Rama Rao, Pagidikattula Venkateswarlu, Kasaboina Janaiah, Rayapudi Venkateswar Rao, Bhukya Hanuma, Swamy Krishna Rao, Devarasetty Venkateswar Rao and Volloju Narayana.
On the Back Bench: Right to left: Khammam Venkateswarlu, Kanaparthi Nagender and Kummarikuntla Venkateswarlu(Attender).
ఈ టర్మ్ లో నేను ఒక్క నిమిషం కుడా ఉపిరి తీసుకునే సమయం లేకుండా వుండేది. ఏరియా అఫ్ ఆపరేషన్ పెరిగింది. లోనింగ్ పెరిగింది. షుగర్ పంట వచ్చింది. ఏరియా లోకలైజ్ అయినది. రాష్ట్ర సహకార శాకా మంత్రి అయిన శ్రీ గొల్లపల్లి సూర్య రావు ఖమ్మం జిల్లా ఇంఛార్జ్ మంత్రి కావటంవల్ల రాజకీయ ప్రత్యక్ష పోరాటం వుధృతంగా జరిగింది. బ్యాంకు కార్యకలాపాలలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకొనే వాడు. ఒక డైరెక్టర్ అనర్హత విషయమై ప్రత్యక్ష యుద్ధం జరిగింది మా బ్యాంకు పాలక వర్గం మొత్తాన్నేరద్దు చేస్తానని నోటీసు ఇప్పించాడు.నేను జవాబు ఏమి చెప్పినా పాలక వర్గం రద్దె.High Court government యిచ్చిన Statutory Notice ను admission stage లోనే QUASH చేయటం తో సహకార శాఖ తెల్లబొయింది.
Day to day కార్య కలాపాలలో కూడా అన్ని పోరాటాలే. సిబ్బందిని నియమించుకొంటె సెంట్రల్ బ్యాంకుతో యుద్ధం, వాళ్లకు జీతాలు పెంచుతే Co-operative depatrtment తో జగడం, సిబ్బందిని CO-OPERATIVE TRAINING కు సొసైటీ ఖర్చుతో పంపితే పోరాటం, సిబ్బంది హోదా పెంచి ప్రమోషన్ ఇస్తే ఆడిట్ అభ్యంతరాలు..రాష్ట్రం లో మొదటి సారిగా ప్రాధమిక లెవెల్ లో CHARTERED ACCOUNTANT తో ఆడిట్ చేయించు కోవటానికి రాష్ట్ర కమీషనర్ దగ్గరనుండి పర్మిషన్ కుడా తెచ్చుకొని పోరాటంతో విజయం సాదిం చాము.
భవిష్యతులో జీవితం లో స్థిర పడే యత్నం లో ఒక ప్రక్కన LLB విద్యనూ అభ్యసించటం...ఇలా ఎన్నో.
ఒక సంవత్సరం చెరుకు రైతులకు లోన్స్ DISBURSEMENT చెయ్యకుండా (AREA LOCALISE అయినది) సెంట్రల్ బ్యాంకు తాస్తారం చేస్తుంటే నేను ఒక్కడినే జిల్లా కలెక్టర్ శ్రీ I.Y.R.కృష్ణ రావు గారి దగ్గరకు రిప్రేసేంట్ చేయటానికి వెళ్లి within 24 hours లో లోన్స్ బట్వాడా చేయించాను. నేను కలెక్టర్ గారి దగ్గరకు వెళ్ళిన సందర్భం లోనే సిపిఐ లీడర్ మొహమ్మద్ మౌలానా కుడా ఒక వంద మంది రైతులతో రైతులకు లోన్ బట్వాడా కోసం Representation కై వచ్చాడు. ఆయన పనికూడా ఐనది.
విషయం ఏమిటంటే ఒక్కడినే పోయి పని సాధించుకు రావటం వల్ల జనానికి సకాలంలో లోన్స్ వచ్చి ఇబ్బంది తెలియలేదు.తాము ఏ పరిస్థితిని ఎదుర్కొన్నారో అదెలా పరిష్కారము అయినదో వాళ్లకు తెలీదు.పుబ్లిసిటీ లేకపోవటం వల్ల నా కృషి తెలియలేదు. శ్రీ మౌలానా జనాన్ని ఊరి నుండి తీసుకుని రావటం వాళ్ళ ఆయన కృషి జనాలందరికీ తెలిసింది.
మా సహకార బ్యాంకు సభ్యులు అయిన రైతులు అందరికి సకాలంలో ఋణాలు అందిస్తు ఇబ్బంది లేకుండా చేయటమే నా పంధా.
నేను అధికారం లో వున్నా, లేకున్నా సకాలంలో ఇబ్బందులు లేకుండా పని అయిపోయే విధంగా చేయటమే నా తత్వం. నేను చేసింది, సాధించింది అదే.ఇది మా నాయన గారి తత్వం.నేను నేర్చుకున్న పాఠం.
పైచిత్రంలో రెండవ CO-OPERATIVE RURAL BANK PRESIDENT శ్రీ కొమ్మినేని అనంతరామయ్య (2 YEARS- 1960--61 ) కనిపిస్తున్నారు.
చిత్రంలో శ్రీ శీలం సిద్దా రెడ్డికి సన్మాన పత్రం సమర్పిస్తున్న శ్రీ కొమ్మినేని అనంతరామయ్య. చిత్రంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావుతో చర్చిస్తున్న శ్రీ శీలం సిద్ధారెడ్డి, MLC & AP State Major Irrigation minister ప్రక్కన పాలేరు సమితి మాజీ ప్రెసిడెంట్ శ్రీ రావులపాటి సత్యనారాయణ రావు మరియు ఖమ్మం మాజీ MLA శ్రీ బుగ్గవీటి కృష్ణయ్య.
పై నున్న చిత్రంలో Co-operative Rural Bank కు మూడవ president గా వున్న శ్రీ కంకిపాటి రాజేశ్వర రావు @ జగన్నాధరావు కనిపిస్తున్నారు. శ్రీ కీసర అనంతరెడ్డి, ఖమ్మం MLA మరియు TELANGANA PLANNING BOARD CHAIRMAN గారికి శ్రీ కంకిపాటి సన్మానపత్రం సమర్పిస్తున్న దృశ్యం. అప్పుడు ఆయన సహకార గ్రామీణ బ్యాంకు ప్రెసిడెంట్. ఈయన 1975-81 వరకు రెండుటర్మ్ లు ప్రెసిడెంట్ గా వున్నారు.చిత్రంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారు సహకార గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకులు కూడా చిత్రంలో వున్నారు.
<!-- Google tag (gtag.js) -->
<script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script>
<script>
window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());
gtag('config', 'G-1M93C8YK91');
</script>
Comments