ప్రశ్నించే గొంతు కావాలి. నిలదీసే దమ్ము ఉండాలి.
63. (SOCIAL-42) ప్రశ్నించే గొంతు కావాలి. నిలదీసే దమ్ము ఉండాలి. ఎవ్వరు బాధ్యులు? ఒక రాజకీయపార్టీ టికెట్ పై, ఒక సిద్దాంతం పై ఎం.ఎల్.ఏ గా పొటీ చేసి గెలిచి, మరో రాజకీయ పార్టీ లోకి వలస వెళుతున్న ఎం.ఎల్.ఏ లను నిలదీసే హక్కు ఎవ్వరికుంది? ఆ నైతిక హక్కు ఎవ్వరికుంది? తమకోసం అహర్నిశలు పనిచేసే కార్యకర్తల గాలికొదిలేసి కాంట్రాక్టర్లకు, పారిశ్రామికవేత్తలకు డబ్బుకు కక్కుర్తిపడి పార్టీ టికెట్లను అమ్ముకుంటున్న బాధ్యతారహిత రాజకీయ పార్టీల నేతలది కాదా తప్పు? ప్రజాప్రతినిధి గా ఎన్నిక కావటానికి “బి” ఫోరం ఇచ్చిన రాజకీయ పార్టీ కుందా?