60 . (ఖమ్మం చరిత్ర-8) ఖమ్మంలో మహాత్మా గాంధి--ప్రజల మదిలో జాతి పిత జ్ఞ్యాపకాలు..
Mahatma Gandhi's meeting was held in my ancestral land in Khammam town near Venkatagiri Railway gate 5 August 1946.—
1942 సంవత్సరం ఆగస్ట్ నెలలో ప్రారంభమైన క్విట్ఇండియా ఉద్యమం 1945 లో ముగియటంతో వెంటనే గాంధీజీ దక్షిణ భారత హింది భాషా ప్రచార ఉద్యమాన్ని చేపట్టి పర్యటనలు ప్రారంభించారు.
ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ఈసమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే 1946 సంవత్సరంలో నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పై వున్న నిషేధాన్ని ఎత్తి వేసింది. కమ్యూనిస్ట్ పార్టీ పై నిషేధాన్ని విధించింది. 1946, ఫిబ్రవరి 3, 4 తేదీలలో మద్రాస్ లో నిర్వహించిన దక్షిణ భారత హింది భాషా ప్రచార కార్యక్రమం నుండి వస్తున్న గాంధీజీ, ఖమ్మం టౌన్ కాంగ్రెస్ కోరిక మేరకు మార్గ మధ్యమంలో రైల్ ఆగగా ఫిబ్రవరి 5 వ తేదిన మహాత్మాగాంధి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఖమ్మం టౌన్ కాంగ్రెస్ కు అప్పుడు శ్రీ గెల్లా కేశవా రావు ప్రెసిడెంట్ గా వున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవమ్ సందర్భము గా స్వాతంత్ర్య సమర యోధులను సత్కరించే కార్యక్రమంలో భాగం గా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా శ్రీ చింతనిప్పు లాలయ్య, కొత్త సీతారాములుతో కలిసి నేను వెళ్లినప్పుడు శ్రీ గెల్లా కేశవా రావు గారు ఆ మరపురాని ఘట్టాన్ని వివరించారు. "బాబు మేము ఏర్పాటు చేసిన సభా వేదిక స్థలం మీదే, ఇప్పుడు మీకు లేదులెండి" అని నాతో చెప్పారు. అలాగే గాంధిజీ ఆసీనులైన సభా వేదికను చెక్క బల్లలతో సుమారు ఇరవై అడుగుల ఎత్తు లో నిర్మించామని చెప్పారు. 15 నిమిషాల పాటు హింది లో సాగిన ఆయన ప్రసంగాన్ని శ్రీ మోటూరు సత్యనారాయణ తెలుగు అనువాదం చేసారని కూడా చెప్పారు. గాంధిజీ వెంట ఆయన కార్యధర్స్యులు ప్యారేలాల్ గాంధీ, మహాదేవ దేశాయ్ వున్నారని చెప్పారు. కమలాదేవి బజాజ్ కూడా వెంట వున్నారు.
అది ఖమ్మం పట్టణ చరిత్రలో మరచిపోలేని చారిత్రక ఘట్టం. మధుర క్షణాలు. అప్పుడు ఖమ్మం నిజాం రాష్ట్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండేది. నిజాం విమోచనం/ఇండియాలో విలీనం అయిన తరువాత హైదరాబాద్ రాష్ట్రంలో 1953 సంవత్సరంలో ప్రత్యేక జిల్లాగా ఏర్పడినది.
1946 సంవత్సరంలో ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తిని ఇవ్వాలనే ఆలోచనతో బ్రటిష్ ప్రభుత్వం "బ్రిటిష్ కాబినెట్ మిషన్ " ప్రతిపాదనను తీసుకవచ్చింది. ఇది దేశంలో అలజడికి కారణం అయినది. దేశ విభజనకు అది దోహద పడుతుందనే అనుమానం తో గాంధి దీనిని నిరాకరించాడు. కాని నెహ్రు, పటేల్ లు దేశం ముస్లిం లీగ్ పరం అవుతుందనే భయంతో గాంధి మాటను త్ర్హోసిపుచ్చారు. హిందూ-ముస్లిం కొట్లాటలు తారాస్థాయికి వెళ్లి అయిదు వేల మంది ప్రజలకు పైగా హత్య గావించ బడ్డారు. పర్యావ సానమే కొన్ని శక్తులు గాంధిని హత మార్చ ప్రయత్నిన్చాయి.
1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. 1944 నుంచి 1948 వరకూ మహాత్మా గాంధీకి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన వెంకిట కల్యాణం ఆయన హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నారు. ఆయన మాటల ప్రకారం"1948 జనవరి 30వ తేదీ సాయంత్రం 5:17 గంటలకు మహాత్మాగాంధీ ఢిల్లీలోని బిర్లాహౌస్లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరాంగాడ్సే ఆయనకు ఎదురుగా వచ్చారు. అప్పుడు గాంధీ పక్కనే ఉన్న సహచరి అషా ఛటోపాధ్యాయ గాడ్సేను పక్కకు నెట్టివేస్తూ ఆలస్యమైంది పక్కకు జరగండి అంటూ తోస్తూనే ఉంది. కానీ గాడ్సే పాయింట్ 380 ఏసీపీ, 606824 సీరియల్ నెంబర్ కలిగిన బెరెట్టా ఎం 1934 అనే మోడల్ సెమి-ఆటోమెటిక్ పిస్టల్తో గాంధీ ఛాతిలోకి మూడుసార్లు కాల్చారు. దీంతో బాపూజీ అక్కడికక్కడే కుప్పకూలారు. కాల్చిన ఒక బుల్లెట్ గాంధీ ఛాతిలోకి దూసుకొని పోగా మిగిలిన రెండు బుల్లెట్లు పొట్ట నుంచి దూసుకెళ్లాయి.
అంతే.
.......PENDYALA VASUDEVARAO
----Published on Date: 17.04.2018.
Republished on Date: 03.10.2018.
----Published on Date: 17.04.2018.
Republished on Date: 03.10.2018.
<!-- Google tag (gtag.js) -->
<script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script>
<script>
window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());
gtag('config', 'G-1M93C8YK91');
</script>
Comments