మేధావులు కదలండయ్యా ....ఎన్నికల రంగలో పోగైన కలుపు ను తీసేద్దాం రండయ్యా...
62. (SOCIAL-41) మేధావులు కదలండయ్యా .... ఎన్నికల రంగలో పోగైన కలుపు ను తీసేద్దాం ..రండయ్యా... ఒకప్పుడు నాయకుడంటే ప్రజల్లోంచి వచ్చేవాడు, ప్రజల కోసం బ్రతికే వాడు. ప్రజలకోసం ఆస్తులు ధారపోసేవాడు. కుటుంబ జీవితాన్ని లెక్క జేయక ప్రజల కోసం పోరాటం చేసేవాడు. ఇచ్చిన మాటకోసం సమాజ సేవ కోసం నిరంతరం తపన పడేవాడు. ఎన్నికలొస్తే అయ్యా మీరే నిలబడండి మీమంతా మీపక్షమే నని జనాలు నాయకులకు చెప్పేవారు. నిజాయితీగా నాయకులు పదవులకు ఎన్నిక అయ్యేవారు.