Posts

Showing posts from November, 2023

80. (SOCIAL--53) దేశంలో ప్రజా సేవ ఇంత Costly నా? ఎవ్వరికీ బాధ్యతలు లేవా?

Image
                                    ఈ దేశంలో ప్రజాసేవ                                     ఇంత costly అయిందా?                                     వింటున్నాం                                      నియోజకవర్గంలో                                      ఒక అభ్యర్థికి 400-500 కోట్లు ఖర్చు,                                     అవతల వారూ అంతే..                                     నేనేమీ తీసిపోలేదంటూ..                                     అంతసొమ్ము ఇద్దరూ కలిసి                                     నియోజక వర్గ సమస్యలపై                                     ఖర్చు పెడితే                                     బతికినంతకాలం                                     జనం మిమ్ములను                                     వారి వారి హృదయాలలో                                      దాచుకుంటారు కదా!                                      మిమ్ముల పూజిస్తారు కదా!                                      డబ్బు ఖర్చుపెట్ట దలచుకుంటే                                      పై మార్గంలో వెళ్ళండి.                            

79. (social..52). మీరు నమ్ముతారా. ఎన్నికలు అంటే అలావుండాలి

Image
                                                    ఎన్నికలు .. సంస్కరణలు అంటే  నాకు  మా ప్రక్కగ్రామం అయిన బొదులబండకు చెందిన కీ.శే. శ్రీ పొట్టి పింజర హుసేనయ్య  జ్ఞాపకం వస్తాడు  1978 లో  ఆయన  పాలేరు నియోజక వర్గానికి ఏం. యల్. ఏ.గా గెలిచాడు   ఆ కాలంలో  ఆయన ప్రచారంలో  హంగు ఆర్భాటాలు లేవు.  మైకుల హోరులు, వాహనాల రొదలు అసలే లేవు.  ఊరేగింపులు, గడప గడపకు ప్రచారాలు లేవు.  ఒకటో, రెండో సమావేశాలు జరిగాయోమో  నాకైతే గుర్తు లేదు. మీరు నమ్ముతారా? పోలింగ్ జరిగేటప్పుడు పోలింగ్ స్టేషన్ లో  ఏజెంట్లు కూడా లేరు. పార్టీ గుర్తు చెప్పేవాళ్ళు అసలే లేరు.  సామాన్య జనంలో ఇందిరమ్మపై  అభిమానం ఉప్పెనలా ఉప్పొంగింది.  హుసేనయ్యను ఏం.ఎల్.ఏ గా గెలిపించింది. అంతకు ముందు మూడు పర్యాయాలు  ఏం. ఎల్. ఏ గా వున్న వ్యక్తిని ఓడగొట్టారు. అధికార పార్టీ అయిన కాంగ్రెసును  కాంగ్రెసు వాదులే ఓడించారు       ఇందిరమ్మ కాంగ్రెసును గెలిపించారు  అదే ఇప్పుడు మిగిలింది  జన బలం అది. జన శక్తి అలాంటిది. అలా వుంటే అందరూ బాగుంటారు  ఎన్నికల్లో ఓడినా  ఎవ్వరికీ గుండెపోటు రాదు. అందరి ఆస్తులకు రక్షణ లభిస్తుంది  ----పెండ్యాల వాసుదేవ రావు.       తేదీ: 05.11.20

78. (social...51). ఎవవరెవరో ఎక్కడినుండో వస్తారు..... ఆలోచించండి ప్రజలారా...

Image
ఆలోచించండి.  ఎన్నికల సందడి మొదలు కాగానే ఎవ్వరెవ్వరో వస్తారు ఎక్కడెక్కడి నుండో వస్తారు చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు,  దూరిపోతారు  తెగ హడావుడి చేస్తారు దండలు/ఓ ట్లు వేయించుకుంటారు కుర్చీలో/పదవిలో కూర్చుంటారు ఆ తరువాత ఏమీ పట్టించుకోరు ఏటో వెళ్ళిపోతారు ధన సంపాదనలో మునిగి పోతారు సమస్యలన్నీ పేరుకు పోతాయి సమాజం లో చీకట్లు ముసురుతాయి …. ఎన్నికల్లో  ఎప్పుడూ తక్కువ బడ్డుకు ఓటేద్దాం అనే  భావానికి అలవాటు పడ్డారు జనం ఆ ప్రభుత్వం మీద కోపం వుంటే   దాని ప్రత్యర్థి పార్టీకి, ప్రత్యర్థి పార్టీకి అధికారం వచ్చి దీనిపై కోపం వస్తే మాజీ అధికార పార్టీకి ఓటు వేయడం తప్ప గత్యంతరం లేని స్థితి ప్రత్యామ్నాయం లేని దుస్థితి… ఏదీ, ఏమీ ఆలోచించలేని సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఒకవైపు….. స్వలాభాలకోసం కార్యకర్తల ప్రయోజనాలు తాకట్టు పెట్టి అభ్యర్దుల నిర్ణయాలతో రాజకీయ పార్టీలు మరోవైపు….. ఈ పార్టీల వ్యవస్థ అవస్థల పాలు చేస్తోంది.. ఎన్నికల సంస్కరణల కొరడా పైకెత్తి యువతరం కార్య రంగంలోకి దిగవలసిన సమయం వచ్చింది, దొంగలు, దొంగలు వూళ్ళు పంచుకున్నట్లు గెలిచిన ప్రజాప్ర