51. (ఖమ్మం చరిత్ర-3) నిజాం వ్యతిరేక పోరాటం తరువాత ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్ర?
నిజాం వ్యతిరేక పోరాటం తరువాత ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్ర. ప్రతీ తరానికి, వెనుక తరం చరిత్ర తెలుసుకోవాలని కుతూహలము వుంటుంది. అందులోను ప్రభుత్వాలు మన పిల్లలకు చరిత్ర పాఠాల భోధనలను చాలా వరకు చదువులో భాగంగా పెట్టారు. రాయని చరిత్ర గురించి కుతూహలం ఇంకా అధికంగా వుంటుంది. మా ఖమ్మం చరిత్ర ఇంత వరకు అముద్రితం. రాయని చరిత్ర పై ఎన్నెన్నో ప్రశ్నలు. మాతరం అడగని ప్రశ్నలు. ఈ తరానికి తెలీని సమాధానాలు. 1952 సంవత్సరంలో వేమ్సూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు పై పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి ఇండిపెండెంట్ గా అసెంబ్లీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన శ్రీ జలగం వెంగళ రావును కాంగ్రెస్ పార్టీ ఆరు సంవత్సరాలు బహిష్కరించింది. ఆయన బహిష్కరణ సమయం పూర్తి కాకుండానే 1957 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆయన తమ్ముడు శ్రీ జలగం కొండలరావు కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసి ఎలా MLA అయ్యాడు? అసలు టికెట్ ఎలా వచ్చింది? అప్పటి వరకు శ్రీ జలగం వెంగళరావు జిల్లా నాయకత్వ హోదాలో లేడు. నిషేధ కాలం పూర్తి కాగానే ఖమ్మం DCC PRESIDENT ఎలా అయ్యాడు? తరువాత వెంటనే జిల్లా పరిషత్ PRESIDENT గా ఎలా ఎ...