"Deep analysis of global power shifts, Sovereign AI, and minority rights. Liberty bridges the gap between complex geopolitics and the common man." It is the Voice of the People & Music of the Nature.
Friday, December 15, 2023
ఔనా? నిజమేనా?
Tuesday, November 28, 2023
దేశంలో ప్రజా సేవ ఇంత Costly నా? ఎవ్వరికీ బాధ్యతలు లేవా?
దేశంలో ప్రజాసేవ
ఇంత costly అయిందా?
Sunday, November 5, 2023
మీరు నమ్ముతారా. ఎన్నికలు అంటే అలావుండాలి
79. (social..52).
మీరు నమ్ముతారా?
ఎన్నికలు అంటే అలావుండాలి
ఎన్నికలు .. సంస్కరణలు అంటే నాకు
మా ప్రక్కగ్రామం అయిన బొదులబండకు చెందిన
కీ.శే. శ్రీ పొట్టి పింజర హుసేనయ్య జ్ఞాపకం వస్తాడు
1978 లో
ఆయన
పాలేరు నియోజక వర్గానికి ఏం. యల్. ఏ.గా గెలిచాడు
ఆ కాలంలో
ఆయన ప్రచారంలో
హంగు ఆర్భాటాలు లేవు.
మైకుల హోరులు, వాహనాల రొదలు అసలే లేవు.
ఊరేగింపులు, గడప గడపకు ప్రచారాలు లేవు.
ఒకటో, రెండో సమావేశాలు జరిగాయోమో
నాకైతే గుర్తు లేదు.
మీరు నమ్ముతారా?
పోలింగ్ జరిగేటప్పుడు పోలింగ్ స్టేషన్ లో
ఏజెంట్లు కూడా లేరు.
పార్టీ గుర్తు చెప్పేవాళ్ళు అసలే లేరు.
సామాన్య జనంలో ఇందిరమ్మపై
అభిమానం ఉప్పెనలా ఉప్పొంగింది.
హుసేనయ్యను ఏం.ఎల్.ఏ గా గెలిపించింది.
అంతకు ముందు మూడు పర్యాయాలు
ఏం. ఎల్. ఏ గా వున్న వ్యక్తిని ఓడగొట్టారు.
అధికార పార్టీ అయిన కాంగ్రెసును
కాంగ్రెసు వాదులే ఓడించారు
ఇందిరమ్మ కాంగ్రెసును గెలిపించారు
అదే ఇప్పుడు మిగిలింది
జన బలం అది.
జన శక్తి అలాంటిది.
అలా వుంటే అందరూ బాగుంటారు
ఎన్నికల్లో ఓడినా
ఎవ్వరికీ గుండెపోటు రాదు.
అందరి ఆస్తులకు రక్షణ లభిస్తుంది
----పెండ్యాల వాసుదేవ రావు. తేదీ: 05.11.2023
<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>
Friday, November 3, 2023
ఎవవరెవరో ఎక్కడినుండో వస్తారు .....ఆలోచించండి ప్రజలారా...
78. (social...51).
ఎవవరెవరో ఎక్కడినుండో వస్తారు ఆలోచించండి ప్రజలారా...
ఎన్నికల సందడి మొదలు కాగానే
ఎవ్వరెవ్వరో వస్తారు
ఎక్కడెక్కడి నుండో వస్తారు
చీమలు పెట్టిన పుట్టలో
పాములు దూరినట్లు,
దూరిపోతారు
తెగ హడావుడి చేస్తారు
దండలు/ఓ ట్లు వేయించుకుంటారు
కుర్చీలో/పదవిలో కూర్చుంటారు
ఆ తరువాత ఏమీ పట్టించుకోరు
ఏటో వెళ్ళిపోతారు
ధన సంపాదనలో మునిగి పోతారు
సమస్యలన్నీ పేరుకు పోతాయి
సమాజం లో చీకట్లు ముసురుతాయి ….
ఎన్నికల్లో
ఎప్పుడూ
తక్కువ బడ్డుకు ఓటేద్దాం
అనే
భావానికి అలవాటు పడ్డారు జనం
ఆ ప్రభుత్వం మీద కోపం వుంటే
దాని ప్రత్యర్థి పార్టీకి,
ప్రత్యర్థి పార్టీకి అధికారం వచ్చి
దీనిపై కోపం వస్తే మాజీ అధికార పార్టీకి
ఓటు వేయడం తప్ప
గత్యంతరం లేని స్థితి
ప్రత్యామ్నాయం లేని దుస్థితి…
ఏదీ, ఏమీ ఆలోచించలేని
సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఒకవైపు…..
స్వలాభాలకోసం కార్యకర్తల
ప్రయోజనాలు తాకట్టు పెట్టి
అభ్యర్దుల నిర్ణయాలతో
రాజకీయ పార్టీలు మరోవైపు…..
ఈ పార్టీల వ్యవస్థ అవస్థల పాలు చేస్తోంది..
ఎన్నికల సంస్కరణల కొరడా పైకెత్తి
యువతరం కార్య రంగంలోకి దిగవలసిన
సమయం వచ్చింది,
దొంగలు, దొంగలు వూళ్ళు పంచుకున్నట్లు
గెలిచిన ప్రజాప్రతినిధులు
వాళ్ళ జీతాలు, వాళ్ళ పెన్షన్లు
వాళ్ళే పెంచుకుంటారు..
ప్రజాసేవకులకు జీతాలేమిటి,
జీవితాంతం పెన్షన్లేమిటి?
ప్రభుత్వం సొమ్ము
దోచుకుంటున్నా మాట్లాడని వైనం
బానిస బతుకుల వారసత్వం కాదా ?
గెలిచిన వాళ్ళు సక్రమంగా
సమస్యలకు స్పందించకుంటే
నిలదీసే వాళ్ళు లేరు
రికాల్ హక్కులేదు,
ఈ మాత్రం దానికి
ఇన్ని వేల మంది బలిదానాలు
కావలసి వచ్చాయా?
బానిస సంకెళ్లు తెంచుకొన్నది
రెండు, మూడు కుటుంబాలు
మన నెత్తిన కూర్చుని
రాజభోగాలు అనుభవించటానికా?
ప్రజాస్వామ్యానికి పట్టిన దుస్స్థితికి
మందేమిటి?
ఈ సమస్యల పరిష్కారానికి
ఆపరేషన్ మాత్రమే పరిష్కారమా?
ఎవ్వరెవ్వరో వస్తారు
ఎక్కడెక్కడి నుండో వస్తారు
చీమలు పెట్టిన పుట్టలో
పాములు దూరినట్లు,
దూరిపోతారు
మాయ మాటలు చెబుతారు.
ఓటేయించు కుంటారు..
పదవి రాగానే వెళ్ళిపోతారు..
కాంట్రాక్టులుకు అమ్ముడు పోతారు.
మనం ఎవ్వరికీ వ్యతిరేకంగా వీళ్ళకు ఓటేశామో
వాళ్ళ పార్టీ లోకే దూకేస్తారు
ఓటర్లు పిచ్చోళ్లలా మారిపోతారు.
వీళ్లనుంచి
అయ్యేది లేదు,
జనానికి ఒరిగేది లేదు.
ఆలోచించండి…ప్రజలారా!
----పెండ్యాల వాసుదేవ రావు. 04.11.2023READ THIS BLOG POST ALSO
READ THE BLOG POST HERE
<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>
Tuesday, October 31, 2023
ప్రజాస్వామ్యం.....ఎన్నికలు.
77. (social..50).
ప్రజాస్వామ్యం.....ఎన్నికలు.
ప్రజాస్వామ్యం
నన్ను తట్టి నిద్ర లేపింది.
నిద్రమత్తు వదిలింది.
అంటోంది
ఎలక్షన్లు దండగ,
కావొచ్చు ప్రజలకు పండగ...,
కానీ నిజానికి
అది పండగ కాదని,
ఓటును రెండు/మూడు వేల రూపాయలుకు అమ్మటం,
1825 రోజులకు(అయిదు సం.లు పదవీకాలం)
రోజుకు రూపాయి చిల్లరకు
జీవితాన్ని
తాకట్టు పెట్టటమే అవుతుంది కదా అంటున్నట్లు వినబడింది.
నిజమేనండీ...
రోజు కూలి Rs 500/- చొప్పున 1825 x 500=
Rs 9,25,000/-
ఇస్తే బాగుంటది ..
ఎక్కడిదో ఓ సన్నని కంఠం
ఫుట్ పాత్ పై మందు మత్తులో జోగుతూ
పడి వున్న బక్క పలుచని శరీరం తాలూకు ధ్వని
వినిపించింది,
ఆ మాటకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదు.
ప్రజాస్వామ్య మేమో
నన్ను నిలదీస్తోంది,
వివరాలు అడుగుతోంది
ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లలో
రోడ్లమీద తిరుగుతున్న
వందల కార్ల పరుగులేమిటి?,
ఆ కార్లల్లో దాగున్న
డబ్బు మూటల మూలుగుల ధ్వనులు
దేనికి సంకేతమని?,
అధికారులు నిద్రమత్తులో,
వున్నారా?
చర్యలు తీసుకునే
బాధ్యత లేదా అని,
ఇంకా ప్రశ్నిస్తోంది
ఈ డబ్బులన్నీ ఎక్కడివి?
ఎవ్వరు యే వ్యాపారాలు
చేస్తున్నారని?,
ఆ వ్యాపారాలకు సంబంధించి
సంబంధిత వ్యక్తులు/అభ్యర్థులు ప్రభుత్వానికి చెల్లించిన
పన్ను వివరాలు
సమాజానికి చెప్పవద్దా?అని,
శేషన్ వస్తే తప్ప
ఫలితం వుండదా?
శేషన్ వారసత్వం
అందుకున్న అధికారులు కనుమరుగు అయినారా అని?,
ఆ దిక్కు చూపుతోంది.....
దూరంగా ఆ అడవిలో
ఏవో, ఏవేవో గర్జనలు.
గుర్తించమంటోంది.
హెచ్చరిస్తోంది
జాగ్రత్తపడండని
అవి తుపాకుల మోతల్లా వున్నాయేమోనని...
తన బాధ వెల్లడించింది
తన అస్థిత్వం కూడా కనుమరుగయ్యే ప్రమాదం ముంచుకొస్తున్న
తరుణం ఆసన్నం
అయినదని..
Saturday, October 28, 2023
రాజకీయ రంగం సమస్తం కుళ్ళి కంపు కొడుతోన్న వైనం.
రాజకీయ రంగం సమస్తం కుళ్ళి కంపు కొడుతోన్న వైనం.
రాజకీయ రంగం సమస్తం కుళ్ళి కంపు కొడుతోన్న వైనం.
బీ.ఆర్.ఎస్ పార్టీలో టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలోకి ..
కాంగ్రెస్ పార్టీ లో టికెట్ దొరకలేదని బీ.ఆర్.ఎస్/బీ.జె.పీ.లోకి ....
పిల్లనిచ్చి/టికెట్ ఇచ్చి పెళ్లి చేసినా/గెలిపించినా
తాళి కట్టిన మరుక్షణమే, కాళ్ళ పారాణి ఆరకుండానే
వేరే వాళ్ళతో లేచి పోడనే గ్యారంటీ ఏమిటీ?
కళ్ళముందు కనిపిస్తున్నదే కదా!
సర్వేలమీద సర్వేలు చేసి
గెలుపు గుర్రాల పసిగట్టి వాటేసుకొనే వారు కొందరు..
గెలిపించిన కార్యకర్తలను, పార్టీని నట్టేట ముంచి
డబ్బు కోసం /కాం ట్రాక్టుల కోసం
గడ్డితినే వారు ఇంకొకరు...
చాలా భలేగుంది మీ రాజకీయం...
పార్టీ సభ్యత్వం లేకుండా శతాబ్దాల/దశాబ్దాల పార్టీలోకి
లేచిపోయి వచ్చినోళ్ళకి కుర్చీ లిస్తే
వాళ్ళనే అందలమెక్కిస్తే
ఇంతకాలం పల్లకీ మోసిన, చమటోడ్చిన,
త్యాగాలతో బతుకీడ్చిన
కార్యకర్తలకు ఎవ్వరు భరోసా?
టికెట్ కోసం వచ్చిన అవతలోడికి
నీ సిద్దాంతాలతో పనిలేదు
నీ నాయకులపై గౌరవం వుండదు
నిన్నటి వరకు నిన్ను బూతులు తిట్టినోడు
ఈరోజు నీకు ఎలా ముద్దు అయినాడు?
తప్పదు. మీకు బుద్ది చెప్పాలి .
వెట్టి చాకిరీని ఎప్పుడో నిషేధించాము కదా
కార్యకర్తల వెట్టి చాకిరీకి ముగింపు పలకాలి.
కార్యకర్తల వదిలేసి కాంగ్రెసు నాయకత్వం ..
ఉద్యమకారుల వదిలేసి అధికార పార్టీ నాయకత్వం ..
యేరు దాటాక తెప్ప తగలేసినట్లుంది.
ఇలా ఎంతకాలం?
ఓటుతో ఈ మురికి పార్టీల ఉతికీయాలి.
యువతరం భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలి.
-----PENDYALA VASUDEVA RAO
<!-- Google tag (gtag.js) -->
<script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>
Saturday, September 30, 2023
పాలేరు అసెంబ్లీ నియోజక వర్గం...నియోజకవర్గాల పునర్విభజన...రాజకీయాలు.
75. (social 48).
పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం...
నియోజకవర్గాలపునర్విభజన... రాజకీయాలు.
ప్రధమంగా జరిగిన నియోజకవర్గాల పునర్విభజన 1962.
1962 సం. లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి విడదీసిన ప్రాంతాన్ని పాలేరు అసెంబ్లీ నియోజక వర్గంగా ఏర్పాటు చేశారు. అప్పుడు ఖమ్మం జిల్లా కాంగ్రెసు వర్గరాజకీయాల ఫలితంగా నిబంధనలకు భిన్నంగా వేంసూరు అసెంబ్లీ నియోజక వర్గానికి బదులుగా వాళ్ళ స్వలాభం కోసం పాలేరును ఎస్. సీ నియోజకవర్గంగా మార్చారు. అప్పటికింకా సర్వశ్రీ జలగం వెంగళరావు మరియు శీలం సిద్దారెడ్డిలు ఇరువురు జిల్లా నాయకత్వ హోదాలో లేరు.
అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ "రావు మరియు రెడ్డి "వర్గాలుగా చీలిపోయి వుంది. జిల్లాలో రావు వర్గముదే పైచేయిగా వుండేది. ఖమ్మం జిల్లాకు పార్టీలో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు ప్రాబల్యం ఎక్కువ.
వేంసూరు అసెంబ్లీ సీటు అప్పటి జిల్లా కాంగ్రెసు ముఖ్య నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణ రావుకు అవుసరం. ఖమ్మం అసెంబ్లీ రాజకీయాలలో పట్టువున్న వ్యక్తి శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు. నియోజకవర్గ రాజకీయాలలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావును తప్పించి జిల్లాలో ఆయన ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయటం లక్ష్యంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు ఉపయోగించుకున్నారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని "ఎస్. సీ" కి కేటాయించటంలో తన పలుకుబడిని ఉపయోగించారు.
ఆ సమయంలో, పంచాయతీ సమితులు ఏర్పడనప్పుడు, పాలేరు బ్లాక్ కు బీ. డీ. ఓ (బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్) అధ్యక్షునిగా, శ్రీ పెండ్యాల ఉపాధ్యక్షుడుగా సేవలను అందించారు. పాలేరు ప్రాంత అభివృద్దిలో పెండ్యాల సత్యనారాయణరావు పాత్ర మారువలేనిది.
1957 సం.లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా శ్రీమతి తే ళ్ళ లక్ష్మీకాంతమ్మ గారిని అభ్యర్ధిగా నిర్ణయించటంలో గానీ, గెలిపించటంలో గానీ శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ప్రతిభకు ఉలిక్కిపడిన అప్పటి కాంగ్రెసు జిల్లా నాయకత్వం ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి కొంత ప్రాంతాన్ని విడగొట్టి పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం అని నామకరణం చేసి షెడ్యూల్ కులాల (ఎస్. సీ) నియోజకవర్గంగా మార్చేశారు. ఆ సమయంలోనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కావటం వారికి వరంగా మారింది.
ఈ రాజకీయచర్యల పర్యవసానమే జిల్లా రాజకీయ పునరేకీకరణకై శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు శ్రీకారం చుట్టారు. ఫలితంగా కొత్తతరం రాజకీయ అరంగ్రేటం సర్వశ్రీ జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి రూపంలో అవతరించటానికి కారణం అయింది. నైజాంపోరాట సమయంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు వరంగల్లు జిల్లా నాయకత్వంలో కీలక భూమికను పోషించటం, తద్వారా ఏర్పడిన పరిచయాలు ఈ రాజకీయ పునరేకీకరణలో విజయం సాధించటానికి దోహదపడింది.
ద్వితీయ నియోజక వర్గాల పునర్విభజన. 2004.
శ్రీమతి రేణుకా చౌదరి ఖమ్మం లోకసభా అభ్యర్ధిగా రంగప్రవేశం చేశాక శ్రీ వనమా వేంకటేశ్వరరావు ప్రెసిడెంటుగా ఏర్పడ్డ ఖమ్మం జిల్లా కాంగ్రెసు కమిటీకి నేను దశాబ్దం పైగా కార్యదర్శి బాధ్యతలు నిర్వహించటం జరిగింది. ఆ సమయంలోనే అసెంబ్లీ, లోకసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం అయింది. ఎలెక్షన్ కమీషను ప్రతిపాదనల ప్రకారం ఖమ్మం లోకసభ, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాలు షెడ్యూల్ తెగలకు (ఎస్. టీ) రిజర్వు చేయటంతో రాష్ట్ర కాంగ్రెసు పార్టీ జిల్లా డీలిమిటేషన్ కమిటీని ఏర్పాటు చేసినది. ఖమ్మం జిల్లా డీలిమిటేషన్ కమిటీకి చైర్మనుగా నన్ను నియమించారు. అందులో సర్వశ్రీ అయితం సత్యం, చింతనిప్పు లాలయ్య, కోట గురుమూర్తి, కొత్తా సీతారాములు సభ్యులుగా నియమించబడ్డారు. జిల్లాలోని పది అసెంబ్లీ, లోకసభా నియోజకవర్గాల పునర్విభజనా ప్రతిపాదనల తయారీ బాధ్యత నా భుజస్కందయాలపై పడింది. ఈ కమిటీకి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెసు సీనియర్ నాయకులు శ్రీ గాదె వెంకటరెడ్డి చైర్మనుగా వుండేవారు. జిల్లాలోని అన్నీవర్గాలతో, రాజకీయపార్టీలతో సుధీర్గ సంప్రదింపుల తరువాత, మూడు సంవత్సరాల నిరంతర కృషితో మూడు ప్రతిపాదనలను తయారు చేశాను. జాతీయ స్థాయిలో డీలిమిటేషన్ కమిటీ అధికారిక చైర్మనుగా వున్న రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జీ శ్రీ కులధీప్ సింగ్ గారితో డిల్లీలో రెండు సార్లు సమావేశమై నా ప్రపోజల్స్ ను వివరించి పరిశీలించేలా చేయగలిగాను. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో (అసెంబ్లీ మరియు లోకసభ) నేను చేసిన ప్రతిపాదనలే చివరకు ఆమోదించబడ్డాయి.
పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం పేరును నేలకొండపల్లి అసెంబ్లీ నియోజకవర్గంగా చేసిన మార్పు ప్రతిపాదన మాత్రం కొందరి అభ్యంతరంతో సఫలం కాలేదు. ఈ ప్రయత్నంలో నా విజయం ఏమిటంటే పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని జనరలు (ఓ. సీ) సీటుగా మార్చే ప్రక్రియలో సఫలీకృతుడిని అయ్యాను. గతంలో 1962 లో నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన తప్పును దశాబ్దాల తరువాత సరిదిద్దే అవకాశం నాకు దక్కింది.
జిల్లా కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వున్న వనమా వేంకటేశ్వరరావు డీలిమిటేషన్ ప్రక్రియ అయిపోయేటంత వరకు ఆయన నన్ను నిద్ర పోనివ్వకుండా, డిల్లీ వెళ్ళినా నన్ను తన వెంటనే తీసుకు వెళ్ళేవారు. అక్కడ తరచుగా డీలిమిటేషన్ కమిటీ అధికారిక సభ్యులైన సర్వశ్రీ గాదె వెంకటరెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు మండలి బుద్దప్రసాదులతో సమావేశం అయ్యేవాళ్ళం. ఒకసారి గాదె వెంకటరెడ్డి గారు వనమా గారితో "వనమా! వాసుదేవరావు గారు లేకుంటే నువ్వు దిల్లీకి రావా? అని అడిగారు. శ్రీ వనమాకు కంగారు ఎక్కువ. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం తిరిగి ఓ.సీ కాకపోతే ఆయన తట్టుకోవటం కష్టమని భయపడ్డాము. దాంతో నేను ప్రొఫెషన్ కు ఎక్కువ డుమ్మా కొట్టవలసి వచ్చింది. ఎక్కువ సమయం ఈ వ్యవహారానికే వెచ్చించ వలసి వచ్చింది.
జిల్లాలో డీలిమిటేషన్ సమయంలో, సత్తుపల్లి అసెంబ్లీనియోజకవర్గం జనరలు స్థానంగా వుంచటమే ధ్యేయంగా సత్తుపల్లి సిట్టింగ్ ఏం. ఎల్. ఏ, శ్రీ జలగం వెంకటరావు కూడా డీలిమిటేషన్ ఫలితం అనుకూలంగా సాధించటానికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో నాయకుల కలుస్తూ చురుకుగా వ్యవహరించారు. డీలిమిటేషన్ ప్రక్రియ పర్యవసానంగా జిల్లాలో ముఖ్యనాయకుల రాజకీయ భవితవ్యం కొత్త పుంతలు తొక్కింది. స్థానచలనాలు జరిగి వారి రాజకీయజీవితాలపై ప్రభావాన్ని చూపాయి.
క్రింది చిత్రాలలో మొదటిది ఖమ్మం లో.. నెహ్రూ యువక కేంద్రంలో యువజన దినోత్సవ సమావేశములో శ్రీమతి రేణుకా చౌదరి గారితో. చిత్రంలో నెహ్రూ యువక కేంద్రం కో .. ఆర్డీనేటరు శ్రీ పీ. వైద్యనాధం మరియు ఆఫీసు సిబ్బందిని చూడవచ్చు.
రెండవ చిత్రం శ్రీమతి రేణుకాచౌదరి, వనమా వేంకటేశ్వరరావు, చింతనిప్పు లాలయ్య తదితరులతో నేలకొండపల్లిలో ... శ్రీ భక్త రామదాసు మందిరములో.
----పెండ్యాల వాసుదేవరావు.
<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>
<
Wednesday, July 12, 2023
విలీనామా? విమోచనా? విద్రోహమా?.. ఈ సందిగ్ధత ఎందుకొచ్చింది?
74. (Social..47).
విలీనామా? విమోచనా? విద్రోహమా?..
ఈ సందిగ్ధత ఎందుకొచ్చింది?
వందల సంవత్సరాల బానిసత్వం నుండి, ఎన్నోవేల జనాల బలిదానాల ఫలితంగా వచ్చిన హైదరాబాద్ రాష్ట్రఅవతరణ తేదీని ఉత్సవంగా జరుపుకొనే రాత/అదృష్టం తెలంగాణ ప్రజలకు లేకుండా పోయింది.
1). ప్రమాణ స్వీకారం నిజాం రాజు చేతుల మీదుగా..
ఏ నిజాంరాజుకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటంచేశారో, ఆ నిజాంరాజు "ది గ్రేట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ ఆఫ్ దక్కన్" మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ చేతుల మీదుగా నూతనంగా ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయవలసిన దుస్థితి రావటం నా మనసును కలచి వేసింధి.
"మా నైజాం రాజు తరతరాల బూజు" అన్న స్వాతంత్ర సమర యోధులే ఆ రోజు నిజాం ముందు నిలుచుని అభినందించవలసిన స్థితి. ఇండియా ప్రభుత్వం హైదరాబాద్ దక్కన్ పై చేపట్టిన "ఆపరేషన్ పోలో " విజయవంతం అయి మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ లొంగిపోయినా ఆయనని పజల అభీష్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్ర "రాజ్య ప్రముక్ః " గా ఎందుకు ప్రకటించవలసి వచ్చిందో ఆనాటి సర్దార్ వల్లభాయి పటేల్ మరియు జవహర్లాల్ నెహ్రూలకే ఎరుక.
ఆనాడు ఇండియాలో విలీనమైన వందల సంస్థానాలలో దేనికీ ఇవ్వని ప్రత్యేకత ఈ సంస్థానంలోనే ఎందుకు? విలీనానికి ఆయనేమీ ఇండియాతో పోరాటం చేయలేదే! పోరాటము చేసి సంధి కుదుర్చుకోలేదే! రాజీపత్రాలు వ్రాసుకోలేదే! హైదరాబాద్ సంస్థాన పొలిమేరలలోకి భారతసైన్య ప్రవేశంతోనే, అందుకే ఎదురు చూస్తున్నట్లు వెంటనే లొంగిపోయి వంగి, వొంగి దండాలు పెడుతూ లొంగి పోయాడే ! మరెమిటి రాజకీయం?
అందుకేనేమో ఆనాటి ఆస్థితిని, ఇండియాలో విలీనమైన హైదరాబాద్ దక్కన్ రాజ్యంపై ఆనాటి తెలంగాణ నాయకులు జీర్ణించుకోలేక పలువురు పలురకాలుగా వ్యాఖ్యానించారు. ఆ నాటి రాష్ట్ర పరిస్థితిని హైదరాబాద్/తెలంగాణ రాష్ట్రవిమోచమని కొందరు, రాష్ట్రవిలీనమని మరికొందరు హైదరాబాద్ రాష్ట్రవిద్రోహ దినమని ఎందరో! అందుకే నైజామురాజు భారతసైన్యానికి లొంగి పోయిన రోజును ప్రజలకు స్వేచ్చ లభించిన ఉత్సవంగా జరుపుకునే యోగం లేకపోయింది.
పైది జరిగినదే అంతా విచిత్ర అనుకుంటే ….
2). విచిత్రం గమనించండి ..
ప్రపంచంలోనే అత్యంత గొప్పగా చెప్పుకొనే "తెలంగాణా సాయుధ పోరాటం" గురించి అది ముగిసిన రెండు దశాబ్దాలకు గానీ కమ్మునిస్టులే వ్రాయలేదు. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య తనకే ఆ విషయా గురించ పూర్తి సమాచారం లేదని సెలవిచ్చారు.
3). ఇంకో విచిత్రమండీ..
వేలమంది తెలంగాణా ప్రజల/యువకుల బలిదానాలతో, ప్రత్యేక బంగారు తెలంగాణా రాష్ట్రంలో ప్రప్రధమ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక, ఆసెంబ్లీ సాక్షిగా తన పూర్వీకులకు నైజాం రాజు ఎంతో మేలు చేశాడని కీర్తించటం, ఆ నిజాం ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడటం చూసి యావత్తు తెలంగాణ విస్తుపోయింది.....
వేలమంది ఆత్మార్పణం తరువాత ఏర్పడ్డ (ఇండియాలో విలీనం తరువాత) హైదరాబాద్/తెలంగాణ రాష్ర ఆవిర్భావ ముహూర్తాన ఉన్నత స్థానంలో కనిపించిన శ్రీ శ్రీ శ్రీ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ .. ఆతరువాత వందల మంది యువకుల ఆత్మ బలిదానాల ఫలితంగా ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఊపిరి పోసుకున్నాడు.ఇంతకంటే అదృష్టం మరెవ్వరికి కుంటుంది ?
మీ పెండ్యాల వాసుదేవరావు.
READ MORE ON MY BLOG POST HERE
<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>
Sunday, March 5, 2023
మా నేలకొండపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం.
శ్రీ వేంకటేశ్వర స్వామీ దేవాలయ చరిత్ర.
క్రింది ఫోటో దేవాలయ ప్రవేశం తరువాత దేవాలయ ప్రాంగణం.
నా సాహిత్య జ్ఞాపకాలు.
నా సాహిత్య జ్ఞాపకాలు.
72. (NKP..15). ).
సాహిత్య జ్ఞాపకాలు.
ఏవేవో జ్ఞాపకాలు.
అవన్నీ నా సాహిత్య ప్రపంచానికి సంబంధించినవి.
ఎప్పుడు భావావేశం వస్తే అప్పుడే...
ఎక్కడవుంటే అక్కడే ...వెంటనే వచన కవితలు వ్రాసే వాడిని. వ్రాసిన తేదీ, సమయం కూడా అందులో వ్రాసేవాడిని.
అప్పుడు నా వయస్సు 17 సంవత్సరాలు.
అది 1972 వ సంవత్సరం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో "సిటీ కాలేజీ"లో బి.కాం చదువుతున్న రోజులు. ఒకరోజు ఏదో పనిబడి ప్రిన్సిపాల్ గారిని కలవటానికి వెళ్లి ఆయన రూమ్ ముందర ఉన్న బెంచీపై కూర్చున్నా. ఇంతలో ఒక భావావేశం వెన్ను తట్టింది. వెంటనే నా జేబులో ఉన్న పెన్ను వడివడిగా చేతులో ఉన్న నోట్ బుక్ లో ఉన్న తెల్ల కాగితం పైకి దూసుకెళ్లింది. భావం అక్షర రూపం దాల్చింది. దాని ఫలితమే.."నేను ఆశావాదిని...." అనే నా వచన కవిత.
కోటి ఆశలతో, రంగుల భవిష్యత్తు కలలతో వందల మైళ్ళ దూరంలో ఉన్న హైద్రాబాద్ మహానగరంలో అడుగిడిన ఆనంద క్షణాలు అవి. ఇంతలో ఒక విద్యార్థి వచ్చి నా ప్రక్కనే కూర్చుని నేను వ్రాసిన కవితను చదివి.." ఏమిటండీ మీ ఆనందం అంత ఉరక లేస్తోంది...ఈ సమాజాన్ని, ఈ పరిస్థితులను చూస్తుంటే మీకంత ఆశాజనకంగా కనిపిస్తోందా" అని చర్చ లేవదీశాడు. ఏవేవో చర్చించాము.
అతని పేరు శ్రీ ఎస్. వి. సత్యనారాయణ. మొన్నా మధ్య "తెలుగు విశ్వవిద్యాలం వైస్ ఛాన్సిలర్" గా వున్నాడు.
ఈ సంవత్సరం College మాగజైన్ కు కవిత ఎందుకు పంపకూడదు, పంపించండి అన్నాడు. పంపాను. సెలెక్ట్ అయింది.
ఆ కవిత వ్రాయటమూ ఓ అందమైన జ్ఞాపకం.
అది B. Com (తెలుగు) ఫస్ట్ ఇయర్ Econamics క్లాస్ రూమ్.మా లెక్చరర్ శ్రీ జయశంకర్(అటుతరువాత "ప్రొఫెసర్ జయశంకర్ సారు" గా సూపరిచితులు) ఒక ప్రక్క పాఠం చెబుతుండగానే నా చేతిలో ఉన్న పెన్ను ఎదురుగా బల్లపై వున్న నోటు పుస్తకములోని తెల్లకాగితంలో అక్షర ప్రవాహాన్ని పారించింది. ఒక ప్రక్కన జయశంకర్ గారిని గమనిస్తూ వచ్చిన భావావేశాన్ని అక్షరబద్దం చేయటంలో నిమగ్నమై ఉన్న నన్ను నా ప్రక్కనే ఉన్న నా సహవిద్యార్థి ఇంద్రారెడ్డి(అటు తరువాత "ఉమ్మడి AP హోమ్ మంత్రి" గా సుపరిచుతులు) మధ్య మధ్యలో మోచేత్తో నన్ను ఎలర్ట్ చేసేవాడు. అప్పుడు వ్రాసిన కవితే " బాపూ మరోసారి రావూ". ఇదే college మాగజైన్ కు పంపా. ఆ కవిత వ్రాయటానికి ఆ పీరియడ్ టైం పట్టింది. ఆ కవితను మాగజైన్ వ్యవహారాలు చూసే మా తెలుగు లెక్చరర్ శ్రీ రెడ్డి గారికి ఇచ్చాను. ఏమిటీ ఇది ఇంత పెద్దగా ఉంది. దీన్ని నువ్వే వ్రాశావా అని అడిగారు. "అమృతం కురిసిన రాత్రి" లో శ్రీ తిలక్ వ్రాసినంత పొడవుంది.
తరువాత మళ్లీ కలసిన శ్రీ ఎస్.వీ.ఎస్ సలహా మేరకు OU కాంపస్ లోని ఆర్ట్స్ కాలేజ్ లో యూనివర్సిటీ లెవల్లో జరిగే సెమినార్ కు మా "సిటీ కాలేజ్" ప్రతినిధిగా హాజరు ఐనాను. అదే నాజీవితాన్ని మలుపు తిప్పింది. ఎందరో పరిచయమయ్యారు. సర్వశ్రీ దువ్వూరి చక్రపాణి (IAS), CH. పాండురంగ మూర్తి(రిటైర్డ్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్, కపిల రామ్మోహన్ తదితరులు). వారి పరిచయం వల్లనే YMCA వక్తృత్వ సాహిత్య కళా సమితి కార్య క్రమాలలో చురుకుగా పాల్గొన్నాను.
Dr నాగినేని భాస్కర్ రావు పరిచయంతో "యువ భారతి" సాహిత్య కార్యక్రమాలలో లీనమయ్యే వాడిని. విశ్వనాథం గారితో పరిచయం ఎన్నో విషయాలను తెలుసుకోవటానికి దోహద పడింది.
"నేను ఆశావాదిని..."కవితను శ్రీ దాశరధి రంగాచార్యకు (ఆయన ఇంట్లో )చూపించాను. "సంతోష స్థంభాలు" అని నేను కవితలో వ్రాసిన పదం పై భాషా ప్రాతిపదికన అభ్యంతరం చెప్పారు. ఆశతో ఉండటం అవుసరమే..."అగ్గిలా" ఉండాలన్నారు.
అప్పటికప్పుడే..
"నేను అగ్గిని..
మండుతాను.. మండిస్తాను..
మండే మంటలతో వెలుగులు పండిస్తాను"...అని వ్రాశా..
<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>
Iran War 2026: Current Situation, Leadership Uncertainty, and Global Impact
Iran War 2026: Current Situation, Leadership Uncertainty, and Global Impact Analyze the current Iran war situation in 2026, incl...
-
58. (ఖమ్మం చరిత్ర-6) మా వరంగల్/ఖమ్మం జిల్లా లో ప్రధమ దశాబ్ధం ఎన్నికల రాజకీయం. అది 1949 సంవత్సరం నవంబెర్ 26 వ తేది, వరంగల్ పట్టణంలో అఖి...
-
59. (ఖమ్మం చరిత్ర-7) ఆనాటి మా ఖమ్మం .... ఒక కురుక్షేత్రం. ఖమ్మం జిల్లా ఎన్నికల చరిత్ర ప్రముఖం గా ఖమ్మం, వేమ్సూర్ మరియు మధిర అసెంబ్లీ ఎన...
-
41. (NKP-3). శ్రీ భక్త రామదాసు స్మారక మందిరం (ప్రస్తుత ద్యానమందిరం) విశేషాలు. నేలకొండపల్లి గ్రామం ఖమ్మం నుండి 23 కిలోమీటర...















