78. (social...51). ఎవవరెవరో ఎక్కడినుండో వస్తారు..... ఆలోచించండి ప్రజలారా...

ఆలోచించండి. 

ఎన్నికల సందడి మొదలు కాగానే

ఎవ్వరెవ్వరో వస్తారు

ఎక్కడెక్కడి నుండో వస్తారు

చీమలు పెట్టిన పుట్టలో

పాములు దూరినట్లు, 

దూరిపోతారు 

తెగ హడావుడి చేస్తారు


దండలు/ఓ ట్లు వేయించుకుంటారు

కుర్చీలో/పదవిలో కూర్చుంటారు

ఆ తరువాత ఏమీ పట్టించుకోరు

ఏటో వెళ్ళిపోతారు

ధన సంపాదనలో మునిగి పోతారు

సమస్యలన్నీ పేరుకు పోతాయి

సమాజం లో చీకట్లు ముసురుతాయి ….


ఎన్నికల్లో 

ఎప్పుడూ

తక్కువ బడ్డుకు ఓటేద్దాం

అనే 

భావానికి అలవాటు పడ్డారు జనం


ఆ ప్రభుత్వం మీద కోపం వుంటే  

దాని ప్రత్యర్థి పార్టీకి,

ప్రత్యర్థి పార్టీకి అధికారం వచ్చి

దీనిపై కోపం వస్తే మాజీ అధికార పార్టీకి

ఓటు వేయడం తప్ప

గత్యంతరం లేని స్థితి

ప్రత్యామ్నాయం లేని దుస్థితి…


ఏదీ, ఏమీ ఆలోచించలేని

సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఒకవైపు…..


స్వలాభాలకోసం కార్యకర్తల

ప్రయోజనాలు తాకట్టు పెట్టి

అభ్యర్దుల నిర్ణయాలతో

రాజకీయ పార్టీలు మరోవైపు…..


ఈ పార్టీల వ్యవస్థ అవస్థల పాలు చేస్తోంది..

ఎన్నికల సంస్కరణల కొరడా పైకెత్తి

యువతరం కార్య రంగంలోకి దిగవలసిన

సమయం వచ్చింది,


దొంగలు, దొంగలు వూళ్ళు పంచుకున్నట్లు

గెలిచిన ప్రజాప్రతినిధులు 

వాళ్ళ జీతాలు, వాళ్ళ పెన్షన్లు

వాళ్ళే పెంచుకుంటారు..

ప్రజాసేవకులకు జీతాలేమిటి,

జీవితాంతం పెన్షన్లేమిటి?

ప్రభుత్వం సొమ్ము 

దోచుకుంటున్నా మాట్లాడని వైనం

బానిస బతుకుల వారసత్వం కాదా ?


గెలిచిన వాళ్ళు సక్రమంగా 

సమస్యలకు స్పందించకుంటే

నిలదీసే వాళ్ళు లేరు

రికాల్ హక్కులేదు,


ఈ మాత్రం దానికి

ఇన్ని వేల మంది బలిదానాలు

కావలసి వచ్చాయా?

బానిస సంకెళ్లు తెంచుకొన్నది

రెండు, మూడు కుటుంబాలు

మన నెత్తిన కూర్చుని 

రాజభోగాలు అనుభవించటానికా? 


ప్రజాస్వామ్యానికి పట్టిన దుస్స్థితికి

మందేమిటి?

ఈ సమస్యల పరిష్కారానికి

ఆపరేషన్ మాత్రమే పరిష్కారమా?


ఎవ్వరెవ్వరో వస్తారు

ఎక్కడెక్కడి నుండో వస్తారు

చీమలు పెట్టిన పుట్టలో

పాములు దూరినట్లు, 

దూరిపోతారు 


మాయ మాటలు చెబుతారు.

ఓటేయించు కుంటారు..

పదవి రాగానే వెళ్ళిపోతారు..

కాంట్రాక్టులుకు అమ్ముడు పోతారు.

మనం ఎవ్వరికీ వ్యతిరేకంగా వీళ్ళకు ఓటేశామో

వాళ్ళ పార్టీ లోకే దూకేస్తారు

ఓటర్లు పిచ్చోళ్లలా మారిపోతారు.


వీళ్లనుంచి

అయ్యేది లేదు,

జనానికి ఒరిగేది లేదు.

ఆలోచించండి…ప్రజలారా!

                                                                            ----పెండ్యాల వాసుదేవ రావు.  04.11.2023

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Comments

Popular posts from this blog

82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

80. (SOCIAL--53) దేశంలో ప్రజా సేవ ఇంత Costly నా? ఎవ్వరికీ బాధ్యతలు లేవా?