77. (social..50). ప్రజాస్వామ్యం.....ఎన్నికలు.
ప్రజాస్వామ్యం.....ఎన్నికలు.
ప్రజాస్వామ్యం
నన్ను తట్టి నిద్ర లేపింది.
నిద్రమత్తు వదిలింది.
అంటోంది
ఎలక్షన్లు దండగ,
కావొచ్చు ప్రజలకు పండగ...,
కానీ నిజానికి
అది పండగ కాదని,
ఓటును రెండు/మూడు వేల రూపాయలుకు అమ్మటం,
1825 రోజులకు(అయిదు సం.లు పదవీకాలం)
రోజుకు రూపాయి చిల్లరకు
జీవితాన్ని
తాకట్టు పెట్టటమే అవుతుంది కదా అంటున్నట్లు వినబడింది.
నిజమేనండీ...
రోజు కూలి Rs 500/- చొప్పున 1825 x 500=
Rs 9,25,000/-
ఇస్తే బాగుంటది ..
ఎక్కడిదో ఓ సన్నని కంఠం
ఫుట్ పాత్ పై మందు మత్తులో జోగుతూ
పడి వున్న బక్క పలుచని శరీరం తాలూకు ధ్వని
వినిపించింది,
ఆ మాటకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదు.
ప్రజాస్వామ్య మేమో
నన్ను నిలదీస్తోంది,
వివరాలు అడుగుతోంది
ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లలో
రోడ్లమీద తిరుగుతున్న
వందల కార్ల పరుగులేమిటి?,
ఆ కార్లల్లో దాగున్న
డబ్బు మూటల మూలుగుల ధ్వనులు
దేనికి సంకేతమని?,
అధికారులు నిద్రమత్తులో,
వున్నారా?
చర్యలు తీసుకునే
బాధ్యత లేదా అని,
ఇంకా ప్రశ్నిస్తోంది
ఈ డబ్బులన్నీ ఎక్కడివి?
ఎవ్వరు యే వ్యాపారాలు
చేస్తున్నారని?,
ఆ వ్యాపారాలకు సంబంధించి
సంబంధిత వ్యక్తులు/అభ్యర్థులు ప్రభుత్వానికి చెల్లించిన
పన్ను వివరాలు
సమాజానికి చెప్పవద్దా?అని,
శేషన్ వస్తే తప్ప
ఫలితం వుండదా?
శేషన్ వారసత్వం
అందుకున్న అధికారులు కనుమరుగు అయినారా అని?,
ఆ దిక్కు చూపుతోంది.....
దూరంగా ఆ అడవిలో
ఏవో, ఏవేవో గర్జనలు.
గుర్తించమంటోంది.
హెచ్చరిస్తోంది
జాగ్రత్తపడండని
అవి తుపాకుల మోతల్లా వున్నాయేమోనని...
తన బాధ వెల్లడించింది
తన అస్థిత్వం కూడా కనుమరుగయ్యే ప్రమాదం ముంచుకొస్తున్న
తరుణం ఆసన్నం
అయినదని..
Comments