82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?
ఏవేవో కులాల కొట్లాటలు కనిపిస్తున్నాయి.
ఖమ్మం ఎన్నికల సమరాంగణములో
ఏవేవో రాజకీయ మంత్రాంగాలు నడుస్తున్నాయి.
ఖమ్మం ఆత్మాభిమానం ఎవ్వరికీ అక్కరలేదా ?.
ఆత్మాభిమానం మంటగలుస్తున్నా .
పౌరుషం ఆనవాళ్లు కనిపిస్తలే.
ఖమ్మం ఉద్యమాల గుమ్మం.
తెలుసా ఈ తరానికి?
చరిత్ర ఎవ్వరైనా చెప్పారా?
నాకు తెలిసి,
ఉద్యమాలలో
కీలక స్థానాల్లోవుండి
త్యాగాలు చేసిన వారికో,
వారి కుటుంబ సభ్యులకో...
పార్టీ లోనో, ప్రభుత్వ, రాజ్యాంగ స్థానాలలోనో
ఉద్యమకారులకు, వాటి బాధితులకు
అవకాశాలు ఇచ్చిన దాఖలాలు లేవు.
వాళ్ళ బలిదానాలతో, ఆత్మార్పణతో ఏర్పడ్డ రాష్ట్రంలో
మాది ఫక్తు రాజకీయ పార్టీ, ఇక్కడ మాకు
అధికారంలోకి రావటమే మాలక్ష్యం
ఉద్యమకారులతో, ఉద్యమంతో మాకు సంబంధం లేదు
అని ప్రకటించడానికి ఉద్యమనాయకులకు న్యాయమా?
అలా అన్నందుకు సిగ్గుపడాలి కదా!
నైజాంపై పోరాటం సమయంలో,
1968 తెలంగాణా ఉద్యమ సమయంలో,
2000 సం.లో తర్వాత
ప్రత్యేక తెలంగాణ పోరాటం సమయం ఉద్యమకారుల చూశాను.
త్యాగాలు చేసిన వారికి ఎవ్వరికీ గుర్తింపులు లేవ్.
బ్రిటిష్ ఇండియా స్వాతంత్ర చరిత్ర చూసినా అదే జరిగింది.
అక్కడ ఒకే కుటుంబం అందల మెక్కింది.
దేశాని శాసిస్తోంది.
మిగతా అందరినీ చరిత్ర పుటల్లోకి నెట్టేశారు.
వారందరినీ అనాధల్లా మార్చేశారు.
1969 లో ఉద్యమాన్ని రగిల్చిన
చెన్నారెడ్డి సొంత అవుసరాలు తీర్చేసు కున్నాడు,
2014 లో కల్వకుంట్ల కుటుంబం రాజకీయ లబ్ధి పొందింది.
త్యాగాలు పునాదులపై
సరే,
రాష్ట్రంలో రాజకీయంగా పెద్దన్న పాత్ర పోషించిన
ఖమ్మంలో
1952 నుండి ఇప్పటివరకు ఇద్దరే ఖమ్మం స్థానికులు
లోకసభ అభ్యర్థులుగా గెలిచారు.
ఒకరు తమ్మినేని వీరభద్రం, రెండు పొంగులేటి శ్రీనివాస రెడ్డి.
ఎందుకని..?
లోకసభా బరిలో ఎక్కువగా
వలసవాదులే అందాల మెక్కారు.
ఎందుకని?
ఇప్పుడైనా ఖమ్మం స్థానికులు కరువయ్యారా?
దొరకలేదా?
రాజకీయ పార్టీలు ఇంకా డబ్బులకే అమ్ముడు పోవాలా?
అసలు నాయకుల నోట ఓ డైలాగ్
ఈ మధ్యన వైరల్ అవుతోంది
అది "ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోట" అని.
అవునా ఎప్పుడైందీ?
ఏ చారిత్రక పరిస్థితుల్లో అయింది?
కమ్మ్యూనిస్టుల ఖిల్లా కాంగ్రెసు అడ్డాగా ఎలా మారింది?
చరిత్ర తెలుసా?
చెప్పే వాళ్ళున్నారా?
ఏ పార్టీకి నిజాయితీల్లో మినహాయింపులు లేవు.
అభ్యర్థుల నిర్ణయాల్లో సహేతుకత లేదు.
ఎవ్వరి స్వార్ధం వారిదే.
కాంగ్రెసులో 45 సం.లుగా
పార్టీ మారకుండా,
సొంత వ్యాపారాలు, ఉద్యోగాలు చేయకుండా ,
ఆరోపణలు లేకుండా
పార్టీ కోసమే వున్న కార్యకర్తలు ఖమ్మంలో కోకొల్లలు.
వాళ్ళ త్యాగాలు లేకుంటేనే పార్టీ బతికిందా?
వేరే పార్టీ జిల్లా అధ్యక్షులుగా వున్న వ్యక్తులకు,
పార్టీ సభ్యత్వం తీసుకోకున్నా
ఖమ్మం నడి బొడ్డున
లోగడ ఏం.ఎల్.ఏ టిక్కెట్టు ఇచ్చి
కార్యకర్తల అవమానించారు.
మీరేం గౌరవం దక్కించినట్లు వారికి?
ఏమి సందేశం ఇస్తున్నట్లు?
పదవులు ఎలాగో ఇవ్వకున్నా ,
గౌరవాలు అన్నా దక్కాలి కదా?
ఎప్పుడో ఒకప్పుడైనా పదవులతో సత్కరించాలి కదా?
సాంప్రదాయ ఓటు బాంక్ అంటే అంత నిర్లక్ష్యమా?
ఖమ్మానికి ఆత్మాభిమానం లేదనుకున్నారా?
మీ భరతం పట్టరనుకుంటున్నారా?
నిత్యం కట్టుబానిసలనుకుంటున్నారా?
నిఖార్స్ అయిన కార్యకర్తను గుర్తించండి
లోకసభా అభ్యర్ధిగా నిర్ణయించండి.
కళ్ళు తెరవండి.
నిజాన్ని గ్రహించండి
........మీ పెండ్యాల వాసుదేవ రావు
Comments