76. (social..49). రాజకీయ రంగం సమస్తం కుళ్ళి కంపు కొడుతోన్న వైనం.
ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ?
రాజకీయ రంగం సమస్తం కుళ్ళి కంపు కొడుతోన్న వైనం.
బీ.ఆర్.ఎస్ పార్టీలో టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలోకి ..
కాంగ్రెస్ పార్టీ లో టికెట్ దొరకలేదని బీ.ఆర్.ఎస్/బీ.జె.పీ.లోకి ....
పిల్లనిచ్చి/టికెట్ ఇచ్చి పెళ్లి చేసినా/గెలిపించినా
తాళి కట్టిన మరుక్షణమే, కాళ్ళ పారాణి ఆరకుండానే
వేరే వాళ్ళతో లేచి పోడనే గ్యారంటీ ఏమిటీ?
కళ్ళముందు కనిపిస్తున్నదే కదా!
సర్వేలమీద సర్వేలు చేసి
గెలుపు గుర్రాల పసిగట్టి వాటేసుకొనే వారు కొందరు..
గెలిపించిన కార్యకర్తలను, పార్టీని నట్టేట ముంచి
డబ్బు కోసం /కాం ట్రాక్టుల కోసం
గడ్డితినే వారు ఇంకొకరు...
చాలా భలేగుంది మీ రాజకీయం...
పార్టీ సభ్యత్వం లేకుండా శతాబ్దాల/దశాబ్దాల పార్టీలోకి
లేచిపోయి వచ్చినోళ్ళకి కుర్చీ లిస్తే
వాళ్ళనే అందలమెక్కిస్తే
ఇంతకాలం పల్లకీ మోసిన, చమటోడ్చిన,
త్యాగాలతో బతుకీడ్చిన
కార్యకర్తలకు ఎవ్వరు భరోసా?
టికెట్ కోసం వచ్చిన అవతలోడికి
నీ సిద్దాంతాలతో పనిలేదు
నీ నాయకులపై గౌరవం వుండదు
నిన్నటి వరకు నిన్ను బూతులు తిట్టినోడు
ఈరోజు నీకు ఎలా ముద్దు అయినాడు?
తప్పదు. మీకు బుద్ది చెప్పాలి .
వెట్టి చాకిరీని ఎప్పుడో నిషేధించాము కదా
కార్యకర్తల వెట్టి చాకిరీకి ముగింపు పలకాలి.
కార్యకర్తల వదిలేసి కాంగ్రెసు నాయకత్వం ..
ఉద్యమకారుల వదిలేసి అధికార పార్టీ నాయకత్వం ..
యేరు దాటాక తెప్ప తగలేసినట్లుంది.
ఇలా ఎంతకాలం?
ఓటుతో ఈ మురికి పార్టీల ఉతికీయాలి.
యువతరం భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలి.
-----PENDYALA VASUDEVA RAO
<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>
Comments