74. (Social..47). విలీనామా? విమోచనా? విద్రోహమా?.. ఈ సందిగ్ధత ఎందుకొచ్చింది?
వందల సంవత్సరాల బానిసత్వం నుండి, ఎన్నోవేల జనాల బలిదానాల ఫలితంగా వచ్చిన హైదరాబాద్ రాష్ట్రఅవతరణ తేదీని ఉత్సవంగా జరుపుకొనే రాత/అదృష్టం తెలంగాణ ప్రజలకు లేకుండా పోయింది.
1). ఏ నిజాంరాజుకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటంచేశారో, ఆ నిజాంరాజు "ది గ్రేట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ ఆఫ్ దక్కన్" మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ చేతుల మీదుగా నూతనంగా ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయవలసిన దుస్థితి రావటం నా మనసును కలచి వేసింధి.
"మా నైజాం రాజు తరతరాల బూజు" అన్న స్వాతంత్ర సమర యోధులే ఆ రోజు నిజాం ముందు నిలుచుని అభినందించవలసిన స్థితి. ఇండియా ప్రభుత్వం హైదరాబాద్ దక్కన్ పై చేపట్టిన "ఆపరేషన్ పోలో " విజయవంతం అయి మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ లొంగిపోయినా ఆయనని పజల అభీష్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్ర "రాజ్య ప్రముక్ః " గా ఎందుకు ప్రకటించవలసి వచ్చిందో ఆనాటి సర్దార్ వల్లభాయి పటేల్ మరియు జవహర్లాల్ నెహ్రూలకే ఎరుక.
ఆనాడు ఇండియాలో విలీనమైన వందల సంస్థానాలలో దేనికీ ఇవ్వని ప్రత్యేకత ఈ సంస్థానంలోనే ఎందుకు? విలీనానికి ఆయనేమీ ఇండియాతో పోరాటం చేయలేదే! పోరాటము చేసి సంధి కుదుర్చుకోలేదే! రాజీపత్రాలు వ్రాసుకోలేదే! హైదరాబాద్ సంస్థాన పొలిమేరలలోకి భారతసైన్య ప్రవేశంతోనే, అందుకే ఎదురు చూస్తున్నట్లు వెంటనే లొంగిపోయి వంగి, వొంగి దండాలు పెడుతూ లొంగి పోయాడే ! మరెమిటి రాజకీయం?
అందుకేనేమో ఆనాటి ఆస్థితిని, ఇండియాలో విలీనమైన హైదరాబాద్ దక్కన్ రాజ్యంపై ఆనాటి తెలంగాణ నాయకులు జీర్ణించుకోలేక పలువురు పలురకాలుగా వ్యాఖ్యానించారు. ఆ నాటి రాష్ట్ర పరిస్థితిని హైదరాబాద్/తెలంగాణ రాష్ట్రవిమోచమని కొందరు, రాష్ట్రవిలీనమని మరికొందరు హైదరాబాద్ రాష్ట్రవిద్రోహ దినమని ఎందరో! అందుకే నైజామురాజు భారతసైన్యానికి లొంగి పోయిన రోజును ప్రజలకు స్వేచ్చ లభించిన ఉత్సవంగా జరుపుకునే యోగం లేకపోయింది.
పైది జరిగినదే అంతా విచిత్ర అనుకుంటే ….
2). మరో విచిత్రం గమనించండి ..
ప్రపంచంలోనే అత్యంత గొప్పగా చెప్పుకొనే "తెలంగాణా సాయుధ పోరాటం" గురించి అది ముగిసిన రెండు దశాబ్దాలకు గానీ కమ్మునిస్టులే వ్రాయలేదు. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య తనకే ఆ విషయా గురించ పూర్తి సమాచారం లేదని సెలవిచ్చారు.
3). మరో విచిత్రమండీ..
వేలమంది తెలంగాణా ప్రజల/యువకుల బలిదానాలతో, ప్రత్యేక బంగారు తెలంగాణా రాష్ట్రంలో ప్రప్రధమ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక, ఆసెంబ్లీ సాక్షిగా తన పూర్వీకులకు నైజాం రాజు ఎంతో మేలు చేశాడని కీర్తించటం, ఆ నిజాం ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడటం చూసి యావత్తు తెలంగాణ విస్తుపోయింది.....
వేలమంది ఆత్మార్పణం తరువాత ఏర్పడ్డ (ఇండియాలో విలీనం తరువాత) హైదరాబాద్/తెలంగాణ రాష్ర ఆవిర్భావ ముహూర్తాన ఉన్నత స్థానంలో కనిపించిన శ్రీ శ్రీ శ్రీ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ .. ఆతరువాత వందల మంది యువకుల ఆత్మ బలిదానాల ఫలితంగా ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఊపిరి పోసుకున్నాడు.ఇంతకంటే అదృష్టం మరెవ్వరికి కుంటుంది ?
మీ పెండ్యాల వాసుదేవరావు.
<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>
Comments