73. (NKP..16). మా నేలకొండపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం.
దేవాలయ చరిత్ర. ఆరు వందల సంవత్సరాల పైగా చరిత్ర గల నేలకొండపల్లి లోని శ్రీ వేంకటేశ్వర స్వామీ దేవాలయాన్ని పూర్వకాలంలో "నాగుల్ దేవాలయం" గా పిలిచేవారు.నిజాం కాలం నుండి 1967 సంవత్సరంలో రాష్ట్ర దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకునే వరకు "దేవల్ బాలాజీ" అని పిలిచేవారు. యిక్కడ స్వామీ స్వయంభూ మరియు శేషావతారం.యిక్కడ కొలువైవున్న దేముడు భక్తుల కోరిక తీర్చే స్వామియని భక్తుల విశ్వాసం. 320 ఎకరాలు పైగా పొలం ఉన్నా అందులో 100 ఎకరాలు సుమారుగా సాగర్ కాలువ క్రింద పోయింది. మిగిలిన భూమిలో రేగులగడ్డా తండాలో 150 ఎకరాలు పోను నేలకొండపల్లి మరియు పరిసర గ్రామాల్లో ఉంది. 1967 వరకు ముంతకల్దారులు గా మరియు స్థానాచార్యులు గా 17 తరాలు "ముడుంబాయ్" వంశస్థులు వున్నారు. వారి కోరిక ప్రకారం తదుపరి శ్రీ మరింగంటి కృష్ణమాచార్యులు వచ్చారు. ఉత్సవ సమయాల్లో స్వామి వాహన దారులుగా బెస్త కులస్థులు ఆనాటినుంచి ఈనాటి వరకు తరాలు మారినా సాంప్రదాయం కొనసాగిస్తున్నారు. మహిమ మరియు చరిత్ర ఉన్న ఈ దేవాలయం గురించిన చారిత్రక ఆధారాలు/ శిలా శాసనాలు లేకపోవటం దురదృష్టకరం. దేవాలయం తో అనుభంధం. మా వూరికి (నేలకొండపల్లి) తూరు