71. (NKP..14). నేలకొండపల్లి PHC స్థల వివాదం చరిత్ర.

నేలకొండపల్లి ప్రాధమిక ఆరోగ్యకేంద్ర
స్థల వివాదం....

36 సం.ల క్రిందటి మాట.    (1).

నేలకొండపల్లి ప్రాధమిక ఆరోగ్యకేంద్రం, స్థానిక కో-ఆపరటివ్ రూరల్ బ్యాంకు స్థలాల మధ్య సరిహద్దు వివాదం వచ్చింది. 

ఒక 30 సార్లు కనీసం సంబంధిత అధికారులు సర్వే చేసి నివేధికలిచ్చారు. వివాదమైతే ఇప్పటికీ అంతే ఉంది.

విశేషము ఏమంటే స్థానిక గ్రామపంచాయతీ వారు అందులో మా భూమి ఉందంటూ ఆ స్థలంలో జొరబడి కొంత స్థలాన్ని తమ శానిటరీ సిబ్బందికి ప్రభుత్వ నిధులతో ఇళ్లు కట్టించి ఇచ్చారు. రక్షిత మంచినీటి సరఫరా పథకానికి సంబంధించిన వాటర్ ట్యాంక్, వాచమన్ రూమ్ కట్టించారు. ఆ ఇళ్లకు దోవ/రోడ్డు క్రింద కొంత స్థలం కేటాయించారు. స్థానిక మహిళామండలి భవన నిర్మాణానికి భూమి కేటాయించారు.

ఇదే అదనుగా కొందరు షాప్స్ కట్టారు. మరికొందరు ఈ భూమి మాదే అంటూ గుడిసెలు వేశారు.

ఈ ప్రాంత MLA లు గా చేసినవారు వివిధ కాలాలలో రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా చేశారు. అయినా వారు ఎన్నడూ ఈ స్థలాలపై దృష్టి పెట్టలేదు. అది ఈ ప్రాంత ప్రజల దురదృష్టం.
ఆ స్థలం చేసుకున్న పాపం.

ఒక దశాబ్దం పాటు స్థానిక ప్రింట్ మీడియాకు ఇదో పెద్ద హాట్ టాపిక్. సీరియల్ వ్యాసాలు వ్రాశారు. వారికి కొద్దిగా ఓపిక సన్నగిల్లినట్లుంది. ఇప్పుడేమి మాట్లాడటం లేదు.

కోసామెరుపు ఏమిటంటే ఇటీవలే గ్రామపంచాయతీ నిధులతో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తే స్థానిక MLA రిబ్బన్ కత్తిరించాడు. రక్షిత నీటి సరఫరా కు సంబంధించిన వాటర్ ట్యాంక్ ను కులగొట్టే శారు. ఏవో అభివృద్ధి కార్యక్రమాలకు ఆ స్థలం కావాలట.

ఈ మధ్యనే అటుగా వెళ్తూ ఆ స్థలాన్ని చూశాను. చాలా బాగుంది. ఒక చిన్న కాలనీలా వుంది. పక్కా భవంతులతో, షాపులతో, ఆ భవంతులకు సిమెంట్ రోడ్డుతో నవ యవ్వనంతో ఉంది.

అటు వెళుతే మీరుకూడా ఒక లుక్కేయండి.

36 సంవత్సరాల క్రిందటి మాట.   (2).

నేలకొండపల్లి, సింగారెడ్డిపాలెం రెవిన్యూ గ్రామాల మధ్య సరిహద్దులో ప్రస్తుతపు మెయిన్ రోడ్డులో పాత బోదులబండ డొంక ప్రక్కనే ఉన్న సర్వే నెంబర్ 219/1 లో ఒకే పట్టేదారు నుండి మొదటగా సహకార గ్రామీణ బ్యాంక్ (ఒక ఎకరం), ఆ తరువాత ప్రాధమిక ఆరోగ్య కేంద్రం(2ఎకరాలు) కొనుగోలు చేసి రిజిస్టర్డ్ డాకుమెంట్స్ ను పొందాయి.

దశాబ్దాల తరబడి రెండు సంస్థల స్థలాలకు ప్రహరీ గోడలు లేకపోవటంతో స్థలాల్లో కొంత భాగం ఆక్రమణలకు గురిఅయింది. సహకార బాంకు 1961 నుండి కొన్ని కారణాల వల్ల 1975 వరకు కార్యకలాపాలు లేక Defunct కావటం ఆక్రమణ దారులకు వరం గా మారింది.

సహకార గోదామును 1983 సం. లో లక్మి మహిళామండలికి స్థానిక గ్రామ పంచాయతీ పాలకవర్గం ధారాదత్తం చేయటంతో వివాదం రాజుకుని క్రమం గా సమస్య పక్క దారులు పట్టి రాజకీయ కార్చిచ్చులా వ్యాపించింది. అది ఇప్పటికీ కాలుతూనే ఉంది.

ఆ స్థలం పాత ఫోటోలు మీకోసం.

36 సంవత్సరాల క్రిందటి మాట (3).

అసలు జరిగిందేమిటంటే.......1).

సింగారెడ్డిపాలెం రెవిన్యూ గ్రామానికి చెందిన 219/1 సర్వే నంబరులో రిజిస్టర్డ్ డాక్యుమెంట్  నంబర్ 139/59,తేదీ.3.3.1959 ప్రకారం సహకార గ్రామీణ బ్యాంకు కు ఒక యకరం భూమి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నంబర్ 1915/60, తేదీ.3.12.1960 ప్రకారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి రెండు ఏకరముల భూమిని ఆ సర్వే నంబరు పట్టాదారు నుండి కొనుగోలు చేశారు. ఆ స్థల స్వరూపాన్ని తెలిపే మ్యాప్ క్రింద ఇవ్వబడింది. 

అప్పుడు సింగారెడ్డిపాలెం గ్రామం సాంకేతికంగా మృత గ్రామం.ఎవ్వరు నివాసం లేరు. 

పైన పేర్కొన్న రెండు సంస్థల భూమికి కాంపౌండ్ వాల్స్ కట్టలేదు. ఆ రోజుల్లో అవుసరమనిపించలేదు. ఇలా ఉండగా 1961 నుండి సహకార గ్రామీణ బ్యాంకు సహకాశాఖ విచారణలో మునిగి కార్యకలాపాలు స్తంభించి 1975 వరకు మూతపడి పోయినది. పి. హెచ్.సి కి ఒక భవనాన్ని కార్య కలాపాల అవుసరాలకు నిర్మించారు.

ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మరియు సహకార గ్రామీణ బ్యాంకు స్థలాల ఉమ్మడి మ్యాపు క్రింద చూడవచ్చు. ఈ మ్యాపును ఈ రెండింటి స్థలాలను కొనుగోలు చేసిన అప్పటి గ్రామ సర్పంచ్ పెండ్యాల సత్యనారాయణ రావు గారి స్వహస్తాలతో రాశారు. 

ఇలాఉండగా 1971 సం.లో అప్పటి ఖమ్మం జిల్లాలో రక్షిత నీటిసరఫరా పథకమును ఖమ్మం జిల్లా కలెక్టర్(మెమోరాండం. నంబరు.6654/progs. Vll/70-71, తేదీ. 18.11.1971) మంజూరు చేశారు. అందులో నేలకొండపల్లి గ్రామ పంచాయతీ ఉంది. పాలవంచ, బూర్గంపాడు, బయ్యారం, సుజాత నగర్ తదితర 9 గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. దానికి గ్రామ ప్రజల తరఫున స్థానిక గ్రామ పంచాయతీ "పీపుల్స్ కంట్రిబ్యూషన్" కట్టవలసి రావటంతో దానికి ప్రత్యామ్నాయంగా ఖాళీగా ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్ర స్థలాన్ని చూపంచటంతో జిల్లాపరిషత్ నిధులతో వాటర్ టాంకు, వాచమన్ క్వార్టరు నిర్మాణం చేశారు. 

నిర్మాణం పూర్తి కాగానే RC. NO.100/1977, తేదీ. 1.4.77 ప్రకారం జిల్లాపరిషత్ ఇంజనీరింగ్ శాఖ వారు ఆ నిర్మాణాలను స్వాధీనంలోకి తీసుకొనమని స్థానిక గ్రామ పంచాయతీకి  ఉత్తరం వ్రాయటంతో తేదీ. 30.04.77 నాటి గ్రామపంచాయతీ సమావేశములో ఎజెండా.నం.7 ప్రకారం తీర్మానించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న భూమి ఎ.0.14. కుంటలుగా పేర్కొంటూ, దాని చుట్టూ సిమెంట్ స్తంభాలతో తీగ వేసి కాంపౌండ్ నిర్మించాలని తేదీ. 29.07.77 నాటి పాలకవర్గ సమావేశంలో గ్రామపంచాయతీ ఎజెండా.నం.33 ద్వారా తీర్మానిం చారు. అప్పటి నుండీ ఆ 0.14 కుంటల భూమి గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉంది.


రక్షిత మంచినీటి సరఫరాపధకం అమలుకు, ప్రజాప్రయోజనాలకోసం మాత్రమే గ్రామ పంచాయతీ ఆస్థలాన్ని స్వాధీనంలో ఉంచుకొన్నందున గ్రామపంచాయతీకి  దానిపై యాజమాన్యపు హక్కు రాదు. వేరేవాళ్లకు బధలాయించే హక్కు రాదు.

ప్రస్తుతం అక్కడున్న వాటర్ టాంక్ ను కూలగొట్టినందున, రక్షిత నీటి సరఫరా లేనందున ఆ స్థలాన్ని తిరిగి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి స్థానిక గ్రామ పంచాయతీ వారు అప్పగించవలసి ఉంది.

ఇది ఇలావుంటే ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి ఈశాన్య దిక్కున ఉన్న 205/1 సర్వే నం కు చెందిన 0.3 కుంటల స్థలం 0.8 కుంటాలుగా మారడంతో అక్కడ పక్కా భవనాలు వెలిశాయి. తూర్పు ఆగ్నేయ భాగాన పట్టేదారు వారసులు వేసిన గుడిసెలు నేడు పక్కా భవనాలైనవి. మరి ఇవన్నీ పరిష్కారం అయ్యే దెన్నడో...... చూద్దాము.


పైన వున్నమూడు ఫోటోలు పట్టేదారు వారసులవి.  
క్రింద వున్న ఫోటో ఆ స్థలానికి ఈశాన్యం మూలాన వున్న ఆక్రమిత నిర్మాణాలను చూడవచ్చు.
వివిధ సందర్భాలలో పత్రికలలో వచ్చిన వార్తా క్లిప్పింగులను చూడవచ్చు.

జిల్లా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన నిధులతో స్థానిక గ్రామపంచాయతీ శానిటరీ సిబ్బందికి నిర్మించిన గృహాలు. 

FIRST PUBLISHED ON DT: 12.02.2021.ON FACE BOOK WITH PHOTOS.
AUTHOR. PENDYALA VASUDEVA RAO. PRESIDENT  CRB, NELAKONDAPALLY.

----పెండ్యాల వాసుదేవరావు 

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Comments

Popular posts from this blog

82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

36.(SOCIAL-36) MUST RETHINK ABOUT VIP SYSTEM IN INDIA.

81. (SOCIAL--54) ఔనా? నిజమేనా?