83. NKP.. (17). ప్రభుత్వాలు మారినా..విధానాలు మారవా?

 ప్రభుత్వాలు మారినా విధానాలు మారవా?

ప్రజల తలరాత మారదా?


నేలకొండపల్లి మండల బస్సు ప్రయాణీకుల బాధలు ఎవ్వరికీ పట్టవా?


ఆర్.టీ.సీ బస్సు స్టాండ్ ను నేలకొండపల్లి గ్రామంలో 1990 ఏప్రిల్ నెలలో అప్పటి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ జీ.వీ.సుధాకరరావు ప్రారంభించారు. 


అప్పటి సర్పంచ్, స్వాతంత్ర సమర యోధులు శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు.


ఈ బస్సు స్టాండ్ ఆనాడు, ఈనాడు పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో వున్న ఏకైక బస్సు స్టాండ్. రెండెకరాల సువిశాల విస్తీర్ణంలో వుంది. ఆ స్థలానికి రక్షణ లేకుండా పోతోంది. విలువ కోట్ల రూపాయల్లో వుంది.


నియోజకవర్గంలో వున్న ఏకైక బస్సు స్టాండ్ ను కూడా సంరక్షించ లేరా?

వినియోగంలోకి తేలేరా?


11 సంవత్సరాలనుండి నేలకొండపల్లి మండల ప్రజలు బస్సుల నిరీక్షనకై రోడ్డుమీద ఎండకు, వానకు నిలబడి నానా యాతన పడుతున్నారు. స్త్రీలకు వాష్ రూం సౌకర్యం వద్దా?

ముసలివారు, గర్భిణీలు, పసిపిల్లలు ప్రభుత్వాల తిట్టుకుంటూ తమ దురదృష్టానికి వాపోతున్నారు. విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. వికలాంగుల పరిస్థితి సరేసరి. 


ప్రయాణీకుల అసౌకర్యాల తొలగిపుకై చర్యలు తీసుకోవాలని స్థానిక శాసన సభ్యులు మరియు రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి గారికి విజ్ఞప్తి.


ఒక ప్రజా ప్రతినిధి (MLA) ఏలుబడి  కాలంలో 2013 లో పక్కా బిల్డింగ్ తో సహా మొత్తం బస్సు స్టాండును  పది సంవత్సరాలకు లీజుకు ఇచ్చారు. లీజు పూర్తి కాగానే తమ కట్టడాల తీసేసి ఓపెన్ స్థలాన్ని ఆర్.టీ.సీ కి అప్పగించాలి అనేది ఇరుపక్షాల మధ్యన అగ్రిమెంట్.


బస్సుస్టాండును లీజుకు ఇవ్వటాన్ని  వ్యతిరేకించి, అధికారులపై ప్రయాణీకులు తిరగబడితే లీజును కేన్సిల్ చేస్తూ ఆర్.టీ.సీ అధికారులు ఇచ్చిన నోటీసు పై లీజుకు తీసుకున్న వ్యక్తి కోర్టును ఆశ్రయించి ఆర్.టీ.సీ అధికారులు తన జోలికి రాకుండా స్టే తీసుకోవటం జరిగింది. అతను వేసిన దావా ముగిసేదాకా ఈ స్టే అమలులో వుంటుంది.


తరువాత కోర్టు వెలుపల వాది, ప్రతివాదులు రాజీ చేసుకున్నారు. ఆ విషయం కోర్టు వారికి తెలియకుండా మరో agreement ను కుదుర్చుకున్నారు. ఇదీ తప్పిదమే. న్యాయ సూత్రాలకు విరుద్ధం.


లీజుకు ఇచ్చిన స్థల 

విస్తీర్ణాన్ని కుదించి బిల్డింగ్ ను లీజు నుండి తప్పించారు. అయినా ప్రయాణీకుల కష్టాలు తీరలేదు. బస్సులు బస్సు స్టాండ్ ముఖమైనా చూడలేదు.


కోర్టు వారి ఆదేశాన్ని శిరసావహించి దావా వేసిన వాది ట్రైల్ కు  (సాక్ష్యాలతో విచారణకు) రాకపోవటంతో దావా డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అయింది.


లీజు పూర్తి అయి, చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం అక్కడ వున్న నిర్మాణాలను dismaantle చేసి ఓపెన్ ప్లేస్ ను ఆర్ టీ.సీ కు అప్పజెప్పాల్సి రావటంతో దావాను తిరిగి పునరుద్ధరించాలని వాది(లీజుకు తీసుకున్న వ్యక్తి) కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు.


దావా పునరుద్ధరణ జరిగితే ఇంజక్షన్ ద్వారా ఆర్.టీ.సీ వారిని అడ్డుకోవచ్చని, దాన్నొక ఆయుధంగా వాడుకోవచ్చని లేజుదారు ఆలోచనగా కనిపిస్తోంది.


అగ్రిమెంట్ ప్రకారం చర్యలు  తీసుకునే వ్యవహారంలో భాగంగా ఓపెన్ ప్లేస్ అప్ప జెప్పటానికి  చర్యలు తీసుకుని, మళ్ళీ లీజుకు ఇచ్చే చర్యలు మానుకోవాలని ప్రయాణీకుల డిమాండ్.


దావా purpose తీరిపోయినా చేసిన వాది దావాను పునరుద్ధరించే  ప్రయత్నాలను ఆర్.టీ.సీ అధికారులు వ్యతిరేకించలేదు. కోర్టు వారికి సమాధానం సమర్పించ లేదు. 


లీజు కాలం అయి పోయినా చర్య తీసుకోక పోగా, మరో సంవత్సరం లీజును రహస్యంగా పొడిగించారు.

 

ఆర్.టీ. ఐ ద్వారా పై పొడిగింపు పత్రాన్ని అడిగినా సంవత్సరము అయినా ఆర్.టీ.సీ వారు దరఖాస్తు దారునికి ఇవ్వకుండా రహస్యంగా వుంచటంలో ఆంతర్యం అర్ధము కాలేదు.


వాది మరియు ప్రతివాది చర్య వల్ల దావా పునరుద్ధరణ జరిగితే ఇంజక్షన్ ఆర్డర్ పునరుద్దరణ జరిగి మళ్ళీ ప్రయాణీకులు ఇబ్బందులు పడతారు. ఆర్.టీ.సీ అధికారులు ఆ కారణాన్ని చూపి వాదికి తోడ్పడే అవకాశం వుంది.


ఈ స్థితిలో స్థానిక బస్సు ప్రయాణీకుడు శ్రీ కే.రవికుమార్ న్యాయవాది శ్రీ పెండ్యాల వాసుదేవరావు ద్వారా ఆ దావాలో తాను ఇంప్లీడ్ కావాలని గౌరవ నీయ కోర్టులో దరఖాస్తు దాఖలు చేసి వాస్తవ విషయాలను కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 


అందువల్ల సంవత్సర కాలంగా లీజుదారుకు స్టే లేదు. ఆర్.టీ.సీ వారు ప్రయాణీకులకు అనుకూలం గా చర్య తీసుకునే అవకాశం లభించింది. కానీ వారు ఏ చర్యా తీసుకోక పోగా ప్రయాణీకుల సౌకర్యాలను నేల రాస్తున్నారు. ఏవో ప్రయోజనాలను ఆశిస్తున్నట్లు వుంది. 


కోర్టులో వేసిన ఏ దరఖాస్తుకు సమాధానాన్ని ఆర్టీసీ వారు ఇవ్వకపోవడం వారి బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోంది.


నేలకొండపల్లి మండలంలో బస్టాండ్ మరలా లీజ్ ప్రకటన వలన ఆందోళనలో మండల ప్రజానీకం వున్నారు.


లీజ్ పూర్తి అవగానే బస్టాండ్ వినియోగం లోకి వస్తుంది అని అందరు ఆశ పడ్డారు....

ప్రభుత్వాధి నేతలు స్పందిస్తారని ఆశ.


----పెండ్యాల వాసుదేవ రావు.


<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


<script async src="https://fundingchoicesmessages.google.com/i/pub-1447880810215412?ers=1" nonce="BDKM9oEoU_MCwJ721WC3Lg"></script><script nonce="BDKM9oEoU_MCwJ721WC3Lg">(function() {function signalGooglefcPresent() {if (!window.frames['googlefcPresent']) {if (document.body) {const iframe = document.createElement('iframe'); iframe.style = 'width: 0; height: 0; border: none; z-index: -1000; left: -1000px; top: -1000px;'; iframe.style.display = 'none'; iframe.name = 'googlefcPresent'; document.body.appendChild(iframe);} else {setTimeout(signalGooglefcPresent, 0);}}}signalGooglefcPresent();})();</script>



Comments

Popular posts from this blog

82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

78. (social...51). ఎవవరెవరో ఎక్కడినుండో వస్తారు..... ఆలోచించండి ప్రజలారా...

80. (SOCIAL--53) దేశంలో ప్రజా సేవ ఇంత Costly నా? ఎవ్వరికీ బాధ్యతలు లేవా?