40.(NKP-2). మా వూరి బస్సు స్టాండ్--పాత జ్ఞాపకాలు..
అయ్యో బస్సు స్టాండు వెళ్లి పోయావా?
మొన్న నేలకొండపల్లి వెళ్ళినప్పుడు చూశాను. బస్సు స్టాండు కూలగోట్టేసారు. అది చూడగానే పాత సంగతులు కనుల ముందర కదలాడాయి.ఆ సంగతులకు ఈ ఫొటోలే సాక్ష్యం.
నేలకొండపల్లి బస్సు స్టాండ్ ఇక్కడ కట్టటానికంటే ముందునుంచే అక్కడ జనాలు బుస్సులకై వేచివుండేవాళ్ళు. 1955 సంవత్సరం లో స్థానిక గ్రామ పంచాయతీ దాన్ని కట్టించింది. పోరాటం తోనే దాని నిర్మాణం పూర్తి చేశారు. జిల్లాలో బస్టాండ్ ల నిర్మాణం ఆలోచన లేని రోజుల్లోనే దాన్ని ప్రారంభించారు. సర్పంచ్ శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గవర్నమెంట్ రోడ్ లో ఇల్లు కట్టుకుంటున్నాడని మోపిన అభియోగాలని అధిగమించి కట్టారు.
బస్స్టాండ్ ప్రశాంతమైన వాతావరణంలో వుండేది.ముందర రోడ్ కు ఆవల చెరువు నీళ్ళ నుంచి, వెనుక వేపు నుంచి పచ్చని పొలాల నుంచి వచ్చే చల్లని గాలి ఆహ్లాదంగా వుండేది.
ఈ క్రింది ఫోటో 1955 సంవత్సరంలో తీసినది.
బస్స్టాండ్ ప్రశాంతమైన వాతావరణంలో వుండేది.ముందర రోడ్ కు ఆవల చెరువు నీళ్ళ నుంచి, వెనుక వేపు నుంచి పచ్చని పొలాల నుంచి వచ్చే చల్లని గాలి ఆహ్లాదంగా వుండేది.
ఈ క్రింది ఫోటో 1955 సంవత్సరంలో తీసినది.
1955 నుంచి 1975 దాకా నిరాటంకం గా అక్కడ బస్సులు ఆగినవి. 1975 నుండి 1980 దాకా బస్సులు ఆగటానికి పోరాటం చేయాలిసి వచ్చింది. బస్సులు ఆగటానికి అక్కడ రోడ్ వెడల్పు సరిపోదని ఆర్టీసీ చెప్పిన అభ్యంతరం వల్ల ఛివరకు సాంప్రదాయాలకు విరుద్ధంగా అక్కడ ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని వెనక్కు జరపాల్సి వచ్చింది. సాంప్రదాయ వాదులు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.ఫోటోలో ఉన్న రాతి గోడ రోడ్ సగం వరకు మీదకు ఉండేది. కొంత కాలం తరువాత దానిని చెరువుకట్ట బస్సు స్టాండ్ అనే పేరుతో పిలుచుకోనేవారు.
క్రింది చిత్రాలు రెండు 1979 లో తీసినవి.
క్రింది చిత్రాలు రెండు 1979 లో తీసినవి.
-------------పెండ్యాల వాసుదేవరావు
.
<!-- Google tag (gtag.js) -->
<script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script>
<script>
window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());
gtag('config', 'G-1M93C8YK91');
</script>
Comments