39. (NKP-10). నా రాజకీయ జీవిత ప్రారంభపు జ్ఞాపకాలు
యూత్ క్లబ్ ప్రెసిడెంట్ గా సమాజ సేవ ఆరంభం.
1977 సం.లో నేలకొండపల్లి గ్రామంలోని అన్ని వర్గాల యువకులంతా కలిసి నన్ను ఏకగ్రీవంగా యూత్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. లిబర్టీ యూత్ క్లబ్ గా దానికి నామకరణం చేసాము. ప్రెసిడెంట్ గా నేను, వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ కంకిపాటి శ్రీనివాస రావు, సెక్రటరీగా చెరుకూరి సాంబశివరావు, జాయింట్ సెక్రటరీగా శ్రీ కొల్లి జగన్మోహనరావు, కోశాధికారిగా శ్రీ ఠాకూర్ రాంగోపాల్ సింగ్ మరియు శ్రీ కోనేరు కిశోరు యిత్యాదులు కార్యవర్గ సభ్యులుగా వున్నారు.
కొంతకాలం తరువాత జూనియర్ కాలేజీలో జరిగిన ఇంటర్ ఫైనల్ క్లాసు ప్రతినిధి ఎన్నిక పరిణామాల పర్యవసానంగా గ్రామ వాతావరణం మారిపాయింది. యూత్ క్లబ్ లో లిబర్టీ కరువై పాయిందని కొందరు బయటకు వెళ్ళటం, నేను తప్పనిసరి పరిస్థితులలో రాజకీయాలలోకి రావటం జరిగింది. అప్పుడు వున్న నిబంధనల ప్రకారం సీనియర్ ఇంటర్ లో గెలిచిన ప్రతినిధే కాలేజీ ప్రెసిడెంట్ అవుతాడు.
రాజకీయాలలోకి వచ్చిన తరువాత మొట్టమొదటి సారిగా సుందరయ్య చౌక్ లో కాంగ్రెస్ గద్దె నిర్మాణం ప్రారంభించాము. అప్పుడు CPM పార్టీ సానుభూతిపరుడు ఒక్కరు గద్దె నిర్మాణ స్థలాన్ని ఇందిరాగాంధీ సమాధి అనటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అందువల్ల కార్యక్రమాన్ని భారీఎత్తున చేయాలిసి వచ్చింది. దానికి సంబంధించిన ఫొటోనే ఇది. ముఖ్య అతిధిగా ఖమ్మం MLA శ్రీ కీసర అనంతరెడ్డి వచ్చారు. 1979 సంక్రాంతి పర్వదినాన (14.01.79) జరిగిన ఈ కార్యక్రమంకు సంబంధించిన ఈ ఫోటోలో మైక్ స్టాండ్ ఎదురుగా కూర్చున్న వ్యక్తి శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారు.ఆయన కుడి ప్రక్కన శ్రీ అనంతరెడ్డి గారు. సత్యనారాయణరావు గారికి ఎడమ ప్రక్కన అప్పటి DCC PRESIDENT శ్రీ సోమ్లానాయక్, ఆయనకు ఎడమ వేపున శ్రీ కిలారు వెంకయ్య, (ఖమ్మం టాక ప్రెసిడెంట్) వున్నారు. సభలో మాట్లాడుతున్న వ్యక్తి శ్రీ కొత్త యోగానందరావు, (ఉప సర్పంచ్), ఆయన ప్రక్కన కూర్చున్న వ్యక్తి శ్రీ పెండ్యాల వాసుదేవ రావు.
ఈ కార్య క్రమం తరువాత గ్రామరాజకీయాలు శరవేగంగా మారిపోయాయి.
1978 సం.లో జూనియర్ కాలేజీ లో ఇంటర్ ఫైనల్ లో ఎవ్వరు క్లాసు ప్రతినిధి అవుతే వాళ్ళే కాలేజీ ప్రెసిడెంట్. గెలుపుకు చేరువలో వున్న యనమండ్ర ప్రసాద్ అనే స్టూడెంట్ ను కొంత మంది యువకులు కిడ్నాప్ చేసారు.అతనితో పాటు మన్నే కోటేశ్వర్ రావు అనే స్టూడెంట్ ను కుడా కిడ్నాప్ చేసారు. యూత్ క్లబ్ ప్రెసిడెంట్ గా వున్న నాపై ఆ సమస్య పరిష్కారానికి వత్తిడి పెరిగింది. వాళ్ళను విడిపించి అప్పటి ప్రిన్సిపాల్ సూచించిన రాజీ మార్గానికి అందరమూ ఎకీభవించాము. ఆ సమస్య ఆ సం. పరిష్కారమైంది. కాని తరువాతి సం. ము ఎన్నికల విధానం మారటం తో కాలేజీ ఎన్నికలు జనరల్ ఎన్నికలను తలపించాయి. అందరు ఇండిపెండెంట్లు గానే రంగ ప్రవేశం చేసినా గెలిచిన వాళ్ళు మేం PDSU అన్నారు. ఇవతల వాళ్ళు NSUI అనక తప్పలేదు. దాదాపు పది సం.లు హోరా హోరి యుద్ధం జరిగింది. ఫలితం గా నేను రాజకీయాల్లో వుండి పోవాలిసి వచ్చింది. అప్పటి వరకు O.U లో NSUI ఉనికి లేదు. Membership books ను నేను ఢిల్లీ లో AICC ఆఫీస్ నుండి తీసుకు వచ్చాను.
NSUI అనగానే వాకా శ్రీనివాస రావు ప్రముఖం గా గుర్తుకు వస్తాడు.
మున్నా పాపయ్య, హరి వెంకటేశ్వర్లు, తిరునగరి మల్లయ్య(భుట్టో), రాయపూడి నారాయణ రావు, నున్నా సుధాకర్, మామిడి వెంకన్న,పేరాల సత్యనారాయణ (GANDHI), దేవరశెట్టి వెంకటేశ్వర్లు, పేరాల సత్యనారాయణ (గాంధీ), సోడేపొంగు LAXMAIAH, నర్సీరెడ్డి, వున్నం వెంకటనరసయ్య, యరసంగి సైదులు, లక్కం రామారావు, చెరుకు నాగభూషణం, ప్రేమసాగర్ .....ఇలా ఎందరో స్మృతి పథంలో కనిపిస్తారు. ఖమ్మంలో ABVP నాయకుడైన శ్రీ తడికమళ్ళ విజయకుమార్ ఇక్కడ NSUI కే సహకారాన్నందించే వారు. క్రింది చిత్రంలో ఎడమ నుండి కుడికి ఆనాటి NSUI leaders పేరాల సత్యనారాయణ (గాంధీ), వున్నం వెంకటనరసయ్య, దేవరశెట్టి వెంకటేశ్వర్లు వున్నారు.

క్రింది ఫోటోలో యూత్ క్లబ్ ప్రెసిడెంట్ గా వున్ననేను ప్రసంగిస్తున్న దృశ్యం.
ఈ చిత్రం లో కుడి నుండి వరుసగా సర్వశ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు సోమ్ల నాయకే, ఖమ్మం MLA, TELANGANA PLANNING COMMITTEE CHAIRMAN శ్రీ కీసర అనంత రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ (మాజీ RBI GOVERNOR)శ్రీ దువ్వురి సుబ్బా రావు వున్నారు. మాట్లాడుతున్న వ్యక్తి శ్రీ పెండ్యాల వాసుదేవ రావు.

నేలకొండపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్య కర్తల సమావేశం.
క్రింది చిత్రంలో మాట్లాడుతున్న స్వాతంత్ర సమరయోధులు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, మరియు చిత్రంలో శ్రీ సంభాని చంద్రశేఖర్ (స్థానిక శాసనసబ్యులు), శ్రీ కొమ్మినేని అనంతరామయ్య, శ్రీ వున్నం వెంకయ్య తదితరులు వున్నారు. చంద్రశేఖర్ కు ముందర కూర్చున్న వ్యక్తి శ్రీ పెండ్యాల వాసుదేవ రావు(చేతికి కడియం).

గత కాలపు జ్ఞాపకం---ప్రస్తుత రాజకీయ పునరేకీకరణ పరిణామాల నేపధ్యంలో ఏరియాలో రాజకీయంగా Congress పార్టీ కనుమరుగు అవుతున్నదన్న ప్రచార సమయాన......పాత జ్ఞాపకాలు కనుల ముందు కదలాడినవి.
1984 సంవత్సరంలో కుసుమంచి సెంటర్ లో ఎలెక్ట్రిసిటీ ఆఫీస్ ప్రక్కన కాంగ్రెస్ పార్టీ దిమ్మె ఆవిష్కరణ.
ఈ చిత్రంలో సర్వశ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, సంభాని చంద్రశేఖర్,పెండ్యాల వాసుదేవ రావు, కొమ్మినేని ఆనంతరామయ్య, పటేల్ రామచంద్రసింగ్, కనపర్తి వెంకటేశ్వర్లు, తిరునగరి మల్లయ్య, కనపర్తి సీతయ్య, పల్లపు రాములు, గోళ్లమూడి భద్రయ్య, రాయపూడి నారాయణ రావు, వాసుగంటి రాములు తదితరులు ఉన్నారు.

----పెండ్యాల వాసుదేవ రావు.
Comments