37. (NKP-1)మా వూరి వెంకటేశ్వరస్వామి దేవాలయం విశేషాలు.

దేవాలయం చరిత్ర.
ఆరు వందల సంవత్సరాల పైగా చరిత్ర గల నెలకొందపల్లి లొని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పూర్వకాలం లో "నాగుల్ దేవాలయం"గా పిలిచేవారు. నిజాం కాలం నుంచి 1967 సంవత్సరం రాష్ట్ర దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకొనే వరకు "దేవల్ బాలాజీ" అని పిలిచేవారు.

ఇక్కడ స్వామి స్వయంభూ మరియు శేషావతారం. ఇక్కడ కొలువై ఉన్న దేవుడు కోరిన కోరికలు తీర్చే స్వామియని భక్తుల విశ్వాసం.

320 ఎకరాలు పైగా పొలం ఉన్నా అందులో 100 ఎకరాలు సుమారుగా సాగర్ కాలువ క్రింద పోయింది. మిగిలిన భూమిలో రేగులగడ్డా తండాలో 150 ఎకరాలు పోను నేలకొండపల్లి మరియు పరిసర గ్రామాల్లో ఉంది. 1967 వరకు ముంతకల్దారులు గా మరియు స్థానాచార్యులు గా 17 తరాలు "ముడుంబాయ్" వంశస్థులు వున్నారు. వారి కోరిక ప్రకారం తదుపరి శ్రీ మరింగంటి కృష్ణమాచార్యులు వచ్చారు. ఉత్సవ సమయాల్లో స్వామి వాహన దారులుగా బెస్త కులస్థులు ఆనాటినుంచి ఈనాటి వరకు తరాలు మారినా సాంప్రదాయం కొనసాగిస్తున్నారు. మహిమ మరియు చరిత్ర ఉన్న ఈ దేవాలయం గురించిన చారిత్రక ఆధారాలు/ శిలా శాసనాలు లేకపోవటం దురదృష్టకరం.
దేవాలయం తో అనుభంధం.
మా వూరికి (నేలకొండపల్లి) తూరుపు దిక్కున పొలాల మధ్యన, వూరికి దూరంగా ఉన్న వెంకటేశ్వర దేవాలయం చుట్టూ వాగు(తూరుపు మినహా) ఉంటుంది. ఈదులు గీయటానికి వచ్చే గౌడలు, వాగులో చాకళ్ళు ఉదయం నుంచి సందడి.1958 ప్రాంతంలో ధ్వజస్థంభాన్ని వేశారు. నేను మా జీప్ లో మా ఫాథర్ తో వెళ్లిన గుర్తుంది. వీధి దీపాలు లేకున్నా అ చీకెట్లోనే ప్రతి శనివారం వెంకటేశ్వర దేవాలయానికి స్నేహితులతో వెళ్ళేవాడిని. ధర్మకర్తల కమిటీ వచ్చేవరకు గ్రామ మాలీ పటేల్ శ్రీ రావులపాటి రంగారావు గారు ప్రతి శనివారం భజన హార్మొనీ వాయిస్తూ చేసేవారు. నేనూ అందులో పాలుపంచుకొనే వాడిని. దేవాలయం లోనికి వెళ్ళాలంటే కత్వా పైనున్న రాతి గోడ ఎక్కి దిగవల  సిందే. యువకులతో బాటు వ్రుద్హులు అయినా, స్త్రీలు అయినా పిల్లలు అయినా దైవ దర్శనం కావాలంటే అలా వెళ్ళవలసిందే. దేవాలయానికి దాహ్షిణ దిక్కుగా చారిత్రాత్మక బైరాగుల గుట్ట వుంటుంది. యువకులము అందరము గుట్ట ఎక్కటానికి ప్రతేకంగా వెళ్ళే వాళ్లము. ఆ రోజులు ఆ అనుభవాలే వేరు.


అభివృధ్హి పధాన దేవాలయం--దేవాదాయ శాఖ నియామక కమిటీ ఆవిర్భావం.
1967 సంవత్సరం లో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు చైర్మన్ గా నేలకొండపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ స్తానానికి  ధర్మకర్తల మండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.వారి ఆధ్వర్యంలో దేవాలయం అభివృద్ధి తో శోభను సంతరించుకుంది. దేవాలయ ప్రవేశానికి వాగుపై సిమెంట్ వంతెన కట్టారు. ఎలక్ట్రిసిటీ సదుపాయం కల్పించారు. తిరుమల నుంచి మైక్ సెట్ తెప్పించారు, చుట్టూ రాతి కాంపౌండ్ కట్టించారు.పూజారి కుటుంబ అవుసరాల నిమిత్తం రూమ్ కట్టించారు. కొంత కాలం గోశాల నిర్వహించారు. వాగు అవతల వున్న రాతి మండపంలో శ్రీరామనవమి ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించారు. ఉప్పుదిమ్మెల దగ్గరనుండి దేవాలయం వరకు విద్యుత్ వీధి దీపాలు వేయించారు. దేవాలయ ప్రాంగణం అంతా నల్లరాయి కావటంతో వాస్తు కూడా అవుసరం కావటం వల్ల భావి తవ్వించే ప్రయత్నాలు ఫలించలేదు. ఆదాయ పెంపు మార్గాలకు మాత్రం ప్రయత్నాలు ప్రారంభించారు.
క్రింది ఫోటో దేవాలయ ప్రవేశం తరువాత దేవాలయ ప్రాంగణం.


క్రింది ఫోటోలో దేవాలయం ముందర కనిపిస్తున్న తెల్ల రాతి కట్టడమే  ముజ్జిగుడెం మరియు అనాసాగరం గ్రామాలకు రహదారి ఒకప్పుడు.కత్వాకు వరద వచ్చినప్పుడు జనాలు ప్రాణాలకు తెగించి నడిచే వాళ్ళు.
  
ఈ క్రింద ఫోటోలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు కనిపించే రాతి గోడ కట్టడమే దేవాలయ ప్రవేశానికి పోయే రోడ్డు1968 వరకు. 

చాలా దశాబ్దాల కాలం వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు వున్న క్రింద కనిపిస్తున్న కట్టయే ముజ్జుగూడెం, అనాసాగరం గ్రామాలకు వున్న ఏకైక రహదారి. కత్వా పొంగి, కట్టపై మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తున్నా అలాగే ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రయాణించేవారు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>



Comments

Popular posts from this blog

82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

78. (social...51). ఎవవరెవరో ఎక్కడినుండో వస్తారు..... ఆలోచించండి ప్రజలారా...

80. (SOCIAL--53) దేశంలో ప్రజా సేవ ఇంత Costly నా? ఎవ్వరికీ బాధ్యతలు లేవా?