70. (NKP..13). ఏంది సామీ!



ఏంది సామీ యిది ?
గీ చిచ్చు ఏంది?
సన్యాసివి కదా....జర సైలెంటుగా వుండరాదురి.
తరం మారే.  విలువలు మారిపాయే.

రామున్ని నిందించిండని, రామాయణాన్ని కించపరిచిండని కత్తి మహేష్ ని నగర బహిష్కరణ చేసినరు గందా. 

మన సమ్మక్క, సారలమ్మ వనదేవతలని , గ్రామదేవతలని అది ఇది అని అవమానించినోన్ని ఏమి చెయ్యాలే అని గొంతెత్తి అడుగుతున్నరండీ.  పడేండ్ల సంది గిట్లనె  మాట్లాడుతున్న రాంట . పాత వీడియో  చూపిస్తున్నారు. 

శివయ్య, పార్వతీదేవి  గురించి గట్లనే మాట్లాడితివి. పార్వతీ దేవి గురించి వెకిలిగా మాట్లాడితివి. 

దేవుడంటే కేవలం వైష్ణవం అని విషపు భావజాలం ప్రజల్లో నింపేటోన్ని నెత్తికెక్కిచ్చుకునుడు అవసరమా. సమతా మూర్తి విగ్రహాన్ని వేలకోట్లు ఖర్చు చేసి పెట్టినా  దేవుళ్లను సమానంగా చూడలేనోనివి ఇంక మనుషులనేం చూస్తవ్..?

పూర్వం సనాతన హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్లలో  శైవులు( శివ భక్తులు) ,వైష్ణవులు( విష్ణువు భక్తులు) అంటూ వర్గాలుగా విభజింపడ్డారు.. వీళ్లకు అస్సలు పడేది కాదు..మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని పోట్లాడుకునేవారు..

ఈ చిన్న జీయర్ వైష్ణవుడు..కాబట్టి ఈయన దృష్టిలో దేవుడు అంటే కేవలం విష్ణువు (అవతార రూపాలు).. ప్రజలను అందరిని వైష్ణవం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు..అందుకే పార్వతి పరమేశ్వరులపై ఇతర దేవుళ్ళపై విషం చిమ్ముతున్నాడు..

రామానుజులు గొప్పవాడంటే చిక్కు లేదు. ఆదిశంకరుల చిన్నబుచ్చుడు మేధావిగా  గొప్పవాడవ ని పేరు వస్తదని ఆశా సామీ..

మా తెలంగాణ తాత (ముఖ్యమంత్రి గారు) నీ మాయలో పడిపాయే. 

పుణ్యానికి వందలకొద్దీ భూములు, గుట్టలు ఇచ్చి నీకఇక్కడ పీట వేసి ఆశ్రమం ఏర్పాటు చేసే. యాదాద్రి పర్యవేక్షణ బాధ్యత అప్పగించే. అన్నీ వేల కోట్లే నాయే.  

ఇప్పుడు జీయర్ సామి  తెలంగాణ కల్చర్ నే అవమానిస్తుంటే చర్యలు తీసుకోరా?
మేక మాంసం, పంది మాంసం తినే వాళ్ళను ఏమెమో ఆంటివీ, నచ్చ చెప్పుడు లేకపోగా అవమానిస్తివి .

మా తెలంగాణ తాత నీ మాయలో పడి పాయే....
సంప్రదాయాల వలువలు పీకేస్తున్న కళ్ళప్పగించి చూస్తుండి  పాయే. నువ్వాడినది ఆట, పాడింది పాట. 

నరనరాల్లో పెనవేసుకు పోయిన యాదగిరిగుట్ట పేరును చరిత్ర శిధిలాల్లోకి నెట్టేసి, గుట్ట పేరు మార్చి  యాదాద్రిగా మార్చేస్తివ....వేల సంవత్సరాల యాదగిరి పేరు కనుమగయ్యే. 

తరతరాల భద్రాచలం రాముడిని రామనారాయణుడుగా మార్చి సీతారామ కళ్యాణంలో ప్రవరలు మారిస్తివి...

జనాలను ఎర్రి వెధవల  చేస్తున్నా అనుకుంటున్నావు  సామీ.. 
నీకిది తగదు. 
నీ పూర్వాశ్రమాన్ని గెలుకు తున్నారు. తగ్గు సామీ. తగ్గు. ఆల్లు తగ్గుతారు. 

మత పెద్ద హుందాతనం కాపాడురీ. 

                                                                               ......PENDYALA VASUDEVARAO.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Comments

Popular posts from this blog

82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

36.(SOCIAL-36) MUST RETHINK ABOUT VIP SYSTEM IN INDIA.

50. (ఖమ్మం చరిత్ర-2) ఉద్యమాల గుమ్మం విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం.