84. (SOCIAL...56). అంబానీ ఇంట్లో పెళ్లి.. నీకూ, నాకూ ఎందుకీ లొల్లి...
ఈ మధ్యన సోషల్ మీడియాలో "ప్రేమ్ టాక్స్" వీడియో చూశా. వెంటవెంటనే మరెన్నో వీడియోలు చూసే భాగ్యం కలిగింది. వాటి సారాంశం చూశాక నా అభిప్రాయం చెప్పాలనిపించింది.
ఈ మధ్యనే అంబానీ ఇంట్లో ఆయన కొడుకు పెండ్లి జరిగింది. తనకు కావలసిన వారిని తాను పిలుచుకున్నాడు. వచ్చినవారికి తనకు నచ్చిన రీతిలో బహుమతులు ఇచ్చి సత్కరించుకున్నాడు. ప్రపంచస్థాయి కళాకారులను, నిష్ణాతులను పిల్చి అధ్భుత కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారిస్థాయిలో వారికి పారితోషికాల ఇచ్చాడు. తాను కస్టపడి, తన తెలివి తేటలతో, శక్తి యుక్తులతో శ్రమను ధారపోసి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకొని సంపాదించుకున్న సంపాదనలోంచి తాను ఖర్చు పెట్టాలనుకున్నంత కొడుకు వివాహానికి ఖర్చు పెట్టుకున్నాడు.
ఆయన ప్రాధమిక హక్కులలో మన జోక్యం ఏమిటి?. ఆయన తన కుమారుని పెళ్ళిలో తాను ఖర్చుచేసిన విధానంపై మనకు అభ్యంతరం ఏమిటి?. ఈ విరుచుకుపడటాలు, అక్కసు వెళ్ళ గక్కటం ఏంటీ?
నాకు చాలా విచిత్రం అనిపించింది.
తన తండ్రి "బ్రిటిష్ షెల్" అనే ఇంధన కంపెనీలో 300 రూ.ల జీతంతో పనిచేసిన సాధారణ వ్యక్తి. చాలా క్రిందిస్థాయి నుండి పైకెదిగి తన వ్యాపారసామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఆయన మరణానంతరం ఆ వ్యాపారసామ్రాజ్యంలో వారసత్వంగా తనకు వచ్చిన వాటా దిన,దిన ప్రవర్ధమానం చెందుతూ ఆసియా ఖండంలోనే కుబేరుడుగా స్థానం సంపాదించాడు. ప్రపంచ స్థాయి కుబేరులలో ఒకరుగా నిలిచాడు. అతని ఇంట్లో ఇది ఆఖరు పెండ్లి. ఎవ్వరి ఇంట్లో ఎవ్వరు ఖర్చుపెట్టకుండా వుంటారు. మనకంటే ముందు తరాల వాళ్ళు ఆర్ధిక స్థోమత లేకున్నా వున్న ఆస్తులన్నీ అమ్మి లేదా అప్పులు చేసి ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేసి అప్పుల పాలై, క్రుంగి కృశించి పోవటం మనకు తెలీదా? హిందూ వ్యవస్థలో పెళ్ళిళ్ళు అలానే వుంటాయి. అప్పులపాలై ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేసే మామూలు సగటు మనిషితో పోలిస్తే ఇదేమి పెద్దవిషయం కాదు. ఆయన చేసిన ఖర్చులకు మీ అనుమతి కావాలా? లేనోడే అప్పులు చేసి ఎంతో గ్రాండుగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కొన్ని కోట్ల మందికి తన వ్యాపార సామ్రాజ్యం ద్వారా ఉపాధి కల్పించి కంపెనీలు పెట్టి సంపాదించుకొని వాళ్లకుటుంబంలో ఒక వివాహాన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటే మనం అతనిమీద పది ఏడవటం ఎందుకు?
తన సొమ్మును తాను ఖర్చు పెట్టాడు. ఎవ్వరినీ మోసం చేయలేదే! అష్ట ఐశ్వర్యాలు వాళ్ళ సొంతం. రేపు మీ పాపకు గానీ, బాబుకు గానీ పెళ్లి, పేరంటాలకు మీరు ఖర్చుపెట్టరా? మీ స్తోమతకు తగ్గట్లు కొత్త బట్టలు కొని కట్టుకోరా? మీ ఆడవాళ్ళు నగలు పెట్టుకోరా?
బీదవారు వేలరూపాయల్లో, మధ్యతరగతివారు లక్షలరూపాయాల్లో, ధనవంతులు కోట్లరూపాయల్లో మరియు అంబానీలాంటి వాళ్ళు తమడబ్బు ఎంతైనా ఖర్చుచేస్తారు. ఎంత చెట్టుకుకు అంత గాలి. మన స్థాయికి మనం ఎలా చేస్తామో వాళ్ళ స్థాయికి వాళ్ళు అలా చేస్తారు.
వాళ్ళ స్థోమతుకు తగ్గట్లు వాళ్ళు ఖర్చుచేసుకున్నారు. వాళ్ళ స్తోమతకు తగ్గట్లు వాళ్ళు, వాళ్ళ సంతోషాలు తీర్చుకుంటారు. తప్పులేదు. తప్పని చెప్పే హక్కు మనకు లేదు. ఆ ఖర్చు అంతా వేస్టు అనటంలో అర్ధంలేదు. ఈ వివాహ సందర్భంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల కుటుంబాలు జీవితాలు బాగుపడ్డాయి. కోడలు చీర ఖరీదు, పెళ్లి కొడుకు కట్టుకున్న షార్వాణీ ఖరీదు 1600 కోట్ల రూపాయాలట, బంగారు, వజ్ర వైడూర్యాలతో పొదిగిన నగలు వేసుకున్నారట. ప్యాంటుకు ఎంత అయింది, శుభలేఖకు ఎంత అయింది, డెకరేషన్ కు ఎంత అయింది, మెటీరియల్స్ కు అంత ఖర్చా...ఇదంతా వేస్ట్ అంటారు. ఈ ఖర్చు చేసే బదులు ఈ సొమ్మంతా జనాలకు పంచిపెట్టాలంటారు.
Why waste? It's their money, they will spend the way they want. we all want to enjoy our life with what we earn, they are celebrating their life as per their wish, who are we to sit and talk shit about them.
అంతే కాకుండా పెళ్ళికి ఖర్చుచేసిన సొమ్ములో ఎక్కువశాతం ఎంతోమందికి సంపాదనగా మారింది. ఎంత ఎక్కువ ఖర్చుపెడితే అంత ఎక్కువ మందికి సొమ్ము చేరుతుంది. ప్రతి ఖర్చుకు జీ.ఎస్.టీ ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. ఈ ఖర్చు అంతా స్వదేశంలోనే జరగటం వల్ల ఈ డబ్బంతా మన దేశంలోనే వుంటుంది. అంబానీ ఈ రకంగా ఖర్చు చేయటం, వారి స్థాయిలో ఎంజాయ్ చేయటం దేశద్రోహం కాదు. ఒక తండ్రి తన కొడుపై చూపించిన ప్రేమ అది. నీ విమర్శ అతనీపై నీకున్న కసిని తెలుపుతుంది.
మనం మన సొమ్ములో ఒక్క రూపాయి అయినా మనం ఎవ్వరికైనా ఇస్తున్నామా? ఇస్తామా? ఈ పెళ్లి సమయంలో అంబానీ 50 మంది బీదవారికి వివాహాలు జరిపించాడు. 50 రోజులు రోజుకు 9000 మందికి అన్నదానం చేశాడు. వాళ్ళ ఇంటిపెళ్లి ఎన్ని వేలమందికి పనికల్పించిందో తెలుసా?తిండి పెట్టిందో తెలుసా? మేరేజ్ ఎవెంట్స్ పై ఆధారపడి బతికే వేలమందికీ ఈ వివాహం ద్వారా ఉపాధి లభించింది. సూక్ష్మంగా చెప్పాలంటే సామాన్యులలో పూలు అమ్మేవారికీ.. ఆకులు ఎత్తే వారి వరకూ ఎందరెందరికో ఉపాధి.
అస్సలు ఆయన ఆస్థి ఎంతో తెలుసా? 4.30 లక్షల కోట్ల రూపాయల ఆస్థులకు అధిపతులు. ఆయన తన ఇంట్లో ఆఖరుపెండ్లికి కొడుకు కోసం పెట్టిన ఖర్చు 0.5% అతని ఆస్తిలో. వున్నవాడు వున్నట్లు వాళ్ళ స్టేటస్ కు తగ్గట్లు చేయడంలో తప్పేమీ లేధు. జయలలిత పెంపుడు కొడుకు పెళ్లి, గాలి జనార్ధన్ రెడ్డి ఇంట్లో చేసిన పెండ్లి, బీ. జె. పీ జాతీయ నాయకుడు రాజ్ నాథ్ సింగ్ ఇంట్లో జరిగిన పెండ్లి మరియు ఈ మధ్యనే మా ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో జరిగిన ఆయన కుమార్తె పెండ్లి వారివారి స్టేటస్ లకు తగ్గట్లు జరిగాయి. చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి.
మీరు ఒక విషయాన్ని గమనించటం లేదు.
అంబానీగారు తన ఇంట్లో వివాహానికి ప్రపంచ వ్యాప్తంగా తనకు సంబంధించిన వ్యక్తులను. రాజకీయ, వ్యాపార దిగ్గజాలను మరియు సెలబ్రిటీలను ఆహ్వానించటం ద్వారా మన సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశాలకు చూపటమే కాకుండా భారతీయ వివాహ బంధాన్ని అధ్భుతంగా వారు చూపెట్టారు. వీణానాదం, కూచిపూడి, భారతనాట్యం నృత్య ప్రదర్శనలతో మన కళారంగాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించారు. ఒక భారతీయుడుగా భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్ళే అధ్భుత కార్యక్రమాన్ని తమ ఇంటిలో చివరి వివాహావేదిక ద్వారా తెలియజేయటం గొప్ప విషయం. జరిగిన వివాహం హిందూ సాంప్రదాయంలో వైభవంగా జరిగినది. ప్రతి ఒక్క అతిధిని గౌరవించే విధానం భారతీయ అతిధి మర్యాదనలను ప్రపంచదేశాలకు తెలియచేసింది.
అంబానీ చేసిన పొరపాటు ఏమిటంటే .. తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లు ...
ఆయన ఇంట్లో పెళ్లి ముందర జియో రీఛార్జ్ ధరలు పెంచకుండా వుండవలసినది. ఆ ఛార్జీలు ఏవో పెళ్లి తరువాత పెంచితే "జియో" వినియోగదారుల్లో ఇంత ఆగ్రహం, ఆక్రోశం లేకుండా వుండేది.
అయినా జియో నెట్వర్క్ మాత్రమే వాడాలని నిర్బంధం ఏమైనా వుందా? లేదుకదా! ధరలు పెరిగాయి, పెంచారు అనుకుంటే వేరే నెట్వర్క్ లోకి మారే స్వేచ్చ మనకు వుందికదా. ఎయిర్టెల్, ఐడియా కూడా పెంచాయి కదా, వాటిపై వ్యతిరేకత ఎందుకు లేదు? అంబానీ నెట్ ను సామాన్యుల చెంతకు చేర్చాడు.ఉచితంగా కొంతకాలం ఇచ్చాడు.మొబైలు ఫోన్ ను ప్రతి పల్లెకు చేరేటట్లు శ్రమించాడు. 2G నుండి 4G మరియు 5G కు సాంకేతికతను పెంచి జనాలకు సేవలందించాడు.
అంబానీ సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతో కొడుకు పెండ్లి చేస్తే వీడికేం పుట్టింది.. డబ్బు వుందిగా ఖర్చు పెట్టుకోలేడా .. పొయెప్పుడు కట్టుకుపోతాడా .. కొడుక్కు వివాహానికి ఘనంగా ఖర్చు చేయకూడదా ....అని మనమే అంటాం.
అందుకే .. నెగిటివ్ ఆలోచనలు మానండి.
అనంత అంబానీ, రాధికా దంపతులను ఆశీర్వదించండి. విమర్శలు మానండి.
------- పెండ్యాల వాసుదేవ రావు .
<script async src="https://fundingchoicesmessages.google.com/i/pub-1447880810215412?ers=1" nonce="BDKM9oEoU_MCwJ721WC3Lg"></script><script nonce="BDKM9oEoU_MCwJ721WC3Lg">(function() {function signalGooglefcPresent() {if (!window.frames['googlefcPresent']) {if (document.body) {const iframe = document.createElement('iframe'); iframe.style = 'width: 0; height: 0; border: none; z-index: -1000; left: -1000px; top: -1000px;'; iframe.style.display = 'none'; iframe.name = 'googlefcPresent'; document.body.appendChild(iframe);} else {setTimeout(signalGooglefcPresent, 0);}}}signalGooglefcPresent();})();</script>
Comments