Posts

Showing posts from 2024

84. (SOCIAL...56). అంబానీ ఇంట్లో పెళ్లి.. నీకూ, నాకూ ఎందుకీ లొల్లి...

Image
ఈ మధ్యన సోషల్ మీడియాలో "ప్రేమ్  టాక్స్" వీడియో  చూశా. వెంటవెంటనే మరెన్నో వీడియోలు చూసే భాగ్యం కలిగింది. వాటి  సారాంశం చూశాక నా అభిప్రాయం చెప్పాలనిపించింది. ఈ మధ్యనే అంబానీ ఇంట్లో ఆయన కొడుకు పెండ్లి జరిగింది. తనకు కావలసిన వారిని తాను పిలుచుకున్నాడు. వచ్చినవారికి తనకు నచ్చిన రీతిలో బహుమతులు ఇచ్చి సత్కరించుకున్నాడు. ప్రపంచస్థాయి కళాకారులను, నిష్ణాతులను  పిల్చి అధ్భుత కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారిస్థాయిలో  వారికి పారితోషికాల ఇచ్చాడు. తాను కస్టపడి, తన తెలివి తేటలతో, శక్తి యుక్తులతో శ్రమను ధారపోసి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకొని సంపాదించుకున్న సంపాదనలోంచి తాను ఖర్చు పెట్టాలనుకున్నంత కొడుకు వివాహానికి ఖర్చు పెట్టుకున్నాడు.   ఆయన ప్రాధమిక హక్కులలో మన జోక్యం ఏమిటి?. ఆయన తన కుమారుని పెళ్ళిలో తాను ఖర్చుచేసిన విధానంపై మనకు అభ్యంతరం ఏమిటి?. ఈ విరుచుకుపడటాలు, అక్కసు వెళ్ళ  గక్కటం ఏంటీ? నాకు చాలా విచిత్రం అనిపించింది.   తన తండ్రి "బ్రిటిష్ షెల్" అనే ఇంధన కంపెనీలో 300 రూ.ల జీతంతో పనిచేసిన సాధారణ వ్యక్తి. చాలా క్రిందిస్థాయి నుండి పైకెదిగి తన వ్యాప...

83. NKP.. (17). ప్రభుత్వాలు మారినా..విధానాలు మారవా?

  ప్రభుత్వాలు మారినా విధానాలు మారవా? ప్రజల తలరాత మారదా? నేలకొండపల్లి మండల బస్సు ప్రయాణీకుల బాధలు ఎవ్వరికీ పట్టవా? ఆర్.టీ.సీ బస్సు స్టాండ్ ను నేలకొండపల్లి గ్రామంలో 1990 ఏప్రిల్ నెలలో అప్పటి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ జీ.వీ.సుధాకరరావు ప్రారంభించారు.  అప్పటి సర్పంచ్, స్వాతంత్ర సమర యోధులు శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు. ఈ బస్సు స్టాండ్ ఆనాడు, ఈనాడు పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో వున్న ఏకైక బస్సు స్టాండ్. రెండెకరాల సువిశాల విస్తీర్ణంలో వుంది. ఆ స్థలానికి రక్షణ లేకుండా పోతోంది. విలువ కోట్ల రూపాయల్లో వుంది. నియోజకవర్గంలో వున్న ఏకైక బస్సు స్టాండ్ ను కూడా సంరక్షించ లేరా? వినియోగంలోకి తేలేరా? 11 సంవత్సరాలనుండి నేలకొండపల్లి మండల ప్రజలు బస్సుల నిరీక్షనకై రోడ్డుమీద ఎండకు, వానకు నిలబడి నానా యాతన పడుతున్నారు. స్త్రీలకు వాష్ రూం సౌకర్యం వద్దా? ముసలివారు, గర్భిణీలు, పసిపిల్లలు ప్రభుత్వాల తిట్టుకుంటూ తమ దురదృష్టానికి వాపోతున్నారు. విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. వికలాంగుల పరిస్థితి సరేసరి.  ప్రయాణీకుల అసౌకర్యాల తొలగిపుకై చర్యలు తీసుకోవాలని స్థానిక శాసన సభ్యులు మరియు రాష్ట్ర రెవ...

82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

ఖమ్మంకు  ఆత్మాభిమానం  లేదనుకున్నారా? లోకసభ ఎన్నికల బరిలో ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి. ఏవేవో కులాల కొట్లాటలు కనిపిస్తున్నాయి.  ఖమ్మం ఎన్నికల సమరాంగణములో ఏవేవో రాజకీయ మంత్రాంగాలు నడుస్తున్నాయి. ఖమ్మం ఆత్మాభిమానం ఎవ్వరికీ అక్కరలేదా ?. ఆత్మాభిమానం మంటగలుస్తున్నా . పౌరుషం ఆనవాళ్లు కనిపిస్తలే. ఖమ్మం ఉద్యమాల గుమ్మం. తెలుసా ఈ తరానికి? చరిత్ర ఎవ్వరైనా చెప్పారా? నాకు తెలిసి, ఉద్యమాలలో  కీలక స్థానాల్లోవుండి  త్యాగాలు చేసిన వారికో,  వారి కుటుంబ సభ్యులకో...  పార్టీ లోనో, ప్రభుత్వ, రాజ్యాంగ స్థానాలలోనో  ఉద్యమకారులకు, వాటి బాధితులకు అవకాశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళ బలిదానాలతో, ఆత్మార్పణతో ఏర్పడ్డ రాష్ట్రంలో మాది ఫక్తు రాజకీయ పార్టీ, ఇక్కడ మాకు అధికారంలోకి రావటమే మాలక్ష్యం ఉద్యమకారులతో, ఉద్యమంతో మాకు సంబంధం లేదు అని ప్రకటించడానికి ఉద్యమనాయకులకు న్యాయమా? అలా అన్నందుకు సిగ్గుపడాలి కదా! నైజాంపై పోరాటం సమయంలో, 1968 తెలంగాణా ఉద్యమ సమయంలో, 2000 సం.లో తర్వాత ప్రత్యేక తెలంగాణ పోరాటం సమయం ఉద్యమకారుల చూశాను. త్యాగాలు చేసిన వారికి ఎవ్వరికీ గుర్తింపులు ...