69. (NKP...12). ఖమ్మం జిల్లాలోని ఓ ఆర్ . టీ. సీ. బస్సు స్టాండు ....కధా.. మా వ్యధ..

ఖమ్మం లో ఓ ఆర్ . టీ.  సీ. బస్సు స్టాండు ....కధా.. మా వ్యధ.. 

హలో సార్లూ!
క్రింది మొదటి రెండు ఫోటోలు గుర్తుపడతారా?
ఎక్కడివో చెప్పగలరా?

ఈ మధ్య ఆర్.టీ. సి. పెద్దసారు సజ్జనారు సారూ నెటిజన్లను ఈ ప్రశ్నే అడుగుతే తడుముకోకుండా రాష్ట్రం నలుమూలలా వున్నోల్లంతా " ఖమ్మం బస్సు స్టాండు " అని చె ప్పేసినృ . బావుందని మెచ్చుకున్నరు.

ఏంది మరి? ఏమనుకున్నారు.

రాష్ట్ర రవాణా శాఖా మంత్రి నియోజకవర్గమా? మజాకా?

మా ఖమ్మం బస్సు స్టాండు ఎప్పుడూ అంతేనండి.
మీకో విషయం తెలుసా?

శ్రీ జలగం వెంగళరావు రాష్ట్ర ముఖ్యమంత్రి గా వున్నప్పుడు ఇప్పుడందరికీ తెలిసిన పాత బస్సు స్టాండు ను కట్టించాడు. అంతకు ముందు రైల్వే స్టేషను ప్రక్కన బస్సులు ఆగేవి. అదే బస్సు స్టాండు అప్పుడు. పెరిగే అవుసరాల కొసమని పెద్దది కట్టించినరు.
క్రింద ఫోటోనే ఆ బస్సు స్టాండు.



బస్సు స్టాండు ప్రారంభోత్సవానికి తరువాతి ముఖ్యమంత్రి శ్రీ మర్రిచెన్నారెడ్డి వచ్చింరు{1979 లో అనుకుంటా) . రిబ్బను కత్తిరించే ముందు బస్సు స్టాండును అంతా చూసి, చేతిలో వున్న కర్రను ఊపుతూ "ఖమ్మానికి ఇంత పెద్ద బస్సు స్టాండా?" అన్నాడండి.

నేను ప్రక్కనే వున్నా. ఖమ్మం ఎమ్మెల్యే అనంత రెడ్డి గారి ప్రక్కనే వున్నా. మా నాయనగారితో వెళ్లిన.
ఇంతకూ ఇదంతా ఎందుకంటే...మా ఖమ్మం బస్సు స్టాండు ఎప్పుడూ ప్రత్యేకతని కలిగి ఉంటుందని చెప్పటానికే....

మరి నేలకొండపల్లి బస్సు స్టాండు పాపం ఏంటండీ?


1989 లో శ్రీ జి.వి. సుధాకర రావు జిల్లా in-charge మంత్రి ప్రారంభం చేసినప్పటి నుండి ఈ రోజు వరకూ బస్సులు బస్సు స్టాండు లోకి పోవు. బస్సులకై జనాలంతా రోడ్డు మీదే పడిగాపులు. ముసలోళ్లు, పిల్లలు, పిల్లల తల్లులు, గర్భిణీలు, పేషెంట్లు, వికలాంగులు, విద్యార్థులంతా రోడ్డు మీదే.ఎండకు, వానకు.

ఇదేమి ఖర్మండీ బాబు?

నియోజక వర్గం "OC"(UN reserved) అవుతే బాగని, లోకలోల్లు వుంటే బావుంటదని కృషి చేశామాండి..
సరే. బయటోల్లు వస్తే వచ్చారు. అదృష్టం కొద్దీ మంత్రులయ్యారా... కనీసం మా బస్సు స్టాండు బాధలు నయం చేయలేదు. కన్నెత్తి చూడలా...

ఇక్కడో విశేషం వుందండోయ్!

పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం మీద వున్న ఏకైక బస్సు స్టాండ్ 30 సం. ల. క్రిందటనే కట్టారు. ఇప్పటివరకు ఇంకో చోట ప్రభుత్వం బస్సు స్టాండు కట్టలేదంటే నమ్మండి.

నియోజక వర్గాల పునర్విభజన(డీలిమిటేషను) జిల్లా కమిటీకి నేనే రథ సారధిని లేండి.ఢిల్లీ కూడా వెళ్ళా. కులదీప్ Singh గారితో కూడా కలిసినా. మూడేండ్లు కష్ట పడ్డా దీన్ని "OC" ను చేయటానికి. ఆశించిన ఫలితం దక్కినా నియోజక వర్గం లాభపడిందా? జనాలే చెప్పాలా!

బాధ నయం చేయకపోగా బస్సు స్టాండు బస్సు స్టాండు స్థలంలో కొంత (చాలా) కోత పెట్టి లీజు కిచ్చారు. మూసేశారు.

క్రింద వున్న చిత్రం. నేలకొండపల్లి బస్సు స్టాండ్ లేఔట్ మ్యాప్. ప్రస్తుతం బస్సు స్టాండ్ క్రింద వున్న స్థలము మరియు లీజుకు ఇచ్చిన స్థలముల కొలతలు క్రింది చిత్రంలో చూడవచ్చు.


అయ్యా ఎమ్మెల్యే గారూ, ఎంపీ గారూ, రవాణా మంత్రి గారూ జర ఇటు దృష్టి పెట్టరాదే..... పుణ్య ముంటాది.
బస్సు స్టాండ్ చరిత్ర కాస్త ఇనుకొరి, చెప్తా.

నేలకొండపల్లి మండల కేంద్రంలో వున్న APSRTC బస్సు స్టాండ్ ఆవరణ నిరుపయోగంగా వున్నదని భావించి ఖమ్మం రీజినల్ ఆర్టీసీ విభాగము వారు, ఉపయోగం లోకి తేవటానికి చర్యలు వదిలేసి, తేదీ: 06.05.2013 నుండి తేదీ: 05.05.2023 వరకు ఒక ప్రైవేటు వ్యక్తికి పది సంవత్సరాలకు ఫంక్షన్ హాల్ నడుపటానికి లీజుకు లైసెన్స్ (నెలకు రూ. 5000/- తరువాత దఫా, దఫాలు నిర్దేశిత పెంపుతో) ఇవ్వటం, తరువాత ప్రయాణీకుల విజ్ఞప్తి, నాయకుల జోక్యంతో ఇదివరకు కాంట్రాక్ట్ ఒప్పందం లో వున్న నిబంధనల మేరకు స్థలం వేకెట్ చేయటానికి, లీజు రద్దు notice ను సంబంధిత అధికారులు లీజుకు తీసుకున్న వ్యక్తికి పంపారు. లీజుకు తీసుకున్న లైసెన్స్ దారుడు తాను ఇప్పటికే రూ.50,00,000 లు ఖర్చు చేశానని కోర్టు మెట్లు ఎక్కి, తనకు న్యాయం చేయమనగా మళ్లీ ఇంకొక కొత్త యెగ్రిమెంట్ తో ఒప్పందం చేసుకున్నారు.
దాని తాలూకు బస్సు స్టాండ్ ప్లాన్ పైన ఇవ్వటం జరిగింది. దాని ప్రకారముగా కూడా తేదీ: 05.05.2023 న లీజుకు తీసుకున్న బస్సు స్టాండ్ ప్రాంగణంలోని స్థలాన్ని ఓపెన్ గా (నిర్మాణాలు తీసేసి) అప్పచెప్పాలి. ఎప్పుడైనా బస్సు ప్రయాణీకుల కష్టాలు తొలగుతాయని తలుస్తాము.

సజ్జనారు (TSRTC MD) సారూ!

తెలంగాణా పల్లెలలో చాలాచోట్ల ఇప్పటికీ బస్సు స్టాండులు లేవు. ఎప్పుడో దశాబ్దాల క్రింద మేము కస్టపడి తెచ్చుకున్న బస్సు స్టాండును, పక్కా భవన సముదాయాన్ని రోడ్డు రవాణా సంస్థ చిన్న చూపు చూస్తోంది. మా బస్సు స్టాండ్ లీజు కాన్సెల్ చేసి ప్రయాణీకుల కస్టాలు తీర్చండి మహాప్రభూ !

బస్సు ప్రయాణీకుల అవస్థల గమనిస్తారు అని ఆశ. ప్రజాగ్రహాన్ని గుర్తిస్తారు అని ఆశ.
----పెండ్యాల వాసుదేవరావు.
Vasudeva Rao Pendyala

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Comments

Popular posts from this blog

82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

78. (social...51). ఎవవరెవరో ఎక్కడినుండో వస్తారు..... ఆలోచించండి ప్రజలారా...

80. (SOCIAL--53) దేశంలో ప్రజా సేవ ఇంత Costly నా? ఎవ్వరికీ బాధ్యతలు లేవా?