Posts

Showing posts from June, 2024

83. NKP.. (17). ప్రభుత్వాలు మారినా..విధానాలు మారవా?

  ప్రభుత్వాలు మారినా విధానాలు మారవా? ప్రజల తలరాత మారదా? నేలకొండపల్లి మండల బస్సు ప్రయాణీకుల బాధలు ఎవ్వరికీ పట్టవా? ఆర్.టీ.సీ బస్సు స్టాండ్ ను నేలకొండపల్లి గ్రామంలో 1990 ఏప్రిల్ నెలలో అప్పటి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ జీ.వీ.సుధాకరరావు ప్రారంభించారు.  అప్పటి సర్పంచ్, స్వాతంత్ర సమర యోధులు శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు. ఈ బస్సు స్టాండ్ ఆనాడు, ఈనాడు పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో వున్న ఏకైక బస్సు స్టాండ్. రెండెకరాల సువిశాల విస్తీర్ణంలో వుంది. ఆ స్థలానికి రక్షణ లేకుండా పోతోంది. విలువ కోట్ల రూపాయల్లో వుంది. నియోజకవర్గంలో వున్న ఏకైక బస్సు స్టాండ్ ను కూడా సంరక్షించ లేరా? వినియోగంలోకి తేలేరా? 11 సంవత్సరాలనుండి నేలకొండపల్లి మండల ప్రజలు బస్సుల నిరీక్షనకై రోడ్డుమీద ఎండకు, వానకు నిలబడి నానా యాతన పడుతున్నారు. స్త్రీలకు వాష్ రూం సౌకర్యం వద్దా? ముసలివారు, గర్భిణీలు, పసిపిల్లలు ప్రభుత్వాల తిట్టుకుంటూ తమ దురదృష్టానికి వాపోతున్నారు. విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. వికలాంగుల పరిస్థితి సరేసరి.  ప్రయాణీకుల అసౌకర్యాల తొలగిపుకై చర్యలు తీసుకోవాలని స్థానిక శాసన సభ్యులు మరియు రాష్ట్ర రెవ...