74. (Social..47). విలీనామా? విమోచనా? విద్రోహమా?.. ఈ సందిగ్ధత ఎందుకొచ్చింది?
వందల సంవత్సరాల బానిసత్వం నుండి, ఎన్నోవేల జనాల బలిదానాల ఫలితంగా వచ్చిన హైదరాబాద్ రాష్ట్రఅవతరణ తేదీని ఉత్సవంగా జరుపుకొనే రాత/అదృష్టం తెలంగాణ ప్రజలకు లేకుండా పోయింది. 1). ఏ నిజాంరాజుకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటంచేశారో, ఆ నిజాంరాజు "ది గ్రేట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ ఆఫ్ దక్కన్" మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ చేతుల మీదుగా నూతనంగా ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయవలసిన దుస్థితి రావటం నా మనసును కలచి వేసింధి. "మా నైజాం రాజు తరతరాల బూజు" అన్న స్వాతంత్ర సమర యోధులే ఆ రోజు నిజాం ముందు నిలుచుని అభినందించవలసిన స్థితి. ఇండియా ప్రభుత్వం హైదరాబాద్ దక్కన్ పై చేపట్టిన "ఆపరేషన్ పోలో " విజయవంతం అయి మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ లొంగిపోయినా ఆయనని పజల అభీష్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్ర "రాజ్య ప్రముక్ః " గా ఎందుకు ప్రకటించవలసి వచ్చిందో ఆనాటి సర్దార్ వల్లభాయి పటేల్ మరియు జవహర్లాల్ నెహ్రూలకే ఎరుక. ఆనాడు ఇండియాలో విలీనమైన వందల సంస్థానాలలో దేనికీ ఇవ్వని ప్రత్యేకత ఈ సంస్థానంలోనే ఎందుకు? విలీనానికి ఆయనేమీ ఇండియాతో పోరాటం చేయలేదే! పోరాటము చేసి సంధి కుదుర్చుకోలేదే! రాజీపత...