65. (SOCIAL-45) వస్తుందా మార్పుకు అవకాశం.
ఏమవుతుంది నా దేశం
వస్తుందా
మార్పుకు కోరుకున్న అవకాశం
డెబ్బది మూడు సంవత్సరాల వయస్సులో
నా దేశ ప్రజాస్వామ్యం
జాగ్రత్త గా
చూసుకోవాలి పాపం
అడుగులు తడపడు తున్నవి
చరిత్ర పై మతిమరుపులు వస్తున్నవి
జాగ్రత్త గా
చుసుకోవలసింది వారి వారసులే
వారే ఓటర్లు
మరేమో
వారే
మైకంలో వున్నారు
డబ్బు మత్తులో తూలుతున్నారు
ఓటుకు నోటును అడుగు తున్నారు
మాటకు విలువ లేదు
మూటకు ఆకర్షితులు అవుతున్నారు
రోగం నయం చేసే డాక్టర్ లేదు
రోగం మాయం చేసే రాజకీయ పార్టీ లేదు
నవతరానికి దిశా నిర్దేశం లేదు
ఐ. సి.యు లో ప్రజాస్వామ్యం
ఎన్నికల ఆసుపత్రి లో
లేనేలేదు కావలసిన ఆక్షిజన్
ఆక్షిజన్ అందే దేట్లా?
ప్రజాస్వామ్యం కోలుకొనే దేట్లా?
రోజుకు రెండు రూపాయలకు
ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెడుతున్నారు
టోటల్ గా ఒక వేయి రూపాయలకే
బ్రతుకును ఖూనీ చేస్తారా
ప్రజాస్వామ్య రక్షణ నువ్వు మరుస్తే
సమాజం వృద్ధాశ్రమంలోనికి నిన్ను మారుస్తే?...
నీ జీవితం దుర్భరమే
-----పెండ్యాల వాసుదేవరావు.
29.01.2019.
3.45. AM.
<!-- Google tag (gtag.js) -->
<script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script>
<script>
window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());
gtag('config', 'G-1M93C8YK91');
</script>-----పెండ్యాల వాసుదేవరావు.
29.01.2019.
3.45. AM.
Comments