57. (ఖమ్మం చరిత్ర-5) నైజాం సంస్థానంలో CPI ఆవిర్భావం -- పరిణామాలు.
నైజాం సంస్థానంలో CPI పార్టీ ఆవిర్భావం - తదనంతర పరిణామాలు. CPI పార్టీ బ్రిటిష్ ఇండియాలో 1925 సంవత్సరంలో కాన్పూర్లో అధికారికంగా ప్రారంభించ బడినది. అంతకుముందు తాష్కెంట్లో 1920 సంవత్సరంలో పార్టీమేనిఫెస్టోను తయ్యారుచేశారు. CPI వ్యవస్థాపకులు శ్రీ మానవేంద్ర నాథరాయ్ అనే విషయం గమనార్హం. 1934 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగం అయిన ఆంధ్రఏరియాలో CPI పార్టీ ఆంధ్ర ప్రొవిన్సియల్ కమిటీ పేరిట ఆవిర్భవించింది. 1940 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియాలో కమ్యునిస్ట్ పార్టీని నిషేధించారు. 1939 సంవత్సరంలో నైజాం సంస్థానంలో CPI పార్టీ ఆవిర్భవించింది. అప్పట్లో నైజాంకు వ్యతిరేకంగా గ్రంధాలయోద్యమంతో పాటు 1). కామ్రేడ్స్ అసోసియేషన్, 2), ఆంద్ర మహాసభ, 3). మహారాష్ట్ర పరిషద్ మరియు 4). వందేమాతరం పేరిట కార్యక్రమాలు నడుస్తుండేవి. వీటిలో గ్రామీణ ప్రాంతాలలో ఆంద్రమహాసభ కార్యక్రమాల ప్రభావం ఎక్కువగా వుండేది. ఆంద్రమహాసభలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు, కామ్రేడ్స్ అసోసియేషన్ లో శ్రీ ముఖ్దూం మొహియుద్దీన్, వందేమాతరంలో శ్రీ సర్వదేవభట్ల రామనాధం లాంటి సోషలిస్ట్ ఆలోచనా విధానం కలిగిన యువకులు చురుకుగా వుండేవాళ్ళు. ఆ...