Posts

Showing posts from April, 2024

82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

ఖమ్మంకు  ఆత్మాభిమానం  లేదనుకున్నారా? లోకసభ ఎన్నికల బరిలో ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి. ఏవేవో కులాల కొట్లాటలు కనిపిస్తున్నాయి.  ఖమ్మం ఎన్నికల సమరాంగణములో ఏవేవో రాజకీయ మంత్రాంగాలు నడుస్తున్నాయి. ఖమ్మం ఆత్మాభిమానం ఎవ్వరికీ అక్కరలేదా ?. ఆత్మాభిమానం మంటగలుస్తున్నా . పౌరుషం ఆనవాళ్లు కనిపిస్తలే. ఖమ్మం ఉద్యమాల గుమ్మం. తెలుసా ఈ తరానికి? చరిత్ర ఎవ్వరైనా చెప్పారా? నాకు తెలిసి, ఉద్యమాలలో  కీలక స్థానాల్లోవుండి  త్యాగాలు చేసిన వారికో,  వారి కుటుంబ సభ్యులకో...  పార్టీ లోనో, ప్రభుత్వ, రాజ్యాంగ స్థానాలలోనో  ఉద్యమకారులకు, వాటి బాధితులకు అవకాశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళ బలిదానాలతో, ఆత్మార్పణతో ఏర్పడ్డ రాష్ట్రంలో మాది ఫక్తు రాజకీయ పార్టీ, ఇక్కడ మాకు అధికారంలోకి రావటమే మాలక్ష్యం ఉద్యమకారులతో, ఉద్యమంతో మాకు సంబంధం లేదు అని ప్రకటించడానికి ఉద్యమనాయకులకు న్యాయమా? అలా అన్నందుకు సిగ్గుపడాలి కదా! నైజాంపై పోరాటం సమయంలో, 1968 తెలంగాణా ఉద్యమ సమయంలో, 2000 సం.లో తర్వాత ప్రత్యేక తెలంగాణ పోరాటం సమయం ఉద్యమకారుల చూశాను. త్యాగాలు చేసిన వారికి ఎవ్వరికీ గుర్తింపులు ...