62. (SOCIAL-41) మేధావులు కదలండయ్యా ....ఎన్నికల రంగలో పోగైన కలుపు ను తీసేద్దాం రండయ్యా...
మేధావులు కదలండయ్యా ....ఎన్నికల రంగలో పోగైన కలుపు ను తీసేద్దాం ..రండయ్యా... ఒకప్పుడు నాయకుడంటే ప్రజల్లోంచి వచ్చేవాడు, ప్రజల కోసం బ్రతికే వాడు. ప్రజలకోసం ఆస్తులు ధారపోసేవాడు. కుటుంబ జీవితాన్ని లెక్క జేయక ప్రజల కోసం పోరాటం చేసేవాడు. ఇచ్చిన మాటకోసం సమాజ సేవ కోసం నిరంతరం తపన పడేవాడు. ఎన్నికలొస్తే అయ్యా మీరే నిలబడండి మీమంతా మీపక్షమే నని జనాలు నాయకులకు చెప్పేవారు. నిజాయితీగా నాయకులు పదవులకు ఎన్నిక అయ్యేవారు. కానీ నేడో... తరాలు మారినయ్. ప్రజల మనస్తత్వాలు మారినవి. నాయకులను ఓటుకు నోటును ఓటర్లు అడుగు తున్నారు. నోటు లేనిదే పోలింగుకు రామంటున్నారు. మరికొందరైతే ఆ అభ్యర్ధి డబ్బులిచ్చాడు మీరెందుకు ఇవ్వరని రహదారులపై ధర్నాలకు దిగుతున్నారు. ఒకప్పుడు నయాపైసా ఆశించకుండా అభ్యర్ధులకు ఓట్లేసిన ప్రజలు కాసులకై కొట్లాడుతున్నారు. దేశంలోని అన్ని ప్రాంతీయ, జాతీయ రాజకీయ పార్టీలు (వామ పక్షాలకు ఇందులో మినహాయింపు లేదు) డబ్బులు పంచటంలో పూర్తిగా నిమగ్నమై దానితోనే గెలుపు గుర్రాల నేక్కాలని వువ్విళ్ళూరుతున్నారు. రాజకీయపార్టీలు ఎన్నికల అభ్యర్ధుల నిర్ణయంలో కోట్ల రూపాయలను లంచంగా తీసుక...