Posts

Showing posts from March, 2020

68. (NKP-11). పాత కట్టడాల కూల్చి వదిలేస్తే అభివృద్ధి అయిపోతుందా? ఈ జన్మస్థల ప్రాంగణానికి అధీకృత నిర్వాహకులు ఎవ్వరు?

Image
నేలకొండపల్లి లోని శ్రీ  భక్తరామదాసు జన్మస్థలంలో అభివృద్దికి ప్రభుత్వ యంత్రాంగం శ్రీకారం చుట్టారు. సంతోషమే. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే.సి.ఆర్ గారికి అభివందనాలు. ఎవ్వరు చేయని పని మీరు చేశారు.రెండోసారి బంగారు తెలంగాణా ఏర్పడ్డ తరువాత ఖమ్మం జిల్లా పాలనాధికారి పేరిట మూడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. శ్రీ భక్తరామదాసు జన్మస్థల ప్రాంగణంలో వున్న కంపౌండు గోడలను కూలగొట్టి, అంతకు ముందే మందిరం లోపల వున్న ఏకశిలా తెల్లరాతి విగ్రహానికి అదనంగా వేరొక విగ్రహాన్ని ఆరుబయట స్థాపిస్తే, కల్యాణమంటప నిర్మాణం చేపడితే అది అభివృద్ధిలో భాగమా?  అసలు జనాల కోరిక లేమిటి? జన్మస్థలంపై  ఆశలేమిటి? ప్రభుత్వానికి మార్గధర్శకులెవ్వరు? వాటి/వారి  చట్టభద్దత ఎంతవరకు?  ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము ఖర్చు ఎలా చెయ్యాలో నిర్దేశించిన వారెవ్వరూ? ప్లాన్ తయ్యారీదారులెవ్వరు? జన్మస్థల  ప్రాంగణానికి నాధుడెవ్వరు, అమ్మా, అయ్యా  ఎవ్వరు? అదేమి ఖర్మమో తెలీదుకానీ రాష్ట్రప్రభుత్వ గెజిటు నోటిఫికేషన్ రాకపూర్వమే అప్పటి రాష్ట్రమంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు స్థానిక శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అభివ...