63. (SOCIAL-42) ప్రశ్నించే గొంతు కావాలి. నిలదీసే దమ్ము ఉండాలి.
ఎవ్వరు బాధ్యులు? ఒక రాజకీయపార్టీ టికెట్ పై, ఒక సిద్దాంతం పై ఎం.ఎల్.ఏ గా పొటీ చేసి గెలిచి, మరో రాజకీయ పార్టీ లోకి వలస వెళుతున్న ఎం.ఎల్.ఏ లను నిలదీసే హక్కు ఎవ్వరికుంది? ఆ నైతిక హక్కు ఎవ్వరికుంది? తమకోసం అహర్నిశలు పనిచేసే కార్యకర్తల గాలికొదిలేసి కాంట్రాక్టర్లకు, పారిశ్రామికవేత్తలకు డబ్బుకు కక్కుర్తిపడి పార్టీ టికెట్లను అమ్ముకుంటున్న బాధ్యతారహిత రాజకీయ పార్టీల నేతలది కాదా తప్పు? ప్రజాప్రతినిధి గా ఎన్నిక కావటానికి “బి” ఫోరం ఇచ్చిన రాజకీయ పార్టీ కుందా? డిమాండ్ చేసి, ధర్నాలు చేసి మరీ పోటీచేసే అభ్యర్థుల దగ్గర డబ్బులు గుంజుకుంటున్న ఓటర్ల కుందా? సమాజాన్ని ప్రశ్నించే మీడియాకు ఓటర్ల ను ప్రశ్నించే దమ్ముందా? ప్రశ్నించే దమ్ము ఓటు వేసే సామాన్యులకు రావాలంటే ఏమి చేయాలి? ఈ పరిణామానికి బాధ్యత ఎవ్వరిది? అవినీతి ప్రపంచంలో ఈదుతున్న రాజకీయ పార్టీలదా? డబ్బు మత్తులో జోగుతున్న ఓటర్లదా? ప్రజాస్వామ్య దేశంలో వారసత్వ రాజకీయ సంస్కృతికి , నామినేటేడ్ సంస్కృతికి తప్ప కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు లేని రాజకీయ పార్టీ...