Posts

51. (ఖమ్మం చరిత్ర-3) నిజాం వ్యతిరేక పోరాటం తరువాత ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్ర?

Image
నిజాం వ్యతిరేక పోరాటం తరువాత ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్ర. ప్రతీ తరానికి, వెనుక తరం చరిత్ర తెలుసుకోవాలని కుతూహలము వుంటుంది. అందులోను ప్రభుత్వాలు మన పిల్లలకు చరిత్ర పాఠాల భోధనలను చాలా వరకు చదువులో భాగంగా పెట్టారు. రాయని చరిత్ర గురించి కుతూహలం ఇంకా అధికంగా వుంటుంది. మా ఖమ్మం చరిత్ర ఇంత వరకు అముద్రితం. రాయని చరిత్ర పై ఎన్నెన్నో ప్రశ్నలు. మాతరం అడగని ప్రశ్నలు. ఈ తరానికి తెలీని సమాధానాలు. 1952 సంవత్సరంలో వేమ్సూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు పై పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి ఇండిపెండెంట్ గా అసెంబ్లీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన శ్రీ జలగం వెంగళ రావును  కాంగ్రెస్ పార్టీ ఆరు సంవత్సరాలు బహిష్కరించింది. ఆయన బహిష్కరణ సమయం పూర్తి కాకుండానే 1957 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆయన తమ్ముడు శ్రీ జలగం కొండలరావు కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసి ఎలా MLA అయ్యాడు? అసలు టికెట్ ఎలా వచ్చింది? అప్పటి వరకు శ్రీ జలగం వెంగళరావు జిల్లా నాయకత్వ హోదాలో లేడు. నిషేధ కాలం పూర్తి కాగానే ఖమ్మం DCC PRESIDENT ఎలా అయ్యాడు? తరువాత వెంటనే జిల్లా పరిషత్ PRESIDENT గా ఎలా ఎ...

50. (ఖమ్మం చరిత్ర-2) ఉద్యమాల గుమ్మం విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం.

Image
ఉద్యమాల గుమ్మం విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం. క్రింది చిత్రం నేలకొండపల్లిలోని శ్రీ విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం. ఈ చిత్రంలో 1935 సంవత్సరంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం ముందర జనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. నడుమ మీద చేయివుంచి మాట్లాడుతున్న వ్యక్తే శ్రీ పెండ్యాల. ఈయనకు ఎడమ ప్రక్కన శ్రీ దుగ్గిరాల శ్రిరామయ్య.  ఈ గ్రంధాలయాన్ని 1912 సంవత్సరంలో స్థాపించారు. ఆనాటి గ్రామ పెద్ద్దలు శ్రీ పెండ్యాల వాసుదేవ సోమయాజులు తన ఆత్మీయ మిత్రుడు నేలకొండపల్లి గ్రామ కరణం/పట్వారి  శ్రీ రావులపాటి గోపాలరావు సహకారంతో గ్రంధాలయానికి శ్రీకారం చుట్టారు. శ్రీ వాసుదేవ సోమయాజుల గారి ఐదుగురు కుమారులు ఆ రోజులలో న్యాయవాద వృత్తిలోవుండేవారు. ఆయన పెద్ద బూస్వామి. బ్రిటిష్ ఇండియాలోని కృష్ణ, గుంటూరు జిల్లాలలో కూడా భూములు వుండేవి. ఆ ప్రాంతంలోని భూములకోసం తరచు ఆప్రాంతాలకు వెళ్ళుచుండేవాడు. ఆ ప్రాంతాల ప్రభావముతో ఆంధ్రభాషాభిమానం పట్ల ఆవిధంగా ఆకర్షించ బడ్డాడు. ఆ విధంగా ప్రభావితమైన భావజాలంతో తెలుగు/ఆంద్ర భాషా వ్యాప్తికై నడుం బిగించి ఈ గ్రంధాలయం ద్వారా కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఆనాడు అందుల...

49. SOCIAL-44) ) నాకు అన్నీ ప్రశ్నలే...జవాబులు లేవు...

Image
భరతమాత శిరోభారంకు మందే లేదా? అసలు మందివ్వా లానే జ్ఞానం ఎవ్వరికై నా ఉందా? నాకు అన్ని ప్రశ్నలే....ఎవ్వరి దగ్గర సమాధానం లభించలేదు.  ఈ తరానికైనా సమాధానం దొరికేనా? బ్రిటిష్ ఇండియాకు స్వతంత్రం ప్రకటించగానే దేశానికి పురిటి నొప్పు లెందు కొచ్చాయి. అవి పురిటి  నొప్పులా? హింస తాలుకు రోధనలా?  ఇండియా విభజనకు ముందర మతకల్లోలాలు ఎందుకు జరిగాయి. భారత ప్రధాన మంత్రి పదవికై మొహమ్మదాలి జిన్నా మరియు జవహర్ లాల్ ల పదవీకాంక్ష కొట్లాట ఇందుకు కారణమా? జిన్నా ప్రధాన మంత్రిగా గాంధి ఒప్పుకోవటానికి సిద్ధపడినందుకే గాంధీ హత్య జరిగిందా? మెజారిటీ కాంగ్రెస్ నాయకుల అభీష్టం మేరకు సర్దార్ వల్లభాయి పటేల్ ను గాంధీ ఆమోదించి వుంటే జిన్నా ప్రధాన మంత్రి పదవికై పోటీకి రాకుండా వుండే వాడా? సర్దార్ పటేల్ భారత ప్రధాన మంత్రి అవుతే జమ్మూ & కాశ్మీర్ వివాదం సమసి పోయి ఉండేదా? రావణ కాష్టంలా కాల కుండా వుండి ఉండేదా? సంవత్సరాల తరబడి లక్షల కోట్ల రూపాయల ధనం కాశ్మీర్ మీద వెచ్చించడం, వేల మంది భారత వీర సైనికుల మరణం ..దేశానికి ఎంత వరకు లాభం చేకూరింది. ఆ భూభాగం కోసం దేశం మొత్తము ఇబ్బందుల పాలుకావటం ఏమి రాజనీతి? బంగ్లా...

48. (NKP-8). మా సహకార గ్రామీణ బ్యాంక్

Image
మా సహకార గ్రామీణ బ్యాంకు( The Co-operative Rural Bank ltd). ప్రస్తుతం ఈ బ్యాంకును అన్నిటిలాగే ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అంటున్నారు. నేలకొండపల్లి సహకార గ్రామీణ బ్యాంకును తేది 13.07.1956 న స్వాతంత్ర్య సమరయోధులు, ఆనాటి మద్రాస్ రాష్ట్రంలో సీనియర్ కాబినెట్ మంత్రి మరియు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ గా పనిచేసిన శ్రీ కళా వెంకట్రావు గారు ప్రారంభించారు. కోనసీమను నందనవనం చేసిన మహానుభావుడాయన. శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారికి అత్యంత సన్నిహితుడు ఆయన. సత్యనారాయణరావు గారి ఆహ్వానం మేరకు ఆయన వచ్చారు.అప్పటికి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడలేదు. మొదటి మూడు టర్మ్ లు సహకార గ్రామీణ బ్యాంకుకు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారు ప్రెసిడెంటుగా ఉన్నారు. అప్పుడు ఒక టర్మ్ ఒక సంవత్సరం మాత్రమే వుండేది. ఆ సహకార గ్రామీణ బ్యాంకు క్రింద 1.నేలకొండపల్లి, 2. సింగారెడ్డిపాలెం,3. సదాశివపురం, 4. కొత్త కొత్తూరు, 5, పాత కొత్తూరు, 6.బోదులబండ,7.తిరుమలాపురం,8. కోరట్లగుడెం, 9.అనాసాగారం.10.గువ్వలగూడెం, 11. ఆరెగూడెం, 12.కోనాయగుడెం,13. ఆచార్లగూడెం ఉండేవి. అన్ని భౌగోళికం గా అనుకూలంగా ఉండేవి. క్రింది చిత్రం...

47. (NKP-7). మా పల్లె పాఠశాల ---జూనియర్ కళాశాల--జ్ఞాపకాలు.

Image
History of Committee School to the Government School. This PIC was taken in front of the newly constructed building of Sri Bhakta Ramadasu Memorial Committee School,  Nelakondapally in the year 1950's. Parents committee was formed in the year 1952 under the presidentship of Sri Pendyala Satyanarayana Rao. With their efforts school was upgraded to 6th (1952-53) to 10th (1956-57). The first batch of 10th class strength was only 14 members. After hard service and regular supervision, minimum strength was maintained. School buildings were constructed. Elders regularly visited the school to solve administration problems and to appoint good teachers. Sometimes the school was run in a private place. The committee school was handed over to the government in the year 1959. The name of the school was modified later as Z.P.S.S. School. Sarvasri Pendyala Satyanarayana Rao, Boppana Venkateswara Rao, Pendyala Krishna Murthy and other seen in the pic when they visited the school. The ...

46. (SOCIAL-37) The Legends who drafted the INDIAN CONSTITUTION!

Image
The Legends who drafted the INDIAN CONSTITUTION! Sri B.R.Ambedkar, Chairman and other members of the Constitution drafting committee. 1. Sri K.Munshi (Bombay), 2. Alladi Krishna Swamy Iyyer (Madras), 3. N.Gopala Swamy Iyyer (Ex PM, J & K), 4. Md.Sadullah (Muslim League Member), 5. D.P.Khaitan (Lawyer) and 6. Bengal Narasimha Rao (Adviser). After the resignation of Sri Mittal Madhava Rao advisor of Maharaja of Vadodara) and After the death of Sri, Khaitan, Sri T.T.Krishnamachary was appointed as members to the Committee. It was adopted on 26th Nov 1949.  The Drafting Committee and its members were very influential in Indian constitution-making during the Committee stages and the deliberations of the Constituent Assembly. On 29th August 1947, the Constituent Assembly through a resolution appointed a Drafting Committee and Dr BR Ambedkar was appointed the head of the drafting committee with one objective - draft a permanent and organized constitution for India. At i...

45.(NKP-6). శ్రమదానంతో రోడ్ నిర్మాణం. భావి తరాలకు ఆదర్శం.

Image
శ్రమదానంతో రోడ్ నిర్మాణం. భావి తరాలకు ఆదర్శం. ఆ రోజుల్లో భారత్ సేవక్ సమాజ్ అనే సంస్థ ఒకటి వుండేది. ఖమ్మం జిల్లాలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసేది. దానికి స్వాతంత్ర సమరరయోదులు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు కొంత కాలం ప్రెసిడెంట్ గా వున్నారు. నేలకొండపల్లి నుండి బోడులబండ కు ప్రస్తుతమున్న రోడ్ వారు నిర్మించినదే. ఖమ్మంజిల్లా ఏర్పడిన తరువాత జిల్లాలో చాలా చోట్ల గవర్నమెంట్ డొంకలు ప్రజల సౌకర్యార్ధం తన రూపురేఖలను ప్రభుత్వ అనుమతితో మార్చుకున్నాయి. నేలకొండపల్లి నుండి తిరుమలాపురం,బోడులబండ, కోరట్లగుడెం ద్వారా రాజేశ్వరపురం, కూసుమంచి మార్గాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. కాని బోడులబండ మరియు పరిసర గ్రామాల పజలందరూ దాన్ని వ్యతిరేకించారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు యువకులు, విధ్యార్ధులతో శ్రమదానం క్రింద ఆరోడ్ నిర్మాణం గావించారు. ఆ రోజుల్లో అదో SENSATIONAL NEWS. ఉద్యమ స్పూర్తితో ఆ నిర్మాణం గావించారు.  ఆకార్యక్రమం ఒక నెల రోజులపాటు జరిగింది.నేలకొండపల్లి విద్యార్థుల పర్యవేక్షణ కోసం టీచర్ శ్రీ ద్రోణంరాజు కృష్ణా రావు, ఖమ్మం MUTIPURPOSE SCHOOL నుండి వచ్చిన విద్య...