Posts

75. (social 48). పాలేరు అసెంబ్లీ నియోజక వర్గం...నియోజకవర్గాల పునర్విభజన...రాజకీయాలు.

Image
పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం... నియోజకవర్గాల పునర్విభజన... రాజకీయాలు. ప్రధమంగా జరిగిన  నియోజకవర్గాల పునర్విభజన 1962. 1962 సం. లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి విడదీసిన ప్రాంతాన్ని పాలేరు అసెంబ్లీ నియోజక వర్గంగా ఏర్పాటు చేశారు. అప్పుడు ఖమ్మం జిల్లా కాంగ్రెసు వర్గరాజకీయాల ఫలితంగా నిబంధనలకు భిన్నంగా వేంసూరు అసెంబ్లీ నియోజక వర్గానికి బదులుగా వాళ్ళ స్వలాభం కోసం పాలేరును ఎస్. సీ నియోజకవర్గంగా మార్చారు. అప్పటికింకా సర్వశ్రీ జలగం వెంగళరావు మరియు శీలం సిద్దారెడ్డిలు ఇరువురు జిల్లా నాయకత్వ హోదాలో లేరు.   అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ  "రావు మరియు రెడ్డి "వర్గాలుగా చీలిపోయి వుంది. జిల్లాలో రావు వర్గముదే పైచేయిగా వుండేది. ఖమ్మం జిల్లాకు పార్టీలో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు ప్రాబల్యం ఎక్కువ.  వేంసూరు అసెంబ్లీ సీటు అప్పటి జిల్లా కాంగ్రెసు ముఖ్య నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణ రావుకు అవుసరం. ఖమ్మం అసెంబ్లీ రాజకీయాలలో పట్టువున్న వ్యక్తి శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు. నియోజకవర్గ రాజకీయాలలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావును తప్పించి జిల్లాలో ఆయన  ప్రాబల్యానికి అడ్డుకట్ట...

74. (Social..47). విలీనామా? విమోచనా? విద్రోహమా?.. ఈ సందిగ్ధత ఎందుకొచ్చింది?

Image
వందల సంవత్సరాల బానిసత్వం నుండి, ఎన్నోవేల జనాల బలిదానాల ఫలితంగా వచ్చిన హైదరాబాద్ రాష్ట్రఅవతరణ తేదీని ఉత్సవంగా జరుపుకొనే రాత/అదృష్టం తెలంగాణ ప్రజలకు లేకుండా పోయింది. 1). ఏ నిజాంరాజుకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటంచేశారో, ఆ నిజాంరాజు "ది గ్రేట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ ఆఫ్ దక్కన్" మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ చేతుల మీదుగా నూతనంగా ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయవలసిన దుస్థితి రావటం నా మనసును కలచి వేసింధి. "మా నైజాం రాజు తరతరాల బూజు" అన్న స్వాతంత్ర సమర యోధులే ఆ రోజు నిజాం ముందు నిలుచుని అభినందించవలసిన స్థితి. ఇండియా ప్రభుత్వం హైదరాబాద్ దక్కన్ పై చేపట్టిన "ఆపరేషన్  పోలో " విజయవంతం అయి మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ లొంగిపోయినా ఆయనని పజల అభీష్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్ర "రాజ్య ప్రముక్ః " గా ఎందుకు ప్రకటించవలసి వచ్చిందో ఆనాటి సర్దార్ వల్లభాయి పటేల్ మరియు జవహర్లాల్ నెహ్రూలకే ఎరుక. ఆనాడు ఇండియాలో విలీనమైన వందల సంస్థానాలలో దేనికీ ఇవ్వని ప్రత్యేకత ఈ సంస్థానంలోనే ఎందుకు? విలీనానికి ఆయనేమీ ఇండియాతో పోరాటం చేయలేదే! పోరాటము చేసి సంధి కుదుర్చుకోలేదే!  రాజీపత...

73. (NKP..16). మా నేలకొండపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం.

Image
దేవాలయ చరిత్ర. ఆరు వందల సంవత్సరాల పైగా చరిత్ర గల నేలకొండపల్లి లోని  శ్రీ వేంకటేశ్వర స్వామీ దేవాలయాన్ని పూర్వకాలంలో "నాగుల్ దేవాలయం" గా పిలిచేవారు.నిజాం కాలం నుండి 1967 సంవత్సరంలో రాష్ట్ర దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకునే వరకు "దేవల్ బాలాజీ" అని పిలిచేవారు. యిక్కడ స్వామీ స్వయంభూ మరియు శేషావతారం.యిక్కడ కొలువైవున్న దేముడు భక్తుల కోరిక తీర్చే స్వామియని భక్తుల విశ్వాసం. 320 ఎకరాలు పైగా పొలం ఉన్నా అందులో 100 ఎకరాలు సుమారుగా సాగర్ కాలువ క్రింద పోయింది. మిగిలిన భూమిలో రేగులగడ్డా తండాలో 150 ఎకరాలు పోను నేలకొండపల్లి మరియు పరిసర గ్రామాల్లో ఉంది. 1967 వరకు ముంతకల్దారులు గా మరియు స్థానాచార్యులు గా 17 తరాలు "ముడుంబాయ్" వంశస్థులు వున్నారు. వారి కోరిక ప్రకారం తదుపరి శ్రీ మరింగంటి కృష్ణమాచార్యులు వచ్చారు.  ఉత్సవ సమయాల్లో స్వామి వాహన దారులుగా బెస్త కులస్థులు ఆనాటినుంచి ఈనాటి వరకు తరాలు మారినా సాంప్రదాయం కొనసాగిస్తున్నారు.  మహిమ మరియు చరిత్ర ఉన్న ఈ దేవాలయం గురించిన చారిత్రక ఆధారాలు/ శిలా శాసనాలు లేకపోవటం దురదృష్టకరం. దేవాలయం తో అనుభంధం. మా వూరికి (నేలకొండపల్లి) తూరు...

72. (NKP..15). ). నా సాహిత్య జ్ఞాపకాలు.

Image
  సాహిత్య జ్ఞాపకాలు. ఏవేవో జ్ఞాపకాలు. అవన్నీ నా సాహిత్య ప్రపంచానికి సంబంధించినవి. ఎప్పుడు భావావేశం వస్తే అప్పుడే... ఎక్కడవుంటే అక్కడే ...వెంటనే వచన కవితలు వ్రాసే వాడిని. వ్రాసిన తేదీ, సమయం కూడా అందులో వ్రాసేవాడిని. అప్పుడు నా వయస్సు 17 సంవత్సరాలు. అది 1972 వ సంవత్సరం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో "సిటీ కాలేజీ"లో బి.కాం చదువుతున్న రోజులు. ఒకరోజు ఏదో పనిబడి ప్రిన్సిపాల్ గారిని కలవటానికి వెళ్లి ఆయన రూమ్ ముందర ఉన్న బెంచీపై కూర్చున్నా. ఇంతలో ఒక భావావేశం వెన్ను తట్టింది. వెంటనే నా జేబులో ఉన్న పెన్ను వడివడిగా చేతులో ఉన్న నోట్ బుక్ లో ఉన్న తెల్ల కాగితం పైకి దూసుకెళ్లింది. భావం అక్షర రూపం దాల్చింది. దాని ఫలితమే.."నేను ఆశావాదిని...." అనే నా వచన కవిత. కోటి ఆశలతో, రంగుల భవిష్యత్తు కలలతో వందల మైళ్ళ దూరంలో ఉన్న హైద్రాబాద్ మహానగరంలో అడుగిడిన ఆనంద క్షణాలు అవి. ఇంతలో ఒక విద్యార్థి వచ్చి నా ప్రక్కనే కూర్చుని నేను వ్రాసిన కవితను చదివి.." ఏమిటండీ మీ ఆనందం అంత ఉరక లేస్తోంది...ఈ సమాజాన్ని, ఈ పరిస్థితులను చూస్తుంటే మీకంత ఆశాజనకంగా కనిపిస్తోందా" అని చర్చ లేవదీశాడు. ఏవేవో చర్చించా...

71. (NKP..14). నేలకొండపల్లి PHC స్థల వివాదం చరిత్ర.

Image
నేలకొండపల్లి ప్రాధమిక ఆరోగ్యకేంద్ర స్థల వివాదం.... 36 సం.ల క్రిందటి మాట.    (1). నేలకొండపల్లి ప్రాధమిక ఆరోగ్యకేంద్రం, స్థానిక కో-ఆపరటివ్ రూరల్ బ్యాంకు స్థలాల మధ్య సరిహద్దు వివాదం వచ్చింది.  ఒక 30 సార్లు కనీసం సంబంధిత అధికారులు సర్వే చేసి నివేధికలిచ్చారు. వివాదమైతే ఇప్పటికీ అంతే ఉంది. విశేషము ఏమంటే స్థానిక గ్రామపంచాయతీ వారు అందులో మా భూమి ఉందంటూ ఆ స్థలంలో జొరబడి కొంత స్థలాన్ని తమ శానిటరీ సిబ్బందికి ప్రభుత్వ నిధులతో ఇళ్లు కట్టించి ఇచ్చారు. రక్షిత మంచినీటి సరఫరా పథకానికి సంబంధించిన వాటర్ ట్యాంక్, వాచమన్ రూమ్ కట్టించారు. ఆ ఇళ్లకు దోవ/రోడ్డు క్రింద కొంత స్థలం కేటాయించారు. స్థానిక మహిళామండలి భవన నిర్మాణానికి భూమి కేటాయించారు. ఇదే అదనుగా కొందరు షాప్స్ కట్టారు. మరికొందరు ఈ భూమి మాదే అంటూ గుడిసెలు వేశారు. ఈ ప్రాంత MLA లు గా చేసినవారు వివిధ కాలాలలో రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా చేశారు. అయినా వారు ఎన్నడూ ఈ స్థలాలపై దృష్టి పెట్టలేదు. అది ఈ ప్రాంత ప్రజల దురదృష్టం. ఆ స్థలం చేసుకున్న పాపం. ఒక దశాబ్దం పాటు స్థానిక ప్రింట్ మీడియాకు ఇదో పెద్ద హాట్ టాపిక్. సీరియల్ వ్యాసాలు వ్రాశారు. వారికి కొ...

70. (NKP..13). ఏంది సామీ!

Image
ఏంది సామీ యిది ? గీ చిచ్చు ఏంది? సన్యాసివి కదా....జర సైలెంటుగా వుండరాదురి. తరం మారే.  విలువలు మారిపాయే. రామున్ని నిందించిండని, రామాయణాన్ని కించపరిచిండని కత్తి మహేష్ ని నగర బహిష్కరణ చేసినరు గందా.  మన సమ్మక్క, సారలమ్మ వనదేవతలని , గ్రామదేవతలని అది ఇది అని అవమానించినోన్ని ఏమి చెయ్యాలే అని గొంతెత్తి అడుగుతున్నరండీ.  పడేండ్ల సంది గిట్లనె  మాట్లాడుతున్న రాంట . పాత వీడియో  చూపిస్తున్నారు.  శివయ్య, పార్వతీదేవి  గురించి గట్లనే మాట్లాడితివి. పార్వతీ దేవి గురించి వెకిలిగా మాట్లాడితివి.  దేవుడంటే కేవలం వైష్ణవం అని విషపు భావజాలం ప్రజల్లో నింపేటోన్ని నెత్తికెక్కిచ్చుకునుడు అవసరమా. సమతా మూర్తి విగ్రహాన్ని వేలకోట్లు ఖర్చు చేసి పెట్టినా  దేవుళ్లను సమానంగా చూడలేనోనివి ఇంక మనుషులనేం చూస్తవ్..? పూర్వం సనాతన హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్లలో  శైవులు( శివ భక్తులు) ,వైష్ణవులు( విష్ణువు భక్తులు) అంటూ వర్గాలుగా విభజింపడ్డారు.. వీళ్లకు అస్సలు పడేది కాదు..మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని పోట్లాడుకునేవారు.. ఈ చిన్న జీయర్ వైష్ణవుడు..కాబట్టి ఈయన దృష్టిలో దేవుడ...

69. (NKP...12). ఖమ్మం జిల్లాలోని ఓ ఆర్ . టీ. సీ. బస్సు స్టాండు ....కధా.. మా వ్యధ..

Image
ఖమ్మం లో ఓ ఆర్ . టీ.  సీ. బస్సు స్టాండు ....కధా.. మా వ్యధ..  హలో సార్లూ! క్రింది మొదటి రెండు ఫోటోలు గుర్తుపడతారా? ఎక్కడివో చెప్పగలరా? ఈ మధ్య ఆర్.టీ. సి. పెద్దసారు సజ్జనారు సారూ నెటిజన్లను ఈ ప్రశ్నే అడుగుతే తడుముకోకుండా రాష్ట్రం నలుమూలలా వున్నోల్లంతా " ఖమ్మం బస్సు స్టాండు " అని చె ప్పేసినృ . బావుందని మెచ్చుకున్నరు. ఏంది మరి? ఏమనుకున్నారు. రాష్ట్ర రవాణా శాఖా మంత్రి నియోజకవర్గమా? మజాకా? మా ఖమ్మం బస్సు స్టాండు ఎప్పుడూ అంతేనండి. మీకో విషయం తెలుసా? శ్రీ జలగం వెంగళరావు రాష్ట్ర ముఖ్యమంత్రి గా వున్నప్పుడు ఇప్పుడందరికీ తెలిసిన పాత బస్సు స్టాండు ను కట్టించాడు. అంతకు ముందు రైల్వే స్టేషను ప్రక్కన బస్సులు ఆగేవి. అదే బస్సు స్టాండు అప్పుడు. పెరిగే అవుసరాల కొసమని పెద్దది కట్టించినరు. క్రింద ఫోటోనే ఆ బస్సు స్టాండు. బస్సు స్టాండు ప్రారంభోత్సవానికి తరువాతి ముఖ్యమంత్రి శ్రీ మర్రిచెన్నారెడ్డి వచ్చింరు{1979 లో అనుకుంటా) . రిబ్బను కత్తిరించే ముందు బస్సు స్టాండును అంతా చూసి, చేతిలో వున్న కర్రను ఊపుతూ "ఖమ్మానికి ఇంత పెద్ద బస్సు స్టాండా?" అన్నాడండి. నేను ప్రక్కనే వున్నా. ఖమ్మం ఎమ్మెల్యే అన...