Posts

65. (SOCIAL-45) వస్తుందా మార్పుకు అవకాశం.

                                       ఏమవుతుంది నా దేశం                                        వస్తుందా                                                  మార్పుకు కోరుకున్న అవకాశం                                                        డెబ్బది మూడు సంవత్సరాల వయస్సులో                                         నా దేశ ప్రజాస్వామ్యం                      ...

63. (SOCIAL-42) ప్రశ్నించే గొంతు కావాలి. నిలదీసే దమ్ము ఉండాలి.

Image
             ఎవ్వరు బాధ్యులు?         ఒక రాజకీయపార్టీ టికెట్ పై, ఒక సిద్దాంతం పై  ఎం.ఎల్.ఏ గా పొటీ చేసి గెలిచి, మరో రాజకీయ పార్టీ లోకి వలస వెళుతున్న ఎం.ఎల్.ఏ లను నిలదీసే హక్కు ఎవ్వరికుంది? ఆ నైతిక హక్కు ఎవ్వరికుంది? తమకోసం అహర్నిశలు పనిచేసే కార్యకర్తల గాలికొదిలేసి కాంట్రాక్టర్లకు, పారిశ్రామికవేత్తలకు డబ్బుకు కక్కుర్తిపడి పార్టీ టికెట్లను అమ్ముకుంటున్న బాధ్యతారహిత  రాజకీయ పార్టీల నేతలది కాదా  తప్పు? ప్రజాప్రతినిధి గా ఎన్నిక కావటానికి “బి” ఫోరం ఇచ్చిన రాజకీయ పార్టీ కుందా? డిమాండ్ చేసి, ధర్నాలు చేసి మరీ పోటీచేసే అభ్యర్థుల దగ్గర డబ్బులు గుంజుకుంటున్న ఓటర్ల కుందా? సమాజాన్ని ప్రశ్నించే మీడియాకు ఓటర్ల ను ప్రశ్నించే దమ్ముందా? ప్రశ్నించే దమ్ము ఓటు వేసే సామాన్యులకు రావాలంటే ఏమి చేయాలి? ఈ పరిణామానికి బాధ్యత ఎవ్వరిది? అవినీతి ప్రపంచంలో ఈదుతున్న రాజకీయ పార్టీలదా? డబ్బు మత్తులో జోగుతున్న ఓటర్లదా? ప్రజాస్వామ్య దేశంలో వారసత్వ రాజకీయ సంస్కృతికి , నామినేటేడ్  సంస్కృతికి తప్ప కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు లేని రాజకీయ పార్టీ...

62. (SOCIAL-41) మేధావులు కదలండయ్యా ....ఎన్నికల రంగలో పోగైన కలుపు ను తీసేద్దాం రండయ్యా...

Image
మేధావులు కదలండయ్యా ....ఎన్నికల రంగలో పోగైన  కలుపు ను తీసేద్దాం ..రండయ్యా... ఒకప్పుడు నాయకుడంటే ప్రజల్లోంచి వచ్చేవాడు, ప్రజల కోసం బ్రతికే వాడు. ప్రజలకోసం ఆస్తులు ధారపోసేవాడు. కుటుంబ జీవితాన్ని లెక్క జేయక ప్రజల కోసం పోరాటం చేసేవాడు. ఇచ్చిన మాటకోసం సమాజ సేవ కోసం నిరంతరం తపన పడేవాడు. ఎన్నికలొస్తే అయ్యా మీరే నిలబడండి మీమంతా మీపక్షమే నని జనాలు నాయకులకు  చెప్పేవారు. నిజాయితీగా నాయకులు పదవులకు ఎన్నిక అయ్యేవారు.  కానీ నేడో... తరాలు మారినయ్. ప్రజల మనస్తత్వాలు మారినవి. నాయకులను ఓటుకు నోటును ఓటర్లు అడుగు తున్నారు. నోటు లేనిదే పోలింగుకు రామంటున్నారు. మరికొందరైతే ఆ అభ్యర్ధి  డబ్బులిచ్చాడు మీరెందుకు ఇవ్వరని రహదారులపై ధర్నాలకు దిగుతున్నారు. ఒకప్పుడు నయాపైసా ఆశించకుండా అభ్యర్ధులకు ఓట్లేసిన ప్రజలు కాసులకై  కొట్లాడుతున్నారు. దేశంలోని అన్ని ప్రాంతీయ, జాతీయ రాజకీయ పార్టీలు (వామ పక్షాలకు ఇందులో మినహాయింపు లేదు) డబ్బులు పంచటంలో పూర్తిగా నిమగ్నమై దానితోనే గెలుపు గుర్రాల నేక్కాలని వువ్విళ్ళూరుతున్నారు. రాజకీయపార్టీలు ఎన్నికల అభ్యర్ధుల నిర్ణయంలో కోట్ల రూపాయలను లంచంగా తీసుక...

61. (ఖమ్మం చరిత్ర-9) ఆ నాటి మా ఖమ్మం లో మారిన రాజకీయ ముఖ చిత్రం.

ఆ నాటి మా ఖమ్మం లో మారిన రాజకీయ ముఖ చిత్రం. విబేధాలతో  వామపక్షాలు --- ఆధిపత్య రాజకీయాలతో కాంగ్రెస్ వాదులు ..... ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముఖ్య జిల్లా నాయకుల చీలిక మరియు జిల్లా కమ్మ్యునిస్ట్ నాయకులలో కూడా  చీలికల్లో చీలిక రావడం ఖమ్మం జిల్లా రాజకీయ అవనికపై సరికొత్త సమీకరణాలకు దారి చూపాయి. కాంగ్రెస్ పార్టీ లో జిల్లా నాయకుల చీలికలు.  1967 అసెంబ్లీ ఎన్నికల వరకు కలిసేవున్నజిల్లా కాంగ్రెస్ నాయకులు ఆధిపత్య పోరాటంలో ఒకరికి ఒకరు ధూరం అయ్య్హారు. ఫలితంగా శ్రీ జలగం వెంగళరావు మరియు శ్రీ శీలం సిద్దారెడ్డి వర్గాలుగా కాంగ్రెస్ శ్రేణులు చీలిపోయినవి. వైవిధ్య రాజకీయ నేపధ్యాలతో అనుహ్యంగా  ఏకమైన వారు ఆధిపత్య పోరాటంలో విడిపోవటంతో జిల్లా రాజకీయ ముఖచిత్రం కొత్త రూపును సంతరించుకొంది. రాజకీయ సమీకరణలు మళ్ళీ మారిపోయాయి. శ్రీ జలగం వెంగళరావు, శ్రీ శీలం సిద్దారెడ్డి రాజకీయ ప్రారంభంలో ఒకేవేధిక మీదకు వచ్చిన నాడే ఆధిపత్య ధోరణులకు అంకురార్పణ జరిగింది. ఆ విషయం జిల్లా కాంగ్రెస్ ఆఫీసు నూతన భవన నామకరణం దగ్గర బహిర్గతం అయినది. శ్రీ జలగం వెంగళరావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ  అధ్య...

60 . (ఖమ్మం చరిత్ర-8) ఖమ్మంలో మహాత్మా గాంధి--ప్రజల మదిలో జాతి పిత జ్ఞ్యాపకాలు..

Image
Mahatma Gandhi's meeting was held in my ancestral land in Khammam town near Venkatagiri Railway gate 5 August 1946.—  1942 సంవత్సరం ఆగస్ట్ నెలలో ప్రారంభమైన క్విట్ఇండియా ఉద్యమం 1945 లో ముగియటంతో వెంటనే గాంధీజీ దక్షిణ భారత హింది భాషా ప్రచార ఉద్యమాన్ని చేపట్టి పర్యటనలు ప్రారంభించారు.   ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ఈసమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే 1946 సంవత్సరంలో నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పై వున్న నిషేధాన్ని ఎత్తి వేసింది. కమ్యూనిస్ట్ పార్టీ పై నిషేధాన్ని విధించింది. 1946, ఫిబ్రవరి 3, 4 తేదీలలో మద్రాస్ లో నిర్వహించిన  దక్షిణ భారత హింది భాషా ప్రచార కార్యక్రమం నుండి వస్తున్న గాంధీజీ, ఖమ్మం టౌన్ కాంగ్రెస్ కోరిక మేరకు మార్గ  మధ్యమంలో రైల్ ఆగగా ఫిబ్రవరి 5 వ తేదిన మహాత్మాగాంధి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఖమ్మం టౌన్ కాంగ్రెస్ కు అప్పుడు శ్రీ గెల్లా కేశవా రావు ప్రెసిడెంట్ గా వున్నారు. స్వాతంత్య్ర దినోత్సవమ్ సందర్భము గా స్వాతంత్ర్య సమర యోధులను సత్కరించే కార్యక్రమంలో భాగం గా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా శ్రీ చింతనిప్పు లాలయ్య, కొత్త సీతారాముల...

59. (ఖమ్మం చరిత్ర-7) ఆ నాటి మా ఖమ్మం....ఒక కురుక్షేత్రం..

Image
ఆనాటి మా ఖమ్మం .... ఒక కురుక్షేత్రం. ఖమ్మం జిల్లా ఎన్నికల చరిత్ర ప్రముఖం గా ఖమ్మం, వేమ్సూర్ మరియు మధిర అసెంబ్లీ ఎన్నికల చరిత్ర తో ముడిపడి వుంది. ఖమ్మంజిల్లా చరిత్ర ప్రస్తావనలో ఖమ్మం నాయకుల గురించి చెప్పుకోవలసి వస్తే శ్రీబొమ్మకంటి సత్యనారాయణరావు, పెండ్యాల సత్యనారాయణరావు, శ్రీ జలగం వెంగళరావు మరియు శీలం సిద్దారెడ్డి  పేర్లు ప్రముఖంగా వస్తాయి. 1949 సంవత్సరం నైజాం ప్రాంతంలో కీలకమైనవి. ఈ ప్రాంతంలో ముఖ్యమైన కమ్యునిస్టు పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాల్లో మార్పులు సంభవించాయి. వరంగల్ జిల్లాలో కుడా ఈ రెండు పార్టీల నాయకత్వాలు మారిపోయాయి. ఈ రెండు పార్టీల జిల్లా మరియు రాష్ట్ర పార్టీల నాయకత్వంలో ఖమ్మం నాయకులే వుండటం గమనార్హం. వాటి ఫలితమే 1952 ఎన్నికల నుండి జరిగిన రాజకీయ పునరేకీకరణలు. విశాలాంధ్ర సిద్ధాంతంను(ఆంధ్ర మరియు తెలంగాణా ప్రాంతాల విలీనం—భాషా ప్రయుక్త రాష్ట్రాలు) వ్యతిరేకించిన వారు కాంగ్రెస్ పార్టీ లో ఒంటరి వారు కావటం, నైజాం సంస్థానం ఇండియాలో విలీనం కావటాన్ని కమ్యునిస్టు పార్టీ వ్యతిరేకించిన కారణంగా ఆ పార్టీ నుండి కొందరు పార్టీ వీడిపోవటంతో ఈ మార్పులు సంభవించాయి....

58. (ఖమ్మం చరిత్ర-6) మా వరంగల్/ఖమ్మం జిల్లాలో ప్రధమ ధశాబ్ధంన్నర ఎన్నికల రాజకీయం.

Image
మా వరంగల్/ఖమ్మం జిల్లా లో ప్రధమ దశాబ్ధం ఎన్నికల రాజకీయం. అది 1949 సంవత్సరం నవంబెర్ 26 వ తేది, వరంగల్ పట్టణంలో అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా కాంగ్రెస్ నాయకుల సారధ్యం లో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసింది.  ఆ సమావేశానికి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు నేత్రుత్త్వం వహించారు. సర్దార్ వల్లభాయి పటేల్ ముఖ్యఅతిధిగా వచ్చారు. విశాలాంధ్ర ఏర్పాటుకు హైదరాబాద్ రాష్ట్ర ప్రజల మద్దతు సంపాదించటమే ఆ సమావేశ ముఖ్యోద్దేశ్యం. సహజం గానే హైదరాబాద్ లో సార్వత్రిక ఎన్నికలొస్తే ఎవ్వరు ముఖ్య మంత్రి అనే చర్చకూడా జరుగుతుంది. అంతర్గతంగా ఆ సమాలోచనలు కుడా జరిగాయి. ఎన్నికలు జరుగుతే వరంగల్/ ఖమ్మం నుండి ముఖ్యమంత్రి కాండిడేట్ స్థాయి వున్న నాయకుడు కాంగ్రెస్ నుండి శ్రీ జమలాపురం కేశవరావు వున్నారు. కాంగ్రెస్ పార్టీ పై నిషేధం తొలగిన తరువాత ప్రప్రధమంగా శ్రీ జమలాపురం కేశవరావు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 1946-1949 వరకు పనిచేశారు. విశాలాంధ్ర భావనకు శ్రీ జమలాపురం వ్యతిరేకించాడు. పార్టీ లో ఒంటరి అయినాడు. అప్పుడే ఆయనను రాజకీయం గా అణగ దోక్కటానికి పావులు కదిపటం ప్రారంభం అయినది. 1949 హైదరాబాద్ రాష్...