Posts

80. (SOCIAL--53) దేశంలో ప్రజా సేవ ఇంత Costly నా? ఎవ్వరికీ బాధ్యతలు లేవా?

Image
                                    ఈ దేశంలో ప్రజాసేవ                                     ఇంత costly అయిందా?                                     వింటున్నాం                                      నియోజకవర్గంలో                                      ఒక అభ్యర్థికి 400-500 కోట్లు ఖర్చు,                                     అవతల వారూ అంతే..                           ...

79. (social..52). మీరు నమ్ముతారా. ఎన్నికలు అంటే అలావుండాలి

Image
                                                    ఎన్నికలు .. సంస్కరణలు అంటే  నాకు  మా ప్రక్కగ్రామం అయిన బొదులబండకు చెందిన కీ.శే. శ్రీ పొట్టి పింజర హుసేనయ్య  జ్ఞాపకం వస్తాడు  1978 లో  ఆయన  పాలేరు నియోజక వర్గానికి ఏం. యల్. ఏ.గా గెలిచాడు   ఆ కాలంలో  ఆయన ప్రచారంలో  హంగు ఆర్భాటాలు లేవు.  మైకుల హోరులు, వాహనాల రొదలు అసలే లేవు.  ఊరేగింపులు, గడప గడపకు ప్రచారాలు లేవు.  ఒకటో, రెండో సమావేశాలు జరిగాయోమో  నాకైతే గుర్తు లేదు. మీరు నమ్ముతారా? పోలింగ్ జరిగేటప్పుడు పోలింగ్ స్టేషన్ లో  ఏజెంట్లు కూడా లేరు. పార్టీ గుర్తు చెప్పేవాళ్ళు అసలే లేరు.  సామాన్య జనంలో ఇందిరమ్మపై  అభిమానం ఉప్పెనలా ఉప్పొంగింది.  హుసేనయ్యను ఏం.ఎల్.ఏ గా గెలిపించింది. అంతకు ముందు మూడు పర్యాయాలు  ఏం. ఎల్. ఏ గా వున్న వ్యక్తిని ఓడగొట్టారు. అధికార పార్టీ అయిన కాంగ్రెసును  కాంగ్రెసు వాదులే ఓడించారు    ...

78. (social...51). ఎవవరెవరో ఎక్కడినుండో వస్తారు..... ఆలోచించండి ప్రజలారా...

Image
ఆలోచించండి.  ఎన్నికల సందడి మొదలు కాగానే ఎవ్వరెవ్వరో వస్తారు ఎక్కడెక్కడి నుండో వస్తారు చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు,  దూరిపోతారు  తెగ హడావుడి చేస్తారు దండలు/ఓ ట్లు వేయించుకుంటారు కుర్చీలో/పదవిలో కూర్చుంటారు ఆ తరువాత ఏమీ పట్టించుకోరు ఏటో వెళ్ళిపోతారు ధన సంపాదనలో మునిగి పోతారు సమస్యలన్నీ పేరుకు పోతాయి సమాజం లో చీకట్లు ముసురుతాయి …. ఎన్నికల్లో  ఎప్పుడూ తక్కువ బడ్డుకు ఓటేద్దాం అనే  భావానికి అలవాటు పడ్డారు జనం ఆ ప్రభుత్వం మీద కోపం వుంటే   దాని ప్రత్యర్థి పార్టీకి, ప్రత్యర్థి పార్టీకి అధికారం వచ్చి దీనిపై కోపం వస్తే మాజీ అధికార పార్టీకి ఓటు వేయడం తప్ప గత్యంతరం లేని స్థితి ప్రత్యామ్నాయం లేని దుస్థితి… ఏదీ, ఏమీ ఆలోచించలేని సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఒకవైపు….. స్వలాభాలకోసం కార్యకర్తల ప్రయోజనాలు తాకట్టు పెట్టి అభ్యర్దుల నిర్ణయాలతో రాజకీయ పార్టీలు మరోవైపు….. ఈ పార్టీల వ్యవస్థ అవస్థల పాలు చేస్తోంది.. ఎన్నికల సంస్కరణల కొరడా పైకెత్తి యువతరం కార్య రంగంలోకి దిగవలసిన సమయం వచ్చింది, దొంగ...

77. (social..50). ప్రజాస్వామ్యం.....ఎన్నికలు.

Image
                     ప్రజాస్వామ్యం.....ఎన్నికలు.                      ప్రజాస్వామ్యం                     నన్ను తట్టి నిద్ర లేపింది.                     నిద్రమత్తు వదిలింది.                     అంటోంది                     ఎలక్షన్లు దండగ,                     కావొచ్చు ప్రజలకు పండగ...,                     కానీ నిజానికి                     అది పండగ కాదని,                    ఓటును రెండు/మూడు వేల రూపాయలుకు అమ్మటం,                    1825 రోజులకు...

76. (social..49). రాజకీయ రంగం సమస్తం కుళ్ళి కంపు కొడుతోన్న వైనం.

Image
 ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ? రాజకీయ రంగం సమస్తం కుళ్ళి కంపు కొడుతోన్న వైనం. బీ.ఆర్.ఎస్  పార్టీలో టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలోకి  ..  కాంగ్రెస్ పార్టీ లో టికెట్ దొరకలేదని  బీ.ఆర్.ఎస్/బీ.జె.పీ.లోకి .... పిల్లనిచ్చి/టికెట్ ఇచ్చి పెళ్లి చేసినా/గెలిపించినా    తాళి కట్టిన మరుక్షణమే, కాళ్ళ పారాణి ఆరకుండానే   వేరే వాళ్ళతో లేచి పోడనే గ్యారంటీ ఏమిటీ? కళ్ళముందు కనిపిస్తున్నదే  కదా! సర్వేలమీద సర్వేలు చేసి  గెలుపు గుర్రాల పసిగట్టి వాటేసుకొనే వారు కొందరు..  గెలిపించిన కార్యకర్తలను, పార్టీని నట్టేట ముంచి  డబ్బు కోసం /కాం ట్రాక్టుల కోసం  గడ్డితినే వారు ఇంకొకరు... చాలా భలేగుంది మీ రాజకీయం... పార్టీ సభ్యత్వం లేకుండా శతాబ్దాల/దశాబ్దాల పార్టీలోకి  లేచిపోయి వచ్చినోళ్ళకి  కుర్చీ లిస్తే  వాళ్ళనే అందలమెక్కిస్తే  ఇంతకాలం పల్లకీ మోసిన, చమటోడ్చిన, త్యాగాలతో బతుకీడ్చిన   కార్యకర్తలకు  ఎవ్వరు  భరోసా? టికెట్ కోసం వచ్చిన అవతలోడికి  నీ సిద్దాంతాలతో పనిలేదు  నీ నాయకులపై గౌరవం వు...

75. (social 48). పాలేరు అసెంబ్లీ నియోజక వర్గం...నియోజకవర్గాల పునర్విభజన...రాజకీయాలు.

Image
పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం... నియోజకవర్గాల పునర్విభజన... రాజకీయాలు. ప్రధమంగా జరిగిన  నియోజకవర్గాల పునర్విభజన 1962. 1962 సం. లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి విడదీసిన ప్రాంతాన్ని పాలేరు అసెంబ్లీ నియోజక వర్గంగా ఏర్పాటు చేశారు. అప్పుడు ఖమ్మం జిల్లా కాంగ్రెసు వర్గరాజకీయాల ఫలితంగా నిబంధనలకు భిన్నంగా వేంసూరు అసెంబ్లీ నియోజక వర్గానికి బదులుగా వాళ్ళ స్వలాభం కోసం పాలేరును ఎస్. సీ నియోజకవర్గంగా మార్చారు. అప్పటికింకా సర్వశ్రీ జలగం వెంగళరావు మరియు శీలం సిద్దారెడ్డిలు ఇరువురు జిల్లా నాయకత్వ హోదాలో లేరు.   అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ  "రావు మరియు రెడ్డి "వర్గాలుగా చీలిపోయి వుంది. జిల్లాలో రావు వర్గముదే పైచేయిగా వుండేది. ఖమ్మం జిల్లాకు పార్టీలో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు ప్రాబల్యం ఎక్కువ.  వేంసూరు అసెంబ్లీ సీటు అప్పటి జిల్లా కాంగ్రెసు ముఖ్య నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణ రావుకు అవుసరం. ఖమ్మం అసెంబ్లీ రాజకీయాలలో పట్టువున్న వ్యక్తి శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు. నియోజకవర్గ రాజకీయాలలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావును తప్పించి జిల్లాలో ఆయన  ప్రాబల్యానికి అడ్డుకట్ట...

74. (Social..47). విలీనామా? విమోచనా? విద్రోహమా?.. ఈ సందిగ్ధత ఎందుకొచ్చింది?

Image
వందల సంవత్సరాల బానిసత్వం నుండి, ఎన్నోవేల జనాల బలిదానాల ఫలితంగా వచ్చిన హైదరాబాద్ రాష్ట్రఅవతరణ తేదీని ఉత్సవంగా జరుపుకొనే రాత/అదృష్టం తెలంగాణ ప్రజలకు లేకుండా పోయింది. 1). ఏ నిజాంరాజుకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటంచేశారో, ఆ నిజాంరాజు "ది గ్రేట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ ఆఫ్ దక్కన్" మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ చేతుల మీదుగా నూతనంగా ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయవలసిన దుస్థితి రావటం నా మనసును కలచి వేసింధి. "మా నైజాం రాజు తరతరాల బూజు" అన్న స్వాతంత్ర సమర యోధులే ఆ రోజు నిజాం ముందు నిలుచుని అభినందించవలసిన స్థితి. ఇండియా ప్రభుత్వం హైదరాబాద్ దక్కన్ పై చేపట్టిన "ఆపరేషన్  పోలో " విజయవంతం అయి మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ లొంగిపోయినా ఆయనని పజల అభీష్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్ర "రాజ్య ప్రముక్ః " గా ఎందుకు ప్రకటించవలసి వచ్చిందో ఆనాటి సర్దార్ వల్లభాయి పటేల్ మరియు జవహర్లాల్ నెహ్రూలకే ఎరుక. ఆనాడు ఇండియాలో విలీనమైన వందల సంస్థానాలలో దేనికీ ఇవ్వని ప్రత్యేకత ఈ సంస్థానంలోనే ఎందుకు? విలీనానికి ఆయనేమీ ఇండియాతో పోరాటం చేయలేదే! పోరాటము చేసి సంధి కుదుర్చుకోలేదే!  రాజీపత...