58. (ఖమ్మం చరిత్ర-6) మా వరంగల్/ఖమ్మం జిల్లాలో ప్రధమ ధశాబ్ధంన్నర ఎన్నికల రాజకీయం.
మా వరంగల్/ఖమ్మం జిల్లా లో ప్రధమ దశాబ్ధం ఎన్నికల రాజకీయం. అది 1949 సంవత్సరం నవంబెర్ 26 వ తేది, వరంగల్ పట్టణంలో అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా కాంగ్రెస్ నాయకుల సారధ్యం లో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు నేత్రుత్త్వం వహించారు. సర్దార్ వల్లభాయి పటేల్ ముఖ్యఅతిధిగా వచ్చారు. విశాలాంధ్ర ఏర్పాటుకు హైదరాబాద్ రాష్ట్ర ప్రజల మద్దతు సంపాదించటమే ఆ సమావేశ ముఖ్యోద్దేశ్యం. సహజం గానే హైదరాబాద్ లో సార్వత్రిక ఎన్నికలొస్తే ఎవ్వరు ముఖ్య మంత్రి అనే చర్చకూడా జరుగుతుంది. అంతర్గతంగా ఆ సమాలోచనలు కుడా జరిగాయి. ఎన్నికలు జరుగుతే వరంగల్/ ఖమ్మం నుండి ముఖ్యమంత్రి కాండిడేట్ స్థాయి వున్న నాయకుడు కాంగ్రెస్ నుండి శ్రీ జమలాపురం కేశవరావు వున్నారు. కాంగ్రెస్ పార్టీ పై నిషేధం తొలగిన తరువాత ప్రప్రధమంగా శ్రీ జమలాపురం కేశవరావు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 1946-1949 వరకు పనిచేశారు. విశాలాంధ్ర భావనకు శ్రీ జమలాపురం వ్యతిరేకించాడు. పార్టీ లో ఒంటరి అయినాడు. అప్పుడే ఆయనను రాజకీయం గా అణగ దోక్కటానికి పావులు కదిపటం ప్రారంభం అయినది. 1949 హైదరాబాద్ రాష్...