Posts

Showing posts from 2018

61. (ఖమ్మం చరిత్ర-9) ఆ నాటి మా ఖమ్మం లో మారిన రాజకీయ ముఖ చిత్రం.

ఆ నాటి మా ఖమ్మం లో మారిన రాజకీయ ముఖ చిత్రం. విబేధాలతో  వామపక్షాలు --- ఆధిపత్య రాజకీయాలతో కాంగ్రెస్ వాదులు ..... ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముఖ్య జిల్లా నాయకుల చీలిక మరియు జిల్లా కమ్మ్యునిస్ట్ నాయకులలో కూడా  చీలికల్లో చీలిక రావడం ఖమ్మం జిల్లా రాజకీయ అవనికపై సరికొత్త సమీకరణాలకు దారి చూపాయి. కాంగ్రెస్ పార్టీ లో జిల్లా నాయకుల చీలికలు.  1967 అసెంబ్లీ ఎన్నికల వరకు కలిసేవున్నజిల్లా కాంగ్రెస్ నాయకులు ఆధిపత్య పోరాటంలో ఒకరికి ఒకరు ధూరం అయ్య్హారు. ఫలితంగా శ్రీ జలగం వెంగళరావు మరియు శ్రీ శీలం సిద్దారెడ్డి వర్గాలుగా కాంగ్రెస్ శ్రేణులు చీలిపోయినవి. వైవిధ్య రాజకీయ నేపధ్యాలతో అనుహ్యంగా  ఏకమైన వారు ఆధిపత్య పోరాటంలో విడిపోవటంతో జిల్లా రాజకీయ ముఖచిత్రం కొత్త రూపును సంతరించుకొంది. రాజకీయ సమీకరణలు మళ్ళీ మారిపోయాయి. శ్రీ జలగం వెంగళరావు, శ్రీ శీలం సిద్దారెడ్డి రాజకీయ ప్రారంభంలో ఒకేవేధిక మీదకు వచ్చిన నాడే ఆధిపత్య ధోరణులకు అంకురార్పణ జరిగింది. ఆ విషయం జిల్లా కాంగ్రెస్ ఆఫీసు నూతన భవన నామకరణం దగ్గర బహిర్గతం అయినది. శ్రీ జలగం వెంగళరావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ  అధ్య...

60 . (ఖమ్మం చరిత్ర-8) ఖమ్మంలో మహాత్మా గాంధి--ప్రజల మదిలో జాతి పిత జ్ఞ్యాపకాలు..

Image
Mahatma Gandhi's meeting was held in my ancestral land in Khammam town near Venkatagiri Railway gate 5 August 1946.—  1942 సంవత్సరం ఆగస్ట్ నెలలో ప్రారంభమైన క్విట్ఇండియా ఉద్యమం 1945 లో ముగియటంతో వెంటనే గాంధీజీ దక్షిణ భారత హింది భాషా ప్రచార ఉద్యమాన్ని చేపట్టి పర్యటనలు ప్రారంభించారు.   ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ఈసమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే 1946 సంవత్సరంలో నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పై వున్న నిషేధాన్ని ఎత్తి వేసింది. కమ్యూనిస్ట్ పార్టీ పై నిషేధాన్ని విధించింది. 1946, ఫిబ్రవరి 3, 4 తేదీలలో మద్రాస్ లో నిర్వహించిన  దక్షిణ భారత హింది భాషా ప్రచార కార్యక్రమం నుండి వస్తున్న గాంధీజీ, ఖమ్మం టౌన్ కాంగ్రెస్ కోరిక మేరకు మార్గ  మధ్యమంలో రైల్ ఆగగా ఫిబ్రవరి 5 వ తేదిన మహాత్మాగాంధి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఖమ్మం టౌన్ కాంగ్రెస్ కు అప్పుడు శ్రీ గెల్లా కేశవా రావు ప్రెసిడెంట్ గా వున్నారు. స్వాతంత్య్ర దినోత్సవమ్ సందర్భము గా స్వాతంత్ర్య సమర యోధులను సత్కరించే కార్యక్రమంలో భాగం గా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా శ్రీ చింతనిప్పు లాలయ్య, కొత్త సీతారాముల...

59. (ఖమ్మం చరిత్ర-7) ఆ నాటి మా ఖమ్మం....ఒక కురుక్షేత్రం..

Image
ఆనాటి మా ఖమ్మం .... ఒక కురుక్షేత్రం. ఖమ్మం జిల్లా ఎన్నికల చరిత్ర ప్రముఖం గా ఖమ్మం, వేమ్సూర్ మరియు మధిర అసెంబ్లీ ఎన్నికల చరిత్ర తో ముడిపడి వుంది. ఖమ్మంజిల్లా చరిత్ర ప్రస్తావనలో ఖమ్మం నాయకుల గురించి చెప్పుకోవలసి వస్తే శ్రీబొమ్మకంటి సత్యనారాయణరావు, పెండ్యాల సత్యనారాయణరావు, శ్రీ జలగం వెంగళరావు మరియు శీలం సిద్దారెడ్డి  పేర్లు ప్రముఖంగా వస్తాయి. 1949 సంవత్సరం నైజాం ప్రాంతంలో కీలకమైనవి. ఈ ప్రాంతంలో ముఖ్యమైన కమ్యునిస్టు పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాల్లో మార్పులు సంభవించాయి. వరంగల్ జిల్లాలో కుడా ఈ రెండు పార్టీల నాయకత్వాలు మారిపోయాయి. ఈ రెండు పార్టీల జిల్లా మరియు రాష్ట్ర పార్టీల నాయకత్వంలో ఖమ్మం నాయకులే వుండటం గమనార్హం. వాటి ఫలితమే 1952 ఎన్నికల నుండి జరిగిన రాజకీయ పునరేకీకరణలు. విశాలాంధ్ర సిద్ధాంతంను(ఆంధ్ర మరియు తెలంగాణా ప్రాంతాల విలీనం—భాషా ప్రయుక్త రాష్ట్రాలు) వ్యతిరేకించిన వారు కాంగ్రెస్ పార్టీ లో ఒంటరి వారు కావటం, నైజాం సంస్థానం ఇండియాలో విలీనం కావటాన్ని కమ్యునిస్టు పార్టీ వ్యతిరేకించిన కారణంగా ఆ పార్టీ నుండి కొందరు పార్టీ వీడిపోవటంతో ఈ మార్పులు సంభవించాయి....

58. (ఖమ్మం చరిత్ర-6) మా వరంగల్/ఖమ్మం జిల్లాలో ప్రధమ ధశాబ్ధంన్నర ఎన్నికల రాజకీయం.

Image
మా వరంగల్/ఖమ్మం జిల్లా లో ప్రధమ దశాబ్ధం ఎన్నికల రాజకీయం. అది 1949 సంవత్సరం నవంబెర్ 26 వ తేది, వరంగల్ పట్టణంలో అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా కాంగ్రెస్ నాయకుల సారధ్యం లో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసింది.  ఆ సమావేశానికి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు నేత్రుత్త్వం వహించారు. సర్దార్ వల్లభాయి పటేల్ ముఖ్యఅతిధిగా వచ్చారు. విశాలాంధ్ర ఏర్పాటుకు హైదరాబాద్ రాష్ట్ర ప్రజల మద్దతు సంపాదించటమే ఆ సమావేశ ముఖ్యోద్దేశ్యం. సహజం గానే హైదరాబాద్ లో సార్వత్రిక ఎన్నికలొస్తే ఎవ్వరు ముఖ్య మంత్రి అనే చర్చకూడా జరుగుతుంది. అంతర్గతంగా ఆ సమాలోచనలు కుడా జరిగాయి. ఎన్నికలు జరుగుతే వరంగల్/ ఖమ్మం నుండి ముఖ్యమంత్రి కాండిడేట్ స్థాయి వున్న నాయకుడు కాంగ్రెస్ నుండి శ్రీ జమలాపురం కేశవరావు వున్నారు. కాంగ్రెస్ పార్టీ పై నిషేధం తొలగిన తరువాత ప్రప్రధమంగా శ్రీ జమలాపురం కేశవరావు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 1946-1949 వరకు పనిచేశారు. విశాలాంధ్ర భావనకు శ్రీ జమలాపురం వ్యతిరేకించాడు. పార్టీ లో ఒంటరి అయినాడు. అప్పుడే ఆయనను రాజకీయం గా అణగ దోక్కటానికి పావులు కదిపటం ప్రారంభం అయినది. 1949 హైదరాబాద్ రాష్...

57. (ఖమ్మం చరిత్ర-5) నైజాం సంస్థానంలో CPI ఆవిర్భావం -- పరిణామాలు.

Image
నైజాం సంస్థానంలో  CPI పార్టీ ఆవిర్భావం - తదనంతర పరిణామాలు. CPI పార్టీ బ్రిటిష్ ఇండియాలో 1925 సంవత్సరంలో కాన్పూర్లో అధికారికంగా ప్రారంభించ బడినది. అంతకుముందు తాష్కెంట్లో 1920 సంవత్సరంలో పార్టీమేనిఫెస్టోను తయ్యారుచేశారు. CPI వ్యవస్థాపకులు  శ్రీ మానవేంద్ర నాథరాయ్ అనే విషయం గమనార్హం. 1934 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగం అయిన ఆంధ్రఏరియాలో CPI పార్టీ ఆంధ్ర ప్రొవిన్సియల్ కమిటీ పేరిట ఆవిర్భవించింది. 1940 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియాలో కమ్యునిస్ట్ పార్టీని నిషేధించారు. 1939 సంవత్సరంలో నైజాం సంస్థానంలో CPI పార్టీ ఆవిర్భవించింది. అప్పట్లో నైజాంకు వ్యతిరేకంగా గ్రంధాలయోద్యమంతో పాటు  1). కామ్రేడ్స్ అసోసియేషన్, 2), ఆంద్ర మహాసభ, 3). మహారాష్ట్ర పరిషద్ మరియు 4). వందేమాతరం పేరిట కార్యక్రమాలు నడుస్తుండేవి. వీటిలో గ్రామీణ ప్రాంతాలలో ఆంద్రమహాసభ కార్యక్రమాల ప్రభావం ఎక్కువగా వుండేది. ఆంద్రమహాసభలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు, కామ్రేడ్స్ అసోసియేషన్ లో శ్రీ ముఖ్దూం మొహియుద్దీన్, వందేమాతరంలో శ్రీ సర్వదేవభట్ల రామనాధం లాంటి సోషలిస్ట్ ఆలోచనా విధానం కలిగిన యువకులు చురుకుగా వుండేవాళ్ళు. ఆ...

56. (NKP-9). 1991-94 మధ్యన నా జీవన పోరాటం --రాజకీయ పరిణామాలు.

Image
నా మూడవ టర్మ్ నేలకొండపల్లి సహకార గ్రామీణ బ్యాంకు ఎన్నికలు......అనంతర రాజకీయ పరిణామాలు. 1992 జనవరి నెలలో సహకార గ్రామీణ బ్యాంకు  ఎన్నికలోచ్చాయి. 1991 సంవత్సరం డిసెంబర్ నెల 25 వ తేదిన మా తండ్రి గారు మరణించారు. ఆయన మరణించిన నెలరోజులకు మొదటి మాసికం 23rd January నాడే నేలకొండపల్లి గ్రామీణ బ్యాంకు ఎన్నికలు జరిగాయి. మా తండ్రిగారి మరణంతో జరిపించవలసిన సాంప్రదాయ కార్యక్రమాలతోనే, పలుకరించ వచ్చినవారితో మాట్లాడటంతోనే నాకు సమయం సరిపోవటంతో ఎన్నికల నిర్వహణపై ఎక్కువ శ్రద్ధ చూపలేకపోయాను. ఆయన మరణించటంతోనే నా రాజకీయ జీవితం అంతమొంధించటానికి మా వ్యతిరేకులంతా సమావేశమై వ్యూహం రచించారు.ఈ సమయం దాటితే మళ్ళీ నన్ను ఎదుర్కోవటం సాధ్యం కాదని వారి భావన. నాకు అత్యంత దగ్గరగావున్న వ్యక్తులు శ్రీ వాక కృష్ణ లాంటి వాళ్ళు నన్ను వదలి వెళ్లి పోయారు. వ్యతిరేక పానెల్ లో పోటిచేశారు. మాకులం వాడైన శ్రీ భగవాన్లు లాంటి వాళ్ళు వ్యతిరేకం చేశారు. అయినా ఎన్నికలలో పోటీచేయటానికి వార్డ్ ల వారీగా పానెల్ తయ్యారు చేసి కదన రంగంలోకి దిగాము. ఎన్నికల రోజు రానే వచ్చింది. ఆ రోజు మా తండ్రి గారి మొదటి మాసికం కావటంతో సాయంకాలం దాకా నాకు ఆ కార...