43. (ఖమ్మం చరిత్ర-1) ఎక్కడుంది మన చరిత్ర? పరిశోధన తోనే చరిత్ర వెలుగు లోకి రావాలి.
ఎక్కడుంది మన చరిత్ర? ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ చిత్రమిది.దీన్ని చూస్తే ఈ ఈ ప్రాంతాల్లో ఈ స్టేట్ వుందని ఈ తరానికి కుడా తెలుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వున్న మన ఖమ్మం చరిత్ర 1952 వరకు ఏమిటి? కాంగ్రెస్ మరియు కమ్యునిస్ట్ లు ఎవ్వరు వ్రాయలేదు. కారణం తెలీదు. 1953 నుంచి ఖమ్మం జిల్లా చరిత్ర కుడా ఎవ్వరు వ్రాయలేదు. ఆత్మకధలు చరిత్ర దర్పణాలు కాదు. రష్యా విప్లవం తరువాత బ్రిటిష్ ఇండియా Communist Party సహకారంతో జరిగిన నిజాం వ్యతిరేకపోరాటం గురించి అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమకారులు గొప్పగా చెబుతారు, కాని పోరాటం ముగిసిన రెండు దశాబ్దాల తరువాత గాని పోరాట ముగింపు సమయంలో రాష్ట్ర భాద్యతలలో వున్న శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు దాని గురించి వ్రాయలేదు.అదికూడా పోరాటం నేర్పిన గుణపాటాల గురించే వ్రాసాడు. తనకు సమగ్ర సమాచారం లేదని --తెలుస్తే చెప్పమని ముగించాడు. తమ స్థానిక పార్టీ తీర్మానానికి భిన్నం గా తాము పోరాటాన్నిఅయిష్టం గా ఎలా కొనసాగిన్చాల్సి వచ్చిందో శ్రీ రావి నారాయణ రెడ్డి చెపారు. ఏదో చెప్పాలనే తాపత్రయం తో పిడికిలి తెరచిన శ్రీ దేవులపల్లి వెంకటేశ్వర రావు చె...