84. (SOCIAL...56). అంబానీ ఇంట్లో పెళ్లి.. నీకూ, నాకూ ఎందుకీ లొల్లి...
ఈ మధ్యన సోషల్ మీడియాలో "ప్రేమ్ టాక్స్" వీడియో చూశా. వెంటవెంటనే మరెన్నో వీడియోలు చూసే భాగ్యం కలిగింది. వాటి సారాంశం చూశాక నా అభిప్రాయం చెప్పాలనిపించింది. ఈ మధ్యనే అంబానీ ఇంట్లో ఆయన కొడుకు పెండ్లి జరిగింది. తనకు కావలసిన వారిని తాను పిలుచుకున్నాడు. వచ్చినవారికి తనకు నచ్చిన రీతిలో బహుమతులు ఇచ్చి సత్కరించుకున్నాడు. ప్రపంచస్థాయి కళాకారులను, నిష్ణాతులను పిల్చి అధ్భుత కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారిస్థాయిలో వారికి పారితోషికాల ఇచ్చాడు. తాను కస్టపడి, తన తెలివి తేటలతో, శక్తి యుక్తులతో శ్రమను ధారపోసి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకొని సంపాదించుకున్న సంపాదనలోంచి తాను ఖర్చు పెట్టాలనుకున్నంత కొడుకు వివాహానికి ఖర్చు పెట్టుకున్నాడు. ఆయన ప్రాధమిక హక్కులలో మన జోక్యం ఏమిటి?. ఆయన తన కుమారుని పెళ్ళిలో తాను ఖర్చుచేసిన విధానంపై మనకు అభ్యంతరం ఏమిటి?. ఈ విరుచుకుపడటాలు, అక్కసు వెళ్ళ గక్కటం ఏంటీ? నాకు చాలా విచిత్రం అనిపించింది. తన తండ్రి "బ్రిటిష్ షెల్" అనే ఇంధన కంపెనీలో 300 రూ.ల జీతంతో పనిచేసిన సాధారణ వ్యక్తి. చాలా క్రిందిస్థాయి నుండి పైకెదిగి తన వ్యాపారసామ్రాజ్యాన్ని స్థాపించుకున